Nawazuddin Siddiqui: ఒక్క సినిమా క్లిక్‌ అయ్యిందంటే చాలు రెమ్యునరేషన్లు భారీగా పెంచేస్తారు నటీనటులు. ఇక ఒక్క హిట్‌ పడిందంటే చాలు ఒకేసారి కోట్ల రూపాయల్లో పెంచేస్తారు. దాంట్లో బాలీవుడ్‌ నటీనటులు ఎక్కువగానే ఉంటారని చెప్పాలి. తాజాగా బాలీవుడ్‌ స్టార్స్‌ తీసుకునే రెమ్యూనరేషన్స్‌పై సీనియర్‌ నటుడు నవాజుద్దీన్‌ సిద్ధీఖీ సంచలన కామెంట్స్‌ చేశారు. బాలీవుడ్‌లో ఒక్కో యాక్టర్‌ సినిమాకి తక్కువలో తక్కువ పది కోట్ల రూపాయలు సంపాదిస్తారని అన్నారు ఆయన. 'అన్‌ఫిల్టర్డ్ విత్‌ సందీశ్‌' అనే ప్రోగ్రామ్‌కి వచ్చిన ఆయన ఈ విషయాలు చెప్పారు. 


బేరాలు ఆడను.. 


'అన్‌ఫిల్టర్డ్ విత్‌ సందీశ్‌' షోకి వచ్చిన ఆయన్ను హోస్ట్‌ కొన్ని ప్రశ్నలు అడిగాడు. బాలీవుడ్‌ నటుల రెమ్యునరేషన్‌ ఎంత ఉంటుందనే ప్రశ్నకు బదులిస్తూ.. "ఒక్కొక్కరు చాలానే సంపాదిస్తారు" అని అన్నారు. దానికి హోస్ట్‌ మరోసారి "అదే ఎంత? ఒక పదికోట్ల రూపాయలు'' అంటే.. "ఇంచుమించు అంతే.. అంతకంటే కొంచెం ఎక్కువ కూడా" అని అన్నారు సిద్ధిఖి. 


రెమ్యునరేషన్‌లో బేరాలు ఆడతారా? అనే ప్రశ్నకు తానైతే బేరాలు ఆడనని అన్నారు ఆయన. "ఇక్కడ నటీనటుల టాలెంట్‌ను బట్టి రెమ్యునరేషన్‌ ఇస్తారు. వాళ్లకు ఎంత ఇవ్వాలనుకుంటే అంతే ఇస్తారు. ఒకవేళ ఎక్కువ అడిగినా.. మేము చెప్పిన అమౌంట్‌ కంటే నీకు ఎక్కువ అడిగే, తీసుకునే అర్హత ఉందా? అని మొహం మీదే ప్రశ్నిస్తారు. అందుకే, నేను ఎక్కువగా డిమాండ్‌ చేయను. ఇచ్చిందే తీసుకుంటాను. తాను కొన్ని సినిమాలు డబ్బు సంపాదించాలనే ఉద్దేశంతో చేస్తానని, ఇంకొన్ని సినిమాలు ఉచితంగా కూడా చేయగలనని అన్నారు. తాను అదే విషయాన్ని ప్రొడ్యూసర్స్‌కి కూడా చెప్తానని, అందుకే 'మ్యాంటో' లాంటి సినిమా ఆఫర్లు వచ్చినట్లు చెప్పారు సిద్ధిఖీ. 


చిన్న పాత్రలు చేయడం ఆపేశానని, 25 కోట్ల రూపాయల రెమ్యునరేషన్‌ ఇచ్చినా చిన్న పాత్రలు ఇక చేయనని అన్నారు ఆయన. కెరీర్‌లో చాలా చాలా చిన్న రోల్స్‌ చేశానని, ఇక ఇప్పుడు అలా చేసే ఉద్దేశం లేదని చెప్పారు సిద్ధిఖీ. కాగా.. సిద్ధిఖీ ప్రస్తుతం సెక్షన్‌ 108లో నటిస్తున్నారు. దాంట్లో అర్బాజ్‌ఖాన్‌, రెజీనా ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు.  


ఇక సంక్రాంతి బరిలో నిలిచిన 'సైంధవ' సినిమాలో నటించారు సిద్ధిఖీ. విలన్‌ పాత్ర పోషించారు ఆయన. తన పాత్రకు తానే డబ్బింగ్‌ చెప్పుకున్నారు. ఈ సినిమాలో తాను హైదరాబాదీ క్యారెక్టర్‌ కావడంతో.. అందులో తెలుగు, హిందీ కలగలిపి ఉంటుంది కాబట్టి ఆయనే స్వయంగా డబ్బింగ్‌ చెప్పుకున్నారు. బాలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఈయన.. చాలా ఏళ్ల తర్వాత వెంకటేశ్‌ నటించిన తన 75వ చిత్రమైన "సైంధవ"తో తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక వెంకటేశ్‌తో నటించడం ఆయన డ్రీమ్‌ అని అది ఫుల్‌ఫిల్‌ అయ్యిందని అన్నారు సిద్ధిఖీ. వెంకటేశ్‌ చేసే సినిమాలంటే తనకు చాలా ఇష్టమని, ఫ్యామిలీ సెంటిమెంట్‌ తీస్తారని సిద్దిఖీ చెప్పారు. అలా 'సైంధవ' ప్రాజెక్ట్‌ మీద ఉన్న తన ప్రేమను చాలాసార్లు వ్యక్తపరిచారు సిద్ధిఖీ.


Also Read: మా మధ్య ఏదో ఉందన్నారు - దర్శకుడి మాటలకు స్టేజ్‌పైనే ఏడ్చేసిన పూర్ణ