Nawazuddin Siddiqui about Venkatesh: తెలుగు సినిమా అనేది ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న తర్వాత.. ఎంతోమంది బాలీవుడ్ నటీనటులు కూడా తెలుగు సినిమాల్లో నటించడానికి ముందుకొస్తున్నారు. ఇక ఈ లిస్ట్‌లోకి తాజాగా యాడ్ అయ్యారు నవాజుద్దీన్ సిద్ధికీ. వెంకటేశ్ 75వ చిత్రమైన ‘సైంధవ్’ మూవీలో నవాజుద్దీన్.. విలన్‌గా నటించారు. బాలీవుడ్‌లో వర్సటైల్ యాక్టర్‌గా పేరు తెచ్చుకున్న ఈయన.. ఇన్నాళ్ల తర్వాత తెలుగులో డెబ్యూ చేయడానికి ముందుకొచ్చారు. దీంతో ‘సైంధవ్’ షూటింగ్ అనుభవాల గురించి, వెంకటేశ్‌తో కలిసి పనిచేయడం గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నవాజ్.
అదే నా డ్రీమ్ రోల్..
‘‘నేను అన్నిరకాల విలన్ రోల్స్‌ను ప్లే చేశాను. కానీ సైంధవ్‌లోని పాత్ర నన్ను ఎగ్జైట్ చేసింది. నేను పాత్రలు హీరోలు, విలన్స్ అని వేరు చేసి చూడను. నన్ను ఎగ్జైట్ చేసే పాత్ర అయితే చాలు. ఒక్కొక్కసారి పాజిటివ్ పాత్రలకంటే నెగిటివ్ పాత్రల్లోనే నటించడానికి స్కోప్ ఎక్కువ ఉంటుంది. అలాంటి ఒక పాత్రనే నాకోసం శైలేష్ సిద్ధం చేశాడు. నాకు అవకాశం వస్తే.. ఓషో బయోపిక్‌లో ఓషోగా నటించాలని ఉంది’’ అంటూ ‘సైంధవ్‌లో తన పాత్ర గురించి మాట్లాడుతూనే తన డ్రీమ్ రోల్ గురించి బయటపెట్టారు నవాజుద్దీన్ సిద్దికీ. అయితే ట్రైలర్‌ను బట్టి చూస్తే ‘సైంధవ్’లో నవాజుద్దీన్.. తన పాత్రకు తానే డబ్బింగ్ చెప్పుకున్నట్టు అనిపించింది. అయితే తెలుగు నేర్చుకోవడానికి తాను పడిన కష్టాల గురించి కూడా ఈ నటుడు బయటపెట్టాడు.
డూప్ లేకుండానే చేశారు..
‘‘వేరే ఎవరో మనకు డబ్బింగ్ చెప్తే.. అది నాకు అంతగా నచ్చదు. నా క్యారెక్టర్ ఇందులో హైదరాబాదీ. అందుకే ఆ పాత్ర తెలుగుతో పాటు హిందీ కూడా మాట్లాడుతుంది కాబట్టి నాకు పరవాలేదనిపించింది. కొత్త భాషను నేర్చుకోవడం కష్టమే. కానీ నేను ప్రాంప్టర్స్‌ను నమ్మను. అందుకే సినిమాలో మంచిగా కనిపించడం కోసం ముందే సెట్స్‌లో నేను నా లైన్స్‌ను ముందే చదివేసుకొని గుర్తుపెట్టుకునేవాడిని. ఈ కష్టమంతా వృథా అవ్వదు అని నేను నమ్ముతున్నాను. వెంకటేశ్ నుంచి నేర్చుకోవడానికి చాలా ఉంటుంది. తనతో షూటింగ్ చేయడం మంచి అనుభూతిని ఇచ్చింది. ఆయన యాక్షన్ సీన్స్ అన్నీ డూప్ లేకుండానే చేశారు. ఆయనలోని కొత్త కోణాన్ని ఈ సినిమాలో చూస్తారు. ఆయనకు చాలా ఓపిక ఉందని నేను గమనించాను. అదే నేను ఆయనలో నుంచి నేర్చుకోవాలని అనుకుంటున్నాను’’ అని నవాజుద్దీన్ అన్నాడు.
సముద్రంలో పడలేదు..
‘సైంధవ్’ షూటింగ్ సమయంలో మర్చిపోలేని సంఘటన గురించి చెప్తూ.. ‘‘ఒకసారి మేము శ్రీలంకలో షూట్ చేస్తున్న సమయంలో నేను దాదాపు బోటులో నుంచి పడిపోబోయాను. ఒక పెద్ద అల రావడంతో నేను బ్యాలెన్స్ కోల్పోయి బోటు నుంచి ఎగిరిపోయాను. నా అదృష్టవశాత్తు మళ్లీ బోటులోనే పడ్డాను సముద్రంలో కాకుండా. ఇదంతా కెమెరాలో రికార్డ్ అయ్యింది. సినిమాలో ఈ షాట్ ఉంటుంది కూడా. ఆడియన్స్‌కు ఇది చాలా నచ్చుతుందని నేను బలంగా నమ్ముతున్నాను’’ అని సీరియస్ విషయం గురించి చాలా ఫన్నీగా చెప్పేశారు నవాజుద్దీన్ సిద్దికీ. ఇక ‘సైంధవ్’ మూవీ జనవరి 13న థియేటర్లలో విడుదలకు సిద్ధమయ్యింది.
Also Read: ‘సైంధవ్’లో సారా పాపే హీరో, సినిమా బ్రహ్మాండంగా ఉంటుంది - ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో వెంకటేశ్