యువ కథానాయకుడు నవీన్ పోలిశెట్టి (Naveen Polishetty)లో చాలా ట్యాలెంట్స్ ఉన్నాయి. ఆయనలో రైటర్ ఉన్నాడు. తన సీన్స్, డైలాగ్స్ ఇంప్రవైజ్ చేస్తారని దర్శక రచయితలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. రచన మాత్రమే కాదు... ఈ హీరో ఇప్పుడు సంగీతంలోనూ అడుగు పెడుతున్నాడు. ఆయన కథానాయకుడిగా రూపొందుతున్న తాజా సినిమా 'అనగనగా ఒక రాజు'లో ఫస్ట్ సాంగ్ పాడారు.
భీమవరం బలమా... నవీన్ పోలిశెట్టి పాడారమ్మా! Anaganaga Oka Raju First Single Bhimavaram Balma: 'అనగనగా ఒక రాజు' చిత్రాన్ని శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా ప్రొడ్యూస్ చేస్తున్నారు. మారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్నారు.
మిక్కీ జే మేయర్ సంగీతంలో నవీన్ పోలిశెట్టి ఓ పాట పాడారు. సినిమా నుంచి మొదటి గీతంగా ఆ పాటను విడుదల చేయనున్నారు. 'భీమవరం బలమా' అంటూ సాగే ఈ పాటను ఈ నెల (నవంబర్ 27న) విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా విడుదల గాయకురాలు సమీరా భరద్వాజతో కలిసి ఓ స్పెషల్ వీడియో చేశారు నవీన్ పోలిశెట్టి. అందులో ఆయన శైలి వినోదం వీక్షకులను ఆకట్టుకుంటోంది.
Also Read: రాముడిగా నటిస్తూ మటన్ తింటావా? వెజిటేరియన్‌గా మారడం అబద్ధమేనా? రణబీర్‌పై పబ్లిక్ ఫైర్
నవీన్ జంటగా మీనాక్షి...సంక్రాంతికి సినిమా విడుదల!'అనగనగా ఒక రాజు' సినిమాలో నవీన్ పోలిశెట్టికి జంటగా మీనాక్షి చౌదరి కథానాయికగా నటిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి సినిమా థియేటర్లలోకి రానుంది. జనవరి 14న సినిమా విడుదల చేయనున్నట్లు ఆల్రెడీ అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే.