యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ప్రస్తుతం థియేటర్స్ లో సందడి చేస్తున్న విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7న విడుదలైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద డీసెంట్ హిట్ అందుకుంది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లోనూ మంచి కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇప్పటికే సినిమాపై రాజమౌళి, మహేష్ బాబు, రవితేజ లాంటి స్టార్స్ ప్రశంసలు కురిపించారు. అయితే ఈ మూవీ సక్సెస్ ఎంజాయ్ చేస్తున్న నవీన్ పోలిశెట్టి కి ఓ హీరో చేసిన ట్వీట్ చూసి అసలు నిద్ర పట్టలేదట? ఇంతకీ ఆ హీరో ఎవరు? అనే వివరాలకు వెళ్తే.. UV క్రియేషన్స్ బ్యానర్ పై నవీన్ పోలిశెట్టి, అనుష్క జంటగా నటించిన 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.


సినిమాలో కామెడీతో పాటు ఎమోషన్‌కు ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు. ఇప్పటికే విమర్శకుల నుంచి ప్రశంసలు కూడా అందుకుంటుంది ఈ చిత్రం. పి మహేష్ బాబు డైరెక్ట్ చేసిన ఈ మూవీ సక్సెస్ పై తాజాగా నవీన్ పోలిశెట్టి స్పందించారు. ఆడియన్స్ ఇచ్చిన సక్సెస్ కి కృతజ్ఞతలు తెలిపాడు. ఈ క్రమంలోనే సోషల్ మీడియాలో ఓ వీడియోను కూడా షేర్ చేశాడు. ఇక ఈ వీడియోలో నవీన్ చాలా విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం వర్జీనియాలో ఉన్నట్లు తెలిపాడు. అలాగే ప్రమోషన్స్ కోసం సియాటెల్ వెళుతున్నట్లు పేర్కొన్నాడు. అయితే వర్షం కారణంగా విమానాలు లేకపోవడంతో 15 గంటలుగా ఎయిర్పోర్ట్ లోనే ఉన్నట్లు చెప్పారు.


అంతేకాకుండా ఇతర భాష సినిమాలతో పాటు తను నటించిన సినిమాను విడుదల చేయడంపై మొదట్లో కంగారు పడ్డానని, అయితే ప్రేక్షకుల నుంచి తన సినిమాకు వస్తున్న ఆదరణ చూసి ఎంతో సంతోషంగా ఉందని తెలిపాడు. 'మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి' సినిమాను ప్రేక్షకులతో పాటు పలువురు సినీ ప్రముఖులు సెలబ్రిటీలు కూడా అభినందించడంపై ఎంతో సంతోషంగా ఉందని పేర్కొన్నాడు. అలా సినిమాపై కొంతమంది సెలబ్రిటీలు చేసిన ట్వీట్స్ పై నవీన్ ఈ వీడియోలో మాట్లాడారు. ముఖ్యంగా సూపర్ స్టార్ మహేష్ బాబు చేసిన ట్వీట్ చూసిన తర్వాత తనకు రాత్రి అంతా నిద్ర పట్టలేదని అన్నాడు. త్వరలోనే తిరిగి ఇండియాకి వస్తానని, ప్రేక్షకుల్ని కలుసుకుంటానని ఈ వీడియోలో చెప్పుకొచ్చాడు నవీన్ పోలిశెట్టి. దీంతో ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతుంది.


ఇక ఇప్పటికే 'మిస్ షెట్టి మిస్టర్ పొలిశెట్టి' కలెక్షన్స్ పరంగా బ్రేక్ ఈవెన్ దిశగా దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది షారుఖ్ ఖాన్ 'జవాన్' కి పోటీగా విడుదలైన ఈ సినిమా మొదటి రోజు యావరేజ్ కలెక్షన్స్ రాబట్టినా, ఆ తర్వాత నుంచి పుంజుకుంది. మొదటి రోజు కంటే ఆదివారం రోజున ఈ చిత్రానికి డబుల్ కలెక్షన్స్ రావడం విశేషం. ఈ మేరకు ఆదివారం రోజున ఈ మూవీ రూ.9 కోట్ల గ్రాస్ ని, నాలుగున్నర కోట్లకు పైగా షేర్ ని సాధించినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రూ.13 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో థియేటర్స్ లో విడుదలైన ఈ మూవీ ఇప్పటికే రూ.6 కోట్లకు పైగా గ్రాస్ ని పన్నెండున్నర కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసినట్టు తెలుస్తోంది. మరో రూ.50 లక్షలు కలెక్ట్ చేస్తే ఈ సినిమా లాభాల్లోకి వచ్చే అవకాశం ఉందని సమాచారం.


Also Read : ఆకట్టుకుంటున్న 'జిగర్తాండ డబుల్ ఎక్స్' టీజర్ - లారెన్స్ ఊర మాస్ పెర్ఫార్మెన్స్!




Join Us on Telegram: https://t.me/abpdesamofficial