Naveen Polishetty Anaganaga Oka Raju First Single To Release Soon Special Promo Out: టాలీవుడ్ యంగ్ హీరో నవీన్ పోలిశెట్టి లేటెస్ట్ ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్టైనర్ 'అనగనగా ఒక రాజు'. ఈ సంక్రాంతికి మూవీ ప్రేక్షకుల ముందుకు రానుండగా ఇప్పటికే రిలీజ్ అయిన గ్లింప్స్, లుక్స్ అదిరిపోయాయి. ఇక హీరో నవీన్ డిఫరెంట్‌గా ప్రమోషన్స్ షురూ చేశారు. దీపావళి సందర్భంగా ఓ స్పెషల్ ప్రోమో రిలీజ్ చేశారు. సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ కానుంది.
ఫస్ట్ సింగిల్ ఎప్పుడంటే?
దీపావళి ప్రోమో మూవీపై అంచనాలను అమాంతం పెంచేసింది. ఈ సంక్రాంతికి వినోదాల విందు, నవ్వుల అల్లరి, అసలైన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు నవీన్ తెలిపారు. ఎలాన్ మస్క్ నుంచి దేశంలో పెద్దల పేర్లను సైతం ప్రోమోలో వాడేశారు. ఫన్ డైలాగ్స్‌తో ఎంటర్టైన్ చేస్తూనే 'అనగనగా ఒక రాజు'తో ఫుల్ మాస్ ట్రీట్ ఇవ్వనున్నట్లు కన్ఫర్మ్ చేశారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. మూవీ నుంచి ఫస్ట్ సింగిల్ త్వరలోనే రిలీజ్ కానుండగా... టీజర్, ట్రైలర్ ఒకదాని తర్వాత ఒకటి సంక్రాంతి వరకూ దీపావళే అంటూ హైప్ ఇచ్చారు.
Also Read: దీపావళి ఛాంపియన్ కిరణ్ అబ్బవరం 'కె ర్యాంప్' - ఫస్ట్ డేను మించి రెండో రోజు కలెక్షన్స్
కోనసీమ జిల్లాలో యువతి యువకుడి మధ్య లవ్ ట్రాక్, సంక్రాంతి సంబరాలు, ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ అన్నీ కలిపి మూవీలో చూపించబోతున్నట్లు గ్లింప్స్‌ను బట్టి తెలుస్తోంది. ఈ మూవీకి మారి దర్శకత్వం వహిస్తుండగా... నవీన్ సరసన మీనాక్షి చౌదరి హీరోయిన్‌గా నటిస్తున్నారు. వీరితో పాటు రావు రమేష్ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.