Kiran Abbavaram's K Ramp 2 Days World Wide Box Office Collection: టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ 'కె ర్యాంప్' దీపావళి ఛాంపియన్‌గా నిలిచింది. బాక్సాఫీస్ వద్ద ఫస్ట్ డేను మించి రెండో రోజు కలెక్షన్లలో కూడా అదే జోష్ కంటిన్యూ చేసింది. 

Continues below advertisement


2 రోజుల కలెక్షన్స్ ఎంతంటే?


ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా 2 రోజుల్లో రూ.11.3 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు మూవీ టీం వెల్లడించింది. ఫస్ట్ డే రూ.4.5 కోట్ల గ్రాస్ వసూలు చేయగా... రెండో రోజు రూ.6.8 కోట్ల వసూళ్లు సాధించింది. ఇండియావ్యాప్తంగా ఫస్ట్ డే రూ.2.15 కోట్ల నెట్ వసూళ్లు సాధించగా... తెలుగు రాష్ట్రాల్లోనూ మంచి కలెక్షన్స్ రాబట్టింది. ఇక థియేటర్లలో వీకెండ్, దీపావళి కలిసి 40 శాతానికి పైగా ఆక్యుపెన్సీతో రన్ అవుతున్నట్లు తెలుస్తోంది.


మాస్, యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు. థియేటర్లలో ఫ్యామిలీతో కలిసి మూవీ చూసి ఎంజాయ్ చెయ్యొచ్చంటూ కిరణ్ అబ్బవరం ప్రమోషన్లలో చేసిన కామెంట్స్ నిజమయ్యాయి. ఆయన అందరినీ థియేటర్లకు రప్పించడంలో సక్సెస్ అయ్యారు. బీ, సీ సెంటర్లలో మూవీ మంచి కలెక్షన్స్ రాబడుతోంది. ఈ మూవీకి క్రిటిక్స్ నుంచి వచ్చిన రివ్యూస్‌తో సంబంధం లేకుండా అన్నీ వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ డీసెంట్ వసూళ్లు సాధించింది.






Also Read: శర్వాను ఇలా ఎప్పుడైనా చూశారా? - 'బైకర్'గా వస్తున్నాడు... ఫ్యామిలీ ఆడియన్స్ To యూత్ ట్రెండ్‌కు మారారా?


ఈ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహించగా... కిరణ్ అబ్బవరం సరసన యుక్తి తరేజా హీరోయిన్‌గా నటించారు. వీరితో పాటే సీనియర్ హీరో నరేష్, కమెడియన్ వెన్నెల కిషోర్, మురళీధర్ గౌడ్, శివన్నారాయణ, అలీ కీలక పాత్రలు పోషించారు. హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ బ్యానర్‌పై రాజేష్ దండ, శివ బొమ్మకు సంయుక్తంగా నిర్మించగా... చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు.


రిచ్ కుటుంబంలో పుట్టిన ఓ యువకుడు ఎంజాయ్ చేస్తుండగా అతన్ని గాడిన పెట్టాలనుకున్న తండ్రి కేరళ పంపిస్తాడు. అక్కడ ఫుల్‌గా మందు కొట్టి ప్రమాదంలో పడ్డ అతన్ని ఓ అమ్మాయి సేవ్ చేస్తుంది. తొలిచూపులోనే ఆమెతో లవ్‌లో పడ్డ ఆ యువకుడు తన ప్రేమ విషయం చెప్పాలని అనుకునే లోపు ఆ అమ్మాయికి వేధిస్తున్న సమస్య తెలుస్తుంది. అసలు ఆ సమస్య ఏంటి? ఆ ప్రాబ్లమ్ తెలిసిన తర్వాత కూడా ఆమెకు దగ్గరయ్యాడా? అనేదే కె ర్యాంప్ స్టోరీ.