Actor Navdeep About Pawankalyan: హీరో న‌వ‌దీప్ హీరోగా సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన‌ప్ప‌టికీ ప్ర‌స్తుతం ఆయ‌న మంచి మంచి క్యారెక్ట‌ర్లతో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్నారు. ఇక ఇప్పుడు ఆయ‌న త‌న సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయ‌బోతున్నారు. న‌వ‌దీప్ 2.0 గా 'ల‌వ్ మౌళి' సినిమాతో హీరోగా రాబోతున్నారు. ఆ సినిమా ప్ర‌చారంలో బిజీ బిజీగా ఉన్నారు ఆయ‌న‌. సినిమా టీమ్‌తో క‌లిసి వివిధ సెంట‌ర్లు తిరుగుతున్నారు. దాంట్లో భాగంగా శ్రీ‌పాద శ్రీ వ‌ల్ల‌భ గుడిని ద‌ర్శించుకున్నారు న‌వదీప్, చిత్ర‌బృందం. ఈసంద‌ర్భంగా ఆయ‌న మీడియాతో మాట్లాడారు. 


ప‌వ‌న్ క‌ల్యాణ్ కి నా స‌పోర్ట్. .. 


సినిమా ప్ర‌మోష‌న్స్ లో భాగంగా ఏపీలోని ప‌లు జిల్లాల్లో తిరుగుతుంది ల‌వ్ మౌళి చిత్రం.  ఈనేప‌థ్యంలో వాళ్లు పిఠాపురంలోని శ్రీ పాద శ్రీ వ‌ల్ల‌భుని ద‌ర్శించుకున్నారు. అనంతరం మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కు ఆయ‌న స‌మాధానాలు చెప్పారు. ఫిలిమ్ ఇండ‌స్ట్రీ నుంచి పోటీ చేస్తున్నారు క‌దా?  వాళ్ల‌కు స‌పోర్ట్ ఇస్తారా? అని అడిగిన ప్ర‌శ్న‌కి న‌వ‌దీప్ ఇలా స‌మాధానం చెప్పారు. "నిజాయ‌తి గ‌ల వారికి, డ‌వ‌ల‌ప్ మెంట్ చేసిన వాళ్ల‌కి ఓటు వేయాల‌ని ప్ర‌జ‌ల‌కు తెలుసు. మంచి చేస్తార‌ని, నిజాయితీగా ఉంటార‌నే న‌మ్మ‌కం వాళ్ల‌కు క‌లిగితే ఓట్లు వేస్తారు. ఇక కచ్చితంగా ప‌వ‌న్ క‌ల్యాణ్ గారికి స‌పోర్ట్ చేస్తాను" అని చెప్పారు న‌వ‌దీప్. దీంతో వైసీపీ మద్దతుదారులు నవదీప్‌ను టార్గెట్ చేసుకున్నారు.


ఇది నా సెకెండ్ ఇన్నింగ్స్.. 


హీరోగా ఇది త‌న‌కు సెకెండ్ ఇన్నింగ్స్ గా భావిస్తున్న‌ట్లు చెప్పారు న‌వ‌దీప్. "హీరోగా ఇది నా సెకెండ్ ఇన్నింగ్స్ అనుకుంటున్నాను. ఈ సినిమా చాలా క‌ష్ట‌ప‌డి, ఇష్ట‌ప‌డి చేశాం. అందుకే, ప్ర‌జ‌ల్లోకి తీసుకెళ్లాలి అనుకుంటున్నాం. వైజాగ్, విజ‌య‌వాడ‌, కాకినాడ‌, రాజ‌మండ్రి త‌దిత‌ర ఊర్లు తిరుగాం. ఈ సినిమా పాయింట్ జ‌నాల‌కి తెలియాలి, వాళ్ల‌కు చేరాల‌నే ఉద్దేశంతో ఇలా ప్ర‌చారం చేస్తున్నాం. ప్రేమ‌, పెళ్లి, ఫ్యామిలీ ఒద్దు అనుకున్న ఒక ఆర్టిస్ట్ ప్రేమ‌లో ఎలా ప‌డ్డాడో అనేది సినిమా" అని సినిమా గురించి చెప్పారు న‌వ‌దీప్. 


చాలా క‌ష్ట‌ప‌డ్డాం... 


ఈ సినిమా కోసం చాలా క‌ష్ట‌ప‌డ్డాం అని న‌వ‌దీప్ అన్నారు. మేఘాల‌యా షూట్ లో కూడా చాలా ఇబ్బందులు ప‌డ్డామ‌న్నారు. త‌న ఆలోచ‌న‌లకు ద‌గ్గ‌ర‌గా ఈ సినిమా ఉంద‌ని, క‌చ్చితంగా హిట్ అవుతుంద‌నే న‌మ్మ‌కం త‌న‌కు ఉంద‌ని చెప్పుకొచ్చాడు న‌వ‌దీప్. ట్రైల‌ర్ లాంచ్ ఈవెంట్ లో ఆయ‌న ఈ విష‌యాలు చెప్పారు. సినిమా చూసి, హిట్ చేయాల‌ని, మీ చేతుల్లో పెడుతున్నాను అని ప్రేక్ష‌కుల‌ను కోరారు న‌వ‌దీప్. 


డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో.. 


ఈ సినిమాని డిఫ‌రెంట్ కాన్సెప్ట్ తో తీస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. టీజ‌ర్ ఎంతో మంది దృష్టిని ఆక‌ర్షించింద‌నే చెప్పాలి. టీజర్ ప్రారంభమే ఒంటి మీద నూలు పోగు లేకుండా నవదీప్ కనిపించారు. మందు బాటిల్ పగలగొట్టి వైవిధ్యంగా కనిపించారు. సినిమాలో హీరో హిప్పీ తరహా రోల్ చేశారని అర్థం అవుతోంది. ఇక ల‌వ్ మౌళి సినిమాని నైరా క్రియేషన్స్, శ్రీకర స్టూడియోస్ సంస్థలతో కలిసి సి స్పేస్ నిర్మించింది. దీనికి అవ‌నీంద్ర ద‌ర్శ‌కత్వం వహించారు. ఈ సినిమా మ్యూజిక్ కూడా బాగానే ఆక‌ట్టుకుంది. ఈ సినిమా జ్యూక్ బాక్స్ ని మాస్ మ‌హ‌రాజ ర‌వితేజ ఆవిష్క‌రించారు. 


Also Read: వామ్మో.. ‘పుష్ప 2’లో గంగమ్మ జాతర సీన్ కోసం అన్ని కోట్లు ఖర్చుపెట్టారా? 5 చిన్న సినిమాలు తియొచ్చేమో!