Salman Khan: సినీ పరిశ్రమలో ఉన్న చాలామంది సెలబ్రిటీలకు వేర్వేరు సెంటిమెంట్స్ ఉంటాయి. అలాగే బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌కు కూడా ఒక సెంటిమెంట్ ఉంది. తన సినిమా రంజాన్‌కు విడుదలయితే అది కచ్చితంగా హిట్ అవుతుందని ఈ హీరో బలంగా నమ్ముతాడు. అది నిజమే అనట్టుగా ఇప్పటివరకు ఈద్‌కు విడుదలయిన తన ప్రతీ సినిమా బాక్సాఫీస్ దగ్గర రికార్డ్ స్థాయి కలెక్షన్స్ సాధించాయి. ఇక ఈ ఏడాది రంజాన్‌కు ఏ సినిమాను సిద్ధం చేయకుండా తన అప్‌కమింగ్ మూవీ షూటింగ్‌పై ఫుల్‌గా ఫోకస్ పెట్టారు సల్మాన్. ఈద్‌కు సినిమాతో రాకపోయినా తన అప్‌కమింగ్ మూవీ అప్డేట్‌తో వచ్చేశారు.


టైటిల్ ఫిక్స్..


సల్మాన్ ఖాన్, మురుగదాస్ కలిసి ఎన్నో ఏళ్లుగా ఒక సినిమాను చేయాలని ప్లాన్ చేస్తున్నారు. కానీ ఇన్నేళ్లుగా అది వర్కవుట్ అవ్వలేదు. తాజాగా వీరిద్దరి కాంబినేషన్‌లో మూవీ తెరకెక్కనుందని ప్రకటన విడుదలయ్యింది. ఇక రంజాన్ సందర్భంగా ఈ కాంబినేషన్‌లో రానున్న మూవీ టైటిల్‌ను రివీల్ చేయడంతో పాటు రిలీజ్ డేట్‌ను కూడా స్వయంగా ప్రకటించారు సల్మాన్ ఖాన్. మురుగదాస్‌తో తాను చేస్తున్న మూవీకి ‘సికందర్’ (Sikandar) అనే టైటిల్‌ను ఫిక్స్ చేసినట్టుగా రివీల్ చేశారు. అంతే కాకుండా ఈ టైటిల్ పోస్టర్‌ ద్వారా రిలీజ్ డేట్‌ను కూడా ప్రకటించారు. ఈ ఏడాది మిస్ అయినా వచ్చే ఏడాది రంజాన్‌కు ‘సికందర్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు సల్మాన్.






బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్..


‘సికందర్’ టైటిల్‌ను తన సోషల్ మీడియాలో షేర్ చేసిన సల్మాన్ ఖాన్.. దానికి ఒక ఆసక్తికరమైన క్యాప్షన్‌ను జతచేశాడు. ‘ఈ ఈద్‌కు ‘బడే మియా చోటే మియా, ‘మైదాన్’ను చూడండి. వచ్చే ఈద్‌కు సికిందర్‌ను వచ్చి కలవండి’ అని తెలిపారు సల్మాన్ ఖాన్. ఇక తన ఫ్యాన్స్ అందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలిపాడు. నెలరోజుల క్రితం మార్చి 12న తన సోషల్ మీడియా ద్వారా మురుగదాస్‌తో కలిసి సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు సల్మాన్. వెంటనే నెలరోజుల తర్వాత ఈ మూవీ టైటిల్ కూడా రివీల్ చేయడంతో బ్యాక్ టు బ్యాక్ అప్డేట్స్ చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. మురుగదాస్, సల్మాన్ ఖాన్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘సికిందర్’ను సాజిద్ నడియాద్వాల నిర్మిస్తున్నారు.


హిట్ కాంబినేషన్..


సల్మాన్ ఖాన్, సాజిద్ నడియాద్వాల కాంబినేషన్‌లో ఇప్పటికే పలు సూపర్ హిట్ సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అంతే కాకుండా బాలీవుడ్‌లో స్టార్ నిర్మాతగా గుర్తింపు తెచ్చుకున్న సాజిద్.. సల్మాన్ హీరోగా నటించిన ‘కిక్’తోనే దర్శకుడిగా కూడా మారారు. ఇక మురుగదాస్ సైతం తాను తమిళంలో తెరకెక్కించిన బ్లాక్‌బస్టర్ చిత్రాలను హిందీలో కూడా రీమేక్ చేస్తూ హిట్లు సాధించారు. ముందుగా తమిళంలో హీరో సూర్యతో తీసిన ‘గజిని’ని అదే టైటిల్‌తో హిందీలో అమీర్ ఖాన్‌తో చేశారు. డైరెక్టర్‌గా బాలీవుడ్‌లో తన మొదటి మూవీతోనే రూ.100 కోట్ల క్లబ్‌లో చేరిపోయారు. తమిళంలో విజయ్‌తో తెరకెక్కించిన ‘తుపాకీ’ని.. హిందీలో అక్షయ్ కుమార్’తో ‘హాలీడే’గా తీశారు.



Also Read: నేను ఎలాంటి ఫిర్యాదు చేయలేదు - అది ఇప్పటి ఫోటో కాదు : విజయ్ దేవరకొండ