Imman Twitter Account Hacked: ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ X అకౌంట్ హ్యాక్... అభిమానులను అలర్ట్ చేస్తూ మ్యూజిక్ డైరెక్టర్ పోస్ట్

Tamil composer D Imman's X account hacked : మ్యూజిక్ డైరెక్టర్ డి ఇమ్మాన్ X ఖాతా హ్యాక్ అయ్యింది. దీంతో తన అకౌంట్ లో షేర్ చేసే పోస్ట్ లు, లింక్స్ పై క్లిక్ చేయవద్దు అంటూ ఓ నోట్ ను రిలీజ్ చేశారు.

Continues below advertisement

ప్రముఖ తమిళ మ్యూజిక్ డైరెక్టర్ సింగర్ డి ఇమ్మాన్ ఎక్స్ ఎకౌంట్ హ్యాక్ అయ్యింది. తాజాగా ఈ విషయాన్ని ఆయన ఇన్స్టాగ్రామ్ లో ఓ పోస్ట్ ద్వారా వెల్లడించారు. అలాగే తన హ్యాక్ అయిన ట్విట్టర్ ఎకౌంట్ నుంచి వచ్చే మోసపూరిత మెసేజ్ లు, పోస్టుల గురించి అప్రమత్తంగా ఉండాలని అభిమానులను హెచ్చరించారు.

Continues below advertisement

మ్యూజిక్ డైరెక్టర్ ట్విటర్ అకౌంట్ హ్యాక్ 
గురువారం రోజు నేషనల్ అవార్డు విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఇమ్మాన్ అకౌంట్లో ఎలన్ మస్క్ రాసిన మీమ్ ను రీ పోస్ట్ చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ మ్యూజిక్ డైరెక్టర్ ఇలాంటి పని ఎందుకు చేశాడు ? అనే చర్చ జరుగుతుండగా, ఆయన తన ఎకౌంట్ హ్యాక్ అయిందన్న షాకింగ్ వార్తను వెల్లడించారు. ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ మేరకు ఓ సుదీర్ఘ నోట్ ను రిలీజ్ చేశారు. అందులో "అందరికీ నమస్కారం నా అఫీషియల్ ఎక్స్ అకౌంట్ హ్యాక్ అయిందని మీకు తెలియజేయాలు అనుకుంటున్నాను. హ్యాకర్ నా అకౌంట్ తో లింక్ చేసిన ఈమెయిల్, పాస్వర్డ్ ను మార్చాడు. గత 24 గంటల్లో నాకు సంబంధం లేని కంటెంట్ ను నా ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశాడు" అని పేర్కొన్నారు ఇమ్మాన్.

 Also Read: కింగ్స్టన్ ట్విట్టర్ రివ్యూ... జీవీ ప్రకాష్ ఫాంటసీ థ్రిల్లర్ గురించి నెటిజన్స్ ఏమంటున్నారంటే?

అభిమానులకు ఇమ్మాన్ హెచ్చరిక
ఈ నేపథ్యంలోనే అదే పోస్ట్ లో ఇమ్మాన్ "నేను ప్రస్తుతం ఎక్స్ సపోర్ట్ ను సంప్రదించి, వీలైనంత త్వరగా నా అకౌంట్ ను రికవరీ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. గత 20 సంవత్సరాలకు పైగా సంగీత పరిశ్రమలో ఉన్నాను. కాబట్టి, నన్ను నమ్మి, ఫాలో అవుతున్న ఫాలోవర్స్ తో కనెక్షన్ నాకు చాలా ముఖ్యమైనది. నా ఎక్స్ అకౌంట్ ను ఉపయోగించి తప్పుదారి పట్టించే లేదా అనధికార కంటెంట్ ను ఏదైనా పోస్ట్ చేస్తే, దాని నుంచి జాగ్రత్తగా ఉండండి. ప్రస్తుతానికి నా అకౌంట్ నుంచి ఏవైనా అనుమానాస్పద పోస్టులు లేదా మెసేజ్ లు వస్తే పట్టించుకోవద్దని నేను ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. 

ఎక్స్ వెంటనే చర్యలు తీసుకొని, నేను తిరిగి యాక్సిస్ పొందడానికి సహాయం చేయమని హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఇలాంటి టైంలో మీ సహనం, సపోర్ట్ అందించినందుకు అందరికీ ధన్యవాదాలు. నా అకౌంట్ తిరిగి నా కంట్రోల్లోకి వచ్చిన తర్వాత నేను మీకు తెలియజేస్తాను" అని ఆ పోస్ట్ ను ముగించారు. కాగా ఇమ్మాన్ ప్రముఖ భారతీయ మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అన్న విషయం తెలిసిందే. తెలుగు, తమిళ భాషల సినిమాలకు ఆయన మ్యూజిక్ కంపోజ్ చేశారు. ముఖ్యంగా ఆయన తమిళ సినిమాలతో బాగా పాపులర్ అయ్యారు. రెండు దశాబ్దాలకు పైగా తన కెరీర్లో కుమ్కి , తేరి , అన్నాత్తే వంటి ఎన్నో హిట్ సినిమాలకు సంగీతం అందించారు.  త్వరలోనే ఆయన గీత రచయిత పునీత్ రంగస్వామి దర్శకత్వం వహించే తొలిచిత్రానికి సంగీతం అందించబోతున్నారు.

Also Read: అన్‌కంఫర్టబుల్ అని చెప్పినా వినరా... 'దిల్‌రూబా' ఈవెంట్‌లో ఫోటోగ్రాఫర్లపై హీరోయిన్ రుక్సార్ థిల్లాన్ ఫైర్

Continues below advertisement