యువ కథానాయకుడు, ప్రతిభావంతుడైన నటుడు నరేష్ అగస్త్య (Naresh Agastya) కొత్త చిత్రానికి 'మరొక్కసారి' (Marokkasari Movie) టైటిల్ ఖరారు చేశారు. ఇందులో సంజనా సారథి హీరోయిన్. ఇదొక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ. నితిన్ లింగుట్ల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సీకే ఫిల్మ్ మేకర్స్ పతాకం మీద బి. చంద్రకాంత్ రెడ్డి ప్రొడ్యూస్ చేస్తున్నారు. టైటిల్ అనౌన్స్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల చేశారు.
ప్రపంచంలోనే ఎత్తైన సరస్సు దగ్గర...'మరొక్కసారి' ఓ అందమైన ప్రేమ కథా చిత్రమని, ఈ సినిమాకు విజువల్స్ మరింత అందాన్ని తీసుకు వస్తాయని దర్శక నిర్మాతలు చెప్పారు. ఇంకా మాట్లాడుతూ... ''మేం కేరళ, సిక్కిం, టిబెట్ సరిహద్దు ప్రాంతాల్లో షూటింగ్ చేశాం. ఇంతవరకు ఏ ఇండియన్ సినిమా చిత్రీకరణ చేయనటువంటి గురుడోంగ్మార్ లేక్ (Gurudongmar Lake) దగ్గర షూటింగ్ చేశాం. సముద్రమట్టానికి 5,430 మీ. ఎత్తులో... సిక్కింలో గురుడోంగ్మార్ లేక్ ఉంది. సినిమా చిత్రీకరణ అంతా పూర్తి చేశాం. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. త్వరలో విడుదల తేదీ ప్రకటిస్తాం'' అని చెప్పారు.
Also Read: మహేష్ బాబు పర్సనల్ లైఫ్ గురించి గూగుల్‌లో ఎక్కువ మంది సెర్చ్ చేసిన ప్రశ్నలు... సమాధానాలు తెల్సా?
'మరొక్కసారి' చిత్రానికి భరత్ మంచిరాజు సంగీతం అందించారు. సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయని, టాలీవుడ్ టాప్ సింగర్లు కార్తీక్, ప్రదీప్ కుమార్, దేవన్ ఏకాంబరం, జస్సీ గిఫ్ట్ పాటల్ని పాడారని దర్శక నిర్మాతలు వివరించారు.
Also Read: రియల్ హీరో... లిటిల్ హార్ట్స్ సేవియర్ మహేష్ బాబు - సూపర్ స్టార్ ఫౌండేషన్ నుంచి సాయం ఇలా పొందొచ్చు!
Naresh Agastya's Marokkasari Movie Cast And Crew: నరేష్ అగస్త్య, సంజనా సారథి జంటగా నటిస్తున్న 'మరొక్కసారి' సినిమాలో బ్రహ్మాజీ, సుదర్శన్, వెంకట్, వెంకట్ కాకమాను, దివ్యవాణి తదితరులు ఇతర ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ నిర్మాత: వెంకటేష్ వై, ప్రొడక్షన్ డిజైనర్: రవికుమార్ చలమటికారి, సౌండ్ డిజైన్: సాయి మణిందర్ రెడ్డి, కూర్పు: చోటా కే ప్రసాద్, ఛాయాగ్రహణం: రోహిత్ బచు, సంగీతం: భరత్ మాచిరాజు, నిర్మాణ సంస్థ: సీకే ఫిల్మ్ మేకర్స్, నిర్మాత: బి. చంద్రకాంత్ రెడ్డి, రచన - దర్శకత్వం: నితిన్ లింగుట్ల.