Kiran Abbavaram's K RAMP First Single Out: యంగ్ హీరో కిరణ్ అబ్బవరం లేటెస్ట్ మూవీ 'కె ర్యాంప్' నుంచి స్పెషల్ సర్ ప్రైజ్ వచ్చేసింది. ఈ మూవీ నుంచి ఫస్ట్ సింగిల్‌ను మేకర్స్ తాజాగా రిలీజ్ చేశారు. ఈ మూవీకి జైన్స్ నాని దర్శకత్వం వహిస్తుండగా... 'రంగబలి' ఫేం యుక్తి తరేజా హీరోయిన్‌గా నటిస్తున్నారు.

ఓనమ్ సాంగ్ అదుర్స్

కేరళ ప్రజలు ఎంతో సంతోషంగా జరుపుకొనే ఫేమస్ ఫెస్టివల్ 'ఓనమ్' పేరుతో ఉన్న ఈ సాంగ్ ఆకట్టుకుంటోంది. 'ఇన్ స్టా ఆపేశానే... ట్విట్టర్ మానేశానే... నీకే ట్యాగ్ అయ్యానే మలయాళీ పిల్లా...' అంటూ సాగే లిరిక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఈ పాటకు సురేంద్ర లిరిక్స్ అందించగా... చేతన్ భరద్వాజ్ మ్యూజిక్ అందించారు. సోషల్ మీడియా పదాలతో మలయాళ ట్రెడిషన్ కనిపించేలా ఫుల్ ఎనర్జిటిక్ జోష్‌తో ఉండే సాంగ్ ఆద్యంతం ఆకట్టుకుంటోంది.

Also Read: రియల్ హీరో... లిటిల్ హార్ట్స్ సేవియర్ మహేష్ బాబు - సూపర్ స్టార్ ఫౌండేషన్ నుంచి సాయం ఇలా పొందొచ్చు!

దీపావళికి రిలీజ్

గత చిత్రాలతో పోలిస్తే ఈ మూవీలో ఫుల్ ఎనర్జిటిక్ మాస్ డైలాగ్స్‌తో అదరగొట్టారు కిరణ్ అబ్బవరం. ఇటీవల రిలీజ్ అయిన గ్లింప్స్ ఆకట్టుకుంటోంది. మూవీలో కిరణ్, యుక్తి తరేజాతో పాటుగా నరేష్, సాయి కుమార్, వెన్నెల కిషోర్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హాస్య మూవీస్, రుద్రాంశ్ సెల్యులాయిడ్ సంస్థల సమర్పణలో రాజేష్ దండ, శివ బొమ్మకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. దీపావళి కానుకగా అక్టోబర్ 18న రిలీజ్ కానుంది.

ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్‌టైనర్

కిరణ్ అబ్బవరం నుంచి మరో ఫుల్ లెంగ్త్ కామెడీ ఎంటర్ టైనర్ రాబోతోందని గ్లింప్స్‌ను బట్టి అర్థమవుతోంది. 'చేటలు ఎల్లారుకూ నమస్కారం.. ఈసారి ఒక్కొక్కరికీ బుర్ర పాడు... జారుడే' అనే మాస్ డైలాగ్స్, ఆటిట్యూడ్‌తో ఫుల్ జోష్ లో కనిపించారు. అక్కడక్కడ కొన్ని డైలాగ్స్ ఇబ్బంది పెట్టినా మాస్ ఆడియన్స్ మాత్రం ఫుల్ ఎంజాయ్ చేశారు. కేరళలో ఓ తెలుగు కుర్రాడి అల్లరి, ఆటిట్యూడ్‌ను ఫన్నీగా చూపించారు.

ఇటీవల 'క' మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు కిరణ్. ఆ తర్వాత వచ్చిన 'దిల్ రూబ'కు అనుకున్నంత సక్సెస్ రాలేదు. ఎప్పుడూ డిఫరెంట్ కాన్సెప్ట్స్‌‌తో ఆడియన్స్‌ను ఎంటర్‌టైన్ చేసే ఆయన... ఈసారి లవ్, ఫ్యామిలీ, యూత్ ఎంటర్‌టైనర్‌తో రాబోతున్నారు. మరోసారి ఆయన హిట్ కొట్టడం ఖాయమంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు.

ఈ మూవీతో పాటే 'క' మూవీకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారు కిరణ్ అబ్బవరం. ఆయన హీరోగా మరో లవ్ ఎంటర్‌టైనర్ 'చెన్నై లవ్ స్టోరీ' మూవీ తెరకెక్కుతుండగా... రవి నంబూరి దర్శకత్వం వహిస్తున్నారు. ఆయన సరసన శ్రీ గౌరీ ప్రియ హీరోయిన్‌గా నటిస్తున్నారు.