Anand Ravi Is Back With Napoleon Returns: 'నా నీడ పోయింది సార్'... ఈ డైలాగ్‌ గుర్తు ఉందా? కొన్నేళ్ల క్రితం వచ్చిన 'నెపోలియన్' గ్లింప్స్‌ వైరల్ అయ్యింది. నీడ పోవడం ఏమిటి? అనేది అందరిలో ఆసక్తి కలిగించింది. ఆ సినిమా దర్శక రచయిత ఆనంద్ రవి. హీరోగానూ ఆయనే నటించారు. ఇప్పుడు 'నెపోలియన్ రిటర్న్స్' అంటూ హారర్ కామెడీతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. 

Continues below advertisement

అప్పుడు నీడ... ఇప్పుడు గేదె!'నా నీడ పోయింది' అంటూ 'నెపోలియన్' కోసం ఇంట్రెస్టింగ్ గ్లింప్స్‌ క్రియేట్ చేసిన ఆనంద్ రవి... ఇప్పుడు 'నెపోలియన్ రిటర్న్స్' కోసం 'గేదె ఆత్మ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది' అని క్యూరియాసిటీ క్రియేట్ చేసే టీజర్‌తో వచ్చారు. ఈ రోజు టైటిల్ గ్లింప్స్‌ విడుదల చేశారు.

Anand Ravi New Movie: ఆనంద్ రవి కథానాయకుడిగా నటిస్తూ... దర్శకత్వం వహిస్తున్న సినిమా 'నెపోలియన్ రిటర్న్స్'. ఆచార్య క్రియేషన్స్ పతాకంపై భోగేంద్ర గుప్త నిర్మిస్తున్నారు. ఈ సినిమా టైటిల్, గ్లింప్స్‌ను ఆదివారం విడుదల చేశారు. ఇందులో 'బిగ్ బాస్' ఫేమ్ దివి వడ్త్య హీరోయిన్. 'నెపోలియ‌న్', 'ప్ర‌తినిధి', 'కొరమీను' వంటి పాపుల‌ర్ సినిమాల తర్వాత యూనిక్‌, ఫ్రెష్ కాన్సెప్ట్‌తో ఆనంద్ రవి తీస్తున్న చిత్రమిది.

Continues below advertisement

Also Readనిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!

'నెపోలియన్’ రిటర్న్స్' టైటిల్ గ్లింప్స్‌ చూస్తే... ఇద్ద‌రితో క‌లిసి ఆనంద్ రవి పోలీస్ స్టేష‌న్‌కు వెళతారు. అక్కడ కంప్లైంట్ ఇవ్వ‌టానికి రెడీ అవుతారు. పోలీస్ అధికారి రఘు బాబు కంప్లైంట్ తీసుకోవడానికి రెడీ అవుతారు. 'గేదె దెయ్యం ఇంటికి వచ్చి పోలీస్ కంప్లైంట్ ఇవ్వమని చెప్పింది' అని ఆనంద్ రవి చెబుతారు. దాంతో అక్కడ ఉన్నవాళ్లు అందరూ షాక్ అవుతారు. మరొక పోలీస్ అధికారి 'అప్పట్లో నీడ పోయింది అని కంప్లైంట్ ఇచ్చింది నువ్వే కదా' అని అడుగుతారు. దాంతో 'నెపోలియ‌న్' సినిమా రెఫ‌రెన్స్‌ ఉందని అర్థం అవుతుంది. గ్లింప్స్‌ మొత్తం చూస్తే... ఓ చిన్న పిల్లాడు ఆత్మగా మారాడని అర్థం అవుతోంది.

Also Readకింగ్‌డమ్ ఫ్లాప్ కాదు... బిజినెస్ లెక్కల బయటకు తీసిన నాగవంశీ

ఇంట్లో క‌నిపించే పుర్రె ఓ చిన్నారిది అని నటుడు మీసాల లక్ష్మణ్ చెబుతారు. ఆ మాటతో చిన్నారి దెయ్యం నేపథ్యంలో ఆనంద్ రవి సరికొత్త హార‌ర్ స‌స్పెన్స్ మూవీ తీస్తున్నారని అర్థం అవుతోంది. గ్లింప్స్‌లో క్రియేటివిటీతో పాటు ప్రొడక్షన్ వేల్యూస్ బావున్నాయి. బ్యాగ్రౌండ్ స్కోర్ హారర్ మూమెంట్స్‌ను ఎలివేట్ చేసింది.

Napoleon Returns Cast And Crew: ఆనంద్ ర‌వి సరసన దివి వడ్త్య కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాలో 'ఆటో' రామ్ ప్ర‌సాద్‌, ర‌ఘుబాబు, సూర్య పింగ్ పాంగ్, శ్ర‌వ‌ణ్ రాఘ‌వేంద్ర‌, యాంక‌ర్ ర‌వి, ర‌వి వ‌ర్మ‌, మీసాల ల‌క్ష్మ‌ణ్, నరసింహ, బెజయవాడ బాబీ అక్క, రమణ భార్గవ్, కేదార్ శంకర్ ఇతర ప్రధాన తారాగణం. ఈ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్: R&M డిజైన్, కూర్పు: విజయ్ వర్ధన్ కావూరి, సహ నిర్మాత: జై గోస్వామి, సినిమాటోగ్ర‌ఫీ: కార్తీక్ కొప్పెర, సంగీతం: సిద్ధార్థ్ స‌దాశివుని, ర‌చ‌న‌ - ద‌ర్శ‌క‌త్వం: ఆనంద్ ర‌వి.