Sukumar turns producer: క్రియేటివ్ జీనియస్ సుకుమార్ కేవలం దర్శకుడు మాత్రమే కాదు... ఆయనలో ఒక నిర్మాత కూడా ఉన్నాడు. అయితే ఆయన ప్రొఫెషనల్ ప్రొడ్యూసర్ కాదు. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసిన టాలెంటెడ్ కుర్రాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసం సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ స్టార్ట్ చేశారు. అగ్ర నిర్మాణ సంస్థలతో కలిసి ఆ బ్యానర్ మీద సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. అయితే ఇప్పుడు సుకుమార్ భార్య తబిత (Sukumar wife Tabitha) పూర్తి స్థాయి నిర్మాతగా మారుతున్నారు. కొత్త బ్యానర్ ఒకటి స్టార్ట్ చేస్తున్నారని తెలిసింది.‌ దానితో పాటు సుకుమార్ రైటింగ్స్ సంస్థ మీద సినిమాలు ప్రొడ్యూస్ చేయడానికి రెడీ అయ్యారు.

Continues below advertisement

తబిత నిర్మాణంలో 'కుమారి 21ఎఫ్' సీక్వెల్!రావు రమేష్ ప్రధాన పాత్రలో నటించిన 'మారుతి నగర్ సుబ్రహ్మణ్యం' సినిమా గుర్తుందా? ఇంద్రజ, అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి కూడా నటించారు. ఆ సినిమాకు తబిత సుకుమార్ సమర్పకురాలిగా వ్యవహరించారు. ఆ సినిమా చూశాక  తన సమర్పణలో విడుదల చేయడానికి ముందుకు వచ్చారు. అయితే ఇప్పుడు అలా కాదు... కథ నుంచి మేకింగ్ వరకు ప్రతి అంశాన్ని దగ్గరుండి చూసుకోవాలని తబిత నిర్ణయించుకున్నారు. అందుకే సొంతంగా ఒక బ్యానర్ స్టార్ట్ చేస్తున్నారు.

Also Read: కింగ్‌డమ్ ఫ్లాప్ కాదు... బిజినెస్ లెక్కల బయటకు తీసిన నాగవంశీ

Continues below advertisement

సుకుమార్ శిష్యుడు సూర్య ప్రతాప్ పల్నాటి దర్శకత్వం వహించిన 'కుమారి 21ఎఫ్' సినిమా గుర్తుందా? హెబ్బా పటేల్, రాజ్ తరుణ్ నటించారు. అప్పట్లో అదొక సంచలనం. అదొక బోల్డ్ సినిమాగా చూశారు. చాలా మంది ఇప్పుడు అటువంటి సినిమాలు చాలా వస్తున్నాయి అనుకోండి. ఆ 'కుమారి 21ఎఫ్' సినిమాకు సీక్వెల్ చేయడానికి రంగం సిద్ధం అయ్యింది. 'కుమారి 22ఎఫ్' అని టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. త్వరలో ఈ సినిమాను అనౌన్స్ చేయనున్నారు. అలాగే సుకుమార్ భార్య తబిత ప్రొడక్షన్ హౌస్ పేరుకూడా అనౌన్స్ కానుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

Also Readమీ టైపు ఎవరు? అందరికీ తెలుసు... రౌడీయేగా - కన్ఫర్మ్ చేసిన రష్మిక