యువ కథానాయకుడు, ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (Nara Chandrababu Naidu) కుటుంబ సభ్యుడు, దివంగత నారా రామ్మూర్తి నాయుడు తనయుడు నారా రోహిత్ పెళ్లి సందడి మొదలైంది. నారా వారి ఇంట భాజా భజంత్రీలు మొగాయి. శనివారం (అక్టోబర్ 25వ తేదీ) సాయంత్రం హెల్ది వేడుక జరిగింది. కుటుంబ సభ్యులతో పాటు బంధు మిత్రులు కొంతమంది హాజరు అయ్యారు. ఇవాళ... ఆదివారం (అక్టోబర్ 26వ తేదీ) ఉదయం పెళ్ళి కొడుకు ఫంక్షన్ (Nara Rohith Pelli Koduku Function) జరిగింది.
పెళ్ళి కొడుకు ఫంక్షన్‌కు బాలయ్య, లోకేష్!తమ్ముడి పెళ్లిలో అన్నయ్య స్పెషల్ ఎట్రాక్షన్‌గా నిలిచారు. ఏపీ మంత్రి, చంద్రబాబు నాయుడు తనయుడు నారా లోకేష్ కుటుంబ సభ్యులతో సహా పెళ్ళి కొడుకు ఫంక్షన్‌కు విచ్చేశారు. అలాగే, ఈ వేడుక అంతటికి హైలైట్ అయిన మరొక స్పెషల్ గెస్ట్ గాడ్ ఆఫ్ మాసెస్, నట సింహం నందమూరి బాలకృష్ణ. ఆయన సైతం వచ్చి నారా రోహిత్‌ను ఆశీర్వదించారు.
Also Read: నిర్మాతగా సుకుమార్ భార్య తబిత... పదేళ్ళ క్రితం వచ్చిన బోల్డ్ సినిమాకు సీక్వెల్!
నారా రోహిత్ పెళ్ళి కొడుకు ఫంక్షన్‌కు పలువురు రాజకీయ చలన చిత్ర ప్రముఖులు విచ్చేసి కాబోయే వరుడిని ఆశీర్వదించారు. ఈ వేడుకలో నారా రోహిత్ సన్నిహితులు - మరొక యువ కథానాయకుడు శ్రీ విష్ణు సందడి చేశారు. ఆ ఫోటోలు వీడియోలను చూడండి.
Also Read: కింగ్‌డమ్ ఫ్లాప్ కాదు... బిజినెస్ లెక్కల బయటకు తీసిన నాగవంశీ
అక్టోబర్ 30న శిరీషతో రోహిత్ పెళ్లి వేడుక!Nara Rohith - Sireesha Lella Wedding Date: 'ప్రతినిధి 2'లో తనతో కలిసి నటించిన శిరీష లేళ్లతో నారా రోహిత్ ఏడు అడుగులు వేస్తున్న సంగతి తెలిసిందే. గత ఏడాది వీళ్లిద్దరి నిశ్చితార్థం జరిగింది. ఇప్పుడు ఈ జంట పెద్దల ఆశీస్సులతో పటు బంధు మిత్రుల సమక్షంలో వివాహం చేసుకుంటుంది.