Hero Nani Comments on Jersey Sequel: అల్లరి నరేష్‌ ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్‌ ఈవెంట్‌కు నేచురల్‌ స్టార్‌ నాని హీరోగా హాజరైన సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్‌లో మాట్లాడుతున్న నానికి ఫ్యాన్స్‌ నుంచి ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. జెర్సీ సీక్వెల్‌ ఎప్పుడని అడగ్గా నాని నుంచి ఊహించని సమాధానం వచ్చింది. దీంతో అదేంటి.. అంతమాట అనేశాడని అక్కడున్న వారంత అవాక్క్‌ అయ్యారు.  ప్రస్తుతం నాని కామెంట్స్‌ ఇండస్ట్రీలో హాట్‌టాపిక్‌ నిలిచాయి. ఇంతకి నాని ఏం చెప్పాడంటే.. జెర్సీ సీక్వెల్‌ ఉంటుందంటూ కొంతకాలం ఓ వార్త ప్రచారంలో ఉంది. ఎందుకంటే ఈ మధ్య సీక్వెల్స్‌ ట్రెండ్‌ నడుస్తుంది. హిట్‌ సినిమాలకు సీక్వెల్స్‌ లేదా పార్ట్‌ 2లను తీసుకువస్తున్నారు డైరెక్టర్స్‌. 


ఈ నేపథ్యంలో నాని హిట్ మూవీ 'జెర్సీ' సీక్వెల్ పై ప్రశ్న ఎదురైంది. నాని కెరీర్‌లో 'దసరా' తర్వాత బెస్ట్‌ మూవీ ఏదైనా ఉందంటే అదీ 'జెర్సీ'నే. స్పోర్ట్స్‌ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమా భారీ హిట్‌ అందుకుంది. పెద్దగా కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ లేకపోయిన జెర్సీ అద్భుతమైన విజయం సాధించింది. ఈ మూవీ రిలీజై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏప్రిల్‌ 19న ఈ మూవీని రీరిలీజ్‌ చేశారు. సుదర్శన్‌ థియేటర్లో స్పెషల్‌ షో వేయగా ఆడియన్స్‌ని నుంచి విశేష స్పందన లభించింది. అంతగా ఆకట్టుకున్న జెర్సీ సీక్వెల్‌ ఉంటే బాగుండని ఆడియన్స్ ఆశిస్తున్నారు. ఈక్రమంలో నానిని సీక్వెల్‌ ఎప్పుడని ఫ్యాన్స్‌ అడగ్గా.. అతడు ఆశ్చర్యకరంగా స్పందించాడు. ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్‌ ఈవెంట్‌ హోస్ట్‌ వింద్య.. వాళ్లంతా జెర్సీ సీక్వెల్‌ అడుగుతున్నారని అడగ్గా.. 'నేను లేనుగా.. ఎవరితో చేస్తారో చేసుకోండి' అని నాని సమాధానమిచ్చాడు.


'జెర్సీ' సీక్వెల్ పై నాని నాని షాకింగ్‌ రియాక్షన్‌


ఈ సినిమా నాని పాత్ర చనిపోయందనే విషయం తెలిసిందే. దీంతో నాని నుంచి అలాంటి సమాధానం రాగా ఫ్యాన్స్‌ అంతా జెర్సీ సీక్వెల్‌ లేనట్టేనా? అని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. జెర్సీని నాని కొడుకు పాత్రతో కంటిన్యూ చేస్తారనే ఆశలు ఈ మూవీ ఆడియన్స్‌ నెలకొన్నాయి. ఈ పాయింట్‌తోనే జెర్సీ సీక్వెల్‌ ఉండోచ్చని అంతా అభిప్రాయపడ్డారు. కానీ నాని సమాధానం విన్నాక అంతా ఈ సినిమా సీక్వెల్‌ రావడమే కష్టమే అని అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ప్రశ్నకు 'జెర్సీ' డైరెక్టర్‌ నుంచి ఎలాంటి సమాధానం వస్తుందో చూడాలి. కాగా  2019లో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ గౌతమ్‌ తిన్ననూరి 'జెర్సీ'ని తెరకెక్కించిన ఈ సినిమా మంచి కమర్షియల్‌ సక్సెస్‌ అవ్వడం, జాతీయ అవార్డులు కూడా గెలవడంతో జెర్సీని హిందీలోనూ రిమేక్‌ చేశారు.



అయితే ఈ సినిమాకు రెండు విభాగాల్లో జాతీయ అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే. 2021 జరిగిన జాతీయ పురస్కారాల్లో ఉత్తమ సినిమాగా,  బెస్ట్ ఎడిటర్ పురస్కారం  విభాగంలో నవీన్ నూలికి దక్కింది. ఇక సుమారు రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ సినిమా దాదాపు రూ.50 కోట్ల పైగా గ్రాస్‌ వసూళ్లు చేసినట్టు సమాచారం. ఇక హీరో అల్లరి నరేష్‌ గురించి మాట్లాడుతూ.. బ్యాక్‌ టూ బ్యాక్‌ కామెడీ సినిమాలు చేసే నరేష్‌ని కాస్తా బ్రేక్‌ తీసుకోమ్మని సలహా ఇచ్చింది తానే అన్నాడు. కానీ, నరేష్‌ కామెడీ టైమింగ్‌ ఎలాంటిదో తెలిసిందే, దీంతో అతడి ఫన్‌ని అంతా మిస్‌ అవుతున్నారు. ఆ ఒక్కటి అడక్కు ట్రైలర్‌ చూస్తుంటే నాకు అలాగే అనిపించింది. అంటూ నాని చెప్పుకొచ్చాడు. 


Also Read: హాట్‌టాపిక్‌గా రామ్‌ చరణ్‌  'గేమ్‌ ఛేంజర్‌' రెమ్యునరేషన్‌ - ఎంతో తెలుసా?