Mahesh Babu - Trivikram Movie: మహేష్ బాబు - త్రివిక్రమ్ సినిమాలో నందమూరి హీరో విలన్ కాదు

మహేష్ బాబు, త్రివిక్రమ్ కలయికలో రూపొందనున్న సినిమాలో ప్రతినాయకుడిగా నందమూరి హీరో నటిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అందులో నిజం ఎంత? అంటే...

Continues below advertisement

SSMB 28 Movie Update: సూపర్ స్టార్ మహేష్ బాబు కథానాయకుడిగా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా రూపొందుతోంది. క్లాసిక్ మూవీ 'అతడు', మహేష్‌ను కొత్తగా చూపించిన 'ఖలేజా' తర్వాత వీళ్ళిద్దరి కలయికలో హ్యాట్రిక్ చిత్రమిది.

Continues below advertisement

మహేష్ - త్రివిక్రమ్ తాజా సినిమాలో నందమూరి తారకరత్న (Nandamuri Taraka Ratna) నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఆయన విలన్ రోల్ చేయవచ్చని దాని సారాంశం. దీని అంతటికీ కారణం తారకరత్న పేరు మీద ఉన్న అకౌంట్ నుంచి వచ్చిన ఒక ట్వీట్. అయితే, ఈ వార్తలను తారకరత్న ఖండించారు. తనకు ఎటువంటి ట్విట్టర్ ఖాతా లేదని ఆయన స్పష్టం చేశారు. 

''నాకు ట్విట్టర్ ఖాతా లేదు. ఎవరో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశారు. నా పేరుతో ట్వీట్స్ చేస్తున్నారు. ఆ ట్విట్టర్ నుంచి వచ్చే వార్తల్ని నమ్మవద్దు. నాకు సంబంధించిన ఏ విషయమైనా నా పీఆర్ టీమ్ తెలియజేస్తుంది. దయచేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేయవద్దు" అని నందమూరి తారకరత్న తెలిపారు. గతంలోనూ ఒకసారి ఫేక్ ట్విట్టర్ అకౌంట్ గురించి ఆయన తెలిజేజేశారు. తారకరత్న పోలీస్ అధికారి పాత్రలో నటించిన '9 అవర్స్' వెబ్ సిరీస్ జూన్ 2న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌ ఓటీటీలో విడుదల కానుంది.

మహేష్, త్రివిక్రమ్ సినిమా విషయానికి వస్తే... 'అర్జునుడు' టైటిల్ ఖరారు చేసినట్టు ఫిల్మ్ నగర్ టాక్. మహేష్  కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న (మంగళవారం) టైటిల్ వెల్లడిస్తారో? లేదో? చూడాలి. ఇందులో పూజా హెగ్డే కథానాయిక. 

Also Read: న్యూయార్క్ నుంచి న్యూజెర్సీకి - మహేష్ 'సర్కారు వారి పాట'పై ఆనంద్ మహీంద్రా ట్వీట్ వైరల్

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై సూర్యదేవర రాధాకృష్ణ (చినబాబు) ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - పూజా హెగ్డే, త్రివిక్రమ్ & హారిక అండ్ హాసిని - తమన్ కాంబినేషన్ లో కూడా హ్యాట్రిక్ చిత్రమిది. త్రివిక్రమ్ దర్శకత్వంలో, హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మాణంలో 'అరవింద సమేత వీరరాఘవ', 'అల వైకుంఠపురములో' చేశారు పూజా హెగ్డే. సో... ఇది హ్యాట్రిక్ మూవీ. ఆ రెండు చిత్రాలకూ సంగీతం అందించిన తమన్, ఈ సినిమాకూ సంగీతం అందిస్తున్నారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం: మది, కూర్పు: నవీన్ నూలి, కళా దర్శకత్వం: ఎ.ఎస్. ప్రకాష్.

Also Read: ఓ అబ్బాయ్! మౌనీ రాయ్‌ను చూడవా? ఆమె నిన్ను చూస్తుంటే...

Continues below advertisement