Nandamuri Chaitanya Krishna : ఎన్టీఆర్ మనవడి 'బ్రీత్' - డిఫరెంట్ టైటిల్, లుక్‌తో వస్తున్న నందమూరి వారసుడు

Breathe Movie First Look : నందమూరి కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. నందమూరి చైతన్య కృష్ణ హీరోగా రూపొందుతున్న సినిమా టైటిల్ వెల్లడించడంతో పాటు ఫస్ట్ లుక్ విడుదల చేశారు.

Continues below advertisement

విశ్వవిఖ్యాత నట సార్వభౌమ నందమూరి తారక రామారావు కుటుంబం నుంచి మరో వారసుడు వస్తున్నారు. ఎన్టీఆర్ కుటుంబం నుంచి రెండో తరంలో హరికృష్ణ, బాలకృష్ణ హీరోలుగా వచ్చారు. అగ్ర కథానాయకులుగా తండ్రి తగ్గ తనయులు అనిపించుకున్నారు. మూడో తరంలో కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. ఇప్పుడు మరో ఎన్టీఆర్ మనవడు హీరోగా వస్తున్నారు. 

Continues below advertisement

ఎన్టీ రామారావు ప్రథమ పుత్రుడు జయకృష్ణ (Nandamuri Jayakrishna) కుమారుడు నందమూరి చైతన్య కృష్ణ కథానాయకుడిగా ఓ సినిమా రూపొందుతోంది. కొన్నాళ్ల క్రితం చైతన్య కృష్ణ హీరోగా సినిమాలు చేశారు. అయితే... కొత్త విరామం తర్వాత మళ్ళీ ఆయన హీరోగా లాంచ్ అవుతున్నారు. చైతన్య కృష్ణ కొత్త సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ఈ రోజు వెల్లడించారు.

ఎన్టీఆర్ మనవడి 'బ్రీత్' 
బసవతారకం క్రియేషన్స్ పతాకంపై ప్రొడక్షన్ నంబర్ 1గా నందమూరి చైతన్య కృష్ణ (Nandamuri Chaitanya Krishna) కథానాయకుడిగా రూపొందుతున్న సినిమాకు 'బ్రీత్' (Breathe Telugu Movie) టైటిల్ ఖరారు చేశారు.  'అంతిమ పోరాటం'... అనేది ఉపశీర్షిక. 

ఫస్ట్ లుక్ విడుదల చేసిన కళ్యాణ్ రామ్!
'బ్రీత్' సినిమా టైటిల్ వెల్లడించడంతో పాటు చైతన్య కృష్ణ ఫస్ట్ లుక్ నందమూరి కళ్యాణ్ రామ్ చేతుల మీదుగా ఈ రోజు విడుదల అయ్యింది. ఆ లుక్ చూస్తే... చైతన్య కమర్షియల్ సినిమాతో కాకుండా కాన్సెప్ట్ ఓరియెంటెడ్ కథతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నట్లు అర్థం అవుతోంది.

Also Read : మంచు మనోజ్ భార్యకు ఓ కొడుకు ఉన్నాడని తెలుసా?
 

'రక్ష', 'జక్కన్న' సినిమాలు తీసిన దర్శకుడు వంశీకృష్ణ ఆకెళ్ళ తెరకెక్కిస్తున్నారు. నందమూరి జయకృష్ణ నిర్మిస్తున్నారు. సినిమాకు సంబందించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తామని చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం : రాకేష్ హోస్మనీ, ఎడిటర్ : బొంతల నాగేశ్వర్ రెడ్డి, సంగీతం : మార్క్ కె. రాబిన్, రచన, దర్శకత్వం : వంశీకృష్ణ ఆకెళ్ళ. 

Also Read 'ఎలోన్' రివ్యూ : హాట్‌స్టార్‌లో మోహన్ లాల్ సినిమా - మలయాళంలో కూడా వరస్ట్ సినిమాలు తీస్తారని చెప్పడానికి ఒక ఉదాహరణ 

ఎన్టీ రామారావు తర్వాత నందమూరి కుటుంబం నుంచి రెండో తరంలో వచ్చిన వారిలో బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడిగా పేరు తెచ్చుకున్నారు. అగ్ర హీరోగా వారసత్వాన్ని నిలబెట్టారు. హరికృష్ణ కూడా హీరోగా సినిమాలు చేశారు. ఆయన చేసిన సినిమాల సంఖ్య తక్కువే. కానీ, వాటిలో విజయాల శాతం ఎక్కువ. ఎన్టీఆర్ ఫ్యామిలీలో మూడో తరంలో హరికృష్ణ కుమారులు కళ్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ సక్సెస్ అయ్యారు. తారకరత్న కొన్ని సినిమాలతో సరిపెట్టుకున్నారు. బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు వెయిట్ చేస్తున్నారు. 

Continues below advertisement