Actress Namitha: పెళ్లయ్యి ఫ్యామిలీ లైఫ్‌లో బిజీ అయిపోయి చాలామంది నటీమణులు సినిమాలకు, ఇండస్ట్రీకి పూర్తిగా దూరమయ్యారు. అలాంటి ఎందరో నటీమణులు మళ్లీ తమ సెకండ్ ఇన్నింగ్స్ కోసం రంగంలోకి దిగుతున్నారు. అలాంటి హీరోయిన్లలో నమిత కూడా ఒకరు. ప్రతీ సౌత్ భాషలో తనకంటూ నటిగా ఒక గుర్తింపు సంపాదించుకుంది నమిత. కానీ తను నటించిన సినిమాలు ఫ్లాప్ అవ్వడం, అదే సమయంలో పెళ్లి జరగడంతో పూర్తిగా వెండితెరకు దూరమయ్యింది. తాజాగా తనకు సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతుండగా అందులో తను అమ్మవారి గెటప్‌లో కనిపించి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఇది చూసినవారంతా నమిత కూడా సెకండ్ ఇన్నింగ్స్‌కు సిద్ధమయ్యిందని అనుకుంటున్నారు.
మరో వీడియోతో క్లారిటీ..
తను అమ్మవారి గెటప్‌లో ఉన్న వీడియోను నమిత షేర్ చేసింది. దీంతో తన ఫ్యాన్స్ ఈ లుక్‌ను ప్రశంసిస్తూ కామెంట్స్ పెడుతున్నారు. ‘ఈ లుక్‌లో ఆమె సరిగ్గా సరిపోయింది. తమిళంలో పలువురు హీరోయిన్లు అమ్మవారి పాత్రలో కనిపించారు. కానీ అందరికంటే నమితకే ఇది బాగా మ్యాచ్ అయ్యింది. తనను త్వరలోనే వెండితెరపై అమ్మవారి పాత్రలో చూడాలని కోరుకుంటున్నాను’ అంటూ నమిత టీమ్‌లోని ఒక అమ్మాయి.. ఈ వీడియోను ముందుగా పోస్ట్ చేయగా.. నమిత కూడా దీనిని షేర్ చేసింది. ఇక దీనిని చూసి చాలామంది ప్రేక్షకులు సినిమా షూటింగ్ అని ఫిక్స్ అయిపోయారు. నమిత సెకండ్ ఇన్నింగ్స్ ఫిక్స్ అని కామెంట్స్ స్టార్ట్ చేశారు. కానీ కొన్నిరోజుల క్రితమే అసలు ఈ గెటప్ తాను ఎందుకు వేసుకున్నారో మరో వీడియోలో క్లారిటీ ఇచ్చారు నమిత.
దానికోసమే గెటప్..
‘ఇదు నమ్మ యూఎస్‌పీ’ అనే తమిళ షోను ప్రమోట్ చేయడం కోసం నమిత ఈ గెటప్ వేసుకుంది. అసలు ఈ షో ఏంటి అని కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లో చెప్పుకొచ్చింది. ‘కలలను బ్రాండ్స్‌గా మారుస్తాం. ఇదు నమ్మ యూఎస్‌పీ అనేది షో మాత్రమే కాదు.. చిన్న చిన్న వ్యాపారవేత్తలను, అత్యద్భుతమైన ప్రొడక్ట్స్ తయారు చేసిన రియల్ హీరోలను ప్రోత్సహించడానికి ఇదొక ప్లాట్‌ఫార్మ్. మా మిషన్ సింపుల్. వ్యాపారవేత్తలకు సాయం చేయడమే. మీ బిజినెస్‌కు గుర్తింపు ఇవ్వడం కోసం ఇదు నమ్మ యూఎస్‌పీ మీకు అండగా నిలబడుతుంది. ఈ ప్రయాణంలో మీ ఐడియాలను బ్రాండ్‌గా మార్చుకోండి’ అని షో గురించి చెప్తూ వ్యాపారవేత్తలను ఆహ్వానించింది నమిత.
Also Read: ప్రెగ్నెన్సీ సమయంలో అలాంటి అనుభవం, దానివల్లే డిప్రెషన్ - నమిత