Nagarjuna Meets His Viral Video Fan: గత కొన్నిరోజులుగా నాగార్జున బాడీగార్డ్ చేసిన పని వల్ల ఈ సీనియర్ హీరోపై నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. ఎయిర్‌పోర్టులో ఒక ఫ్యాన్.. నాగ్‌ను కలవడానికి వస్తుండగా.. తన బాడీగార్డ్ తీసేశాడు. ఈ విషయం అప్పుడు నాగార్జున గమనించలేదు. దీంతో తనపై ట్రోల్స్ మొదలయ్యాయి. అప్పుడు ఈ సంఘటనపై ఈ సీనియర్ హీరో స్పందించారు. అంతే కాకుండా తాజాగా స్పెషల్‌గా ఆ ఫ్యాన్‌కు కూడా కలిసి ఫోటో దిగారు. దీంతో ఈ ఫోటో.. సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బాడీగార్డ్.. తనను అలా తీసేయడం తన తప్పు కాదంటూ నాగార్జున తెలిపారు.


మాదే తప్పు..


కొన్నిరోజుల క్రితం ముంబాయ్‌కు వెళ్లారు నాగార్జున. అక్కడ ఎయిర్‌పోర్ట్ నుండి బయటికి వస్తుండగా తన బాడీగార్డ్.. ఒక ఫ్యాన్‌ను తోసేశారు. తాజాగా ముంబాయ్ ఎయిర్‌పోర్ట్ నుండి ఆయన హైదరాబాద్‌కు రిటర్న్ అయ్యారు. రిటర్న్ అవుతున్న సమయంలో మళ్లీ అదే ఫ్యాన్‌ను కలిశారు. దీంతో ఈసారి తనకు.. నాగార్జునతో ఫోటో దిగే అవకాశం లభించింది. అందరితో పాటు తనతో కూడా ఫోటోలు దిగారు. అందరూ వెళ్లిపోయిన తర్వాత మరోసారి తనను ప్రత్యేకంగా దగ్గరకు పిలిచి.. ‘‘నీ తప్పేం లేదు. మాదే తప్పే’’ అంటూ మరోసారి తనతో స్పెషల్‌గా ఫోటో దిగారు. దీంతో నాగార్జున చేసిన పనికి తనపై నెగిటివ్ కామెంట్స్ ఆగిపోయాయి.






క్షమాపణలు చెప్తున్నాను..


తాజాగా నాగార్జున బాడీగార్డ్.. ఫ్యాన్‌ను తీసేసిన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో వైరల్ చేశారు. ఇప్పుడు ఏమైపోయింది మీ మానవత్వం అంటూ నాగార్జునను ట్యాగ్ చేస్తూ ప్రశ్నించారు. ఈ వీడియో నాగార్జున వరకు వెళ్లింది. ‘‘ఇది ఇప్పుడే నా దృష్టికి వచ్చింది. ఇలా జరగకుండా ఉండాల్సింది. నేను ఆ వ్యక్తికి క్షమాపణలు చెప్తున్నాను. కచ్చితంగా భవిష్యత్తులో ఇలా జరగకుండా తగిన జాగ్రత్తలు తీసుకుంటాను’’ అంటూ స్పందించారు నాగార్జున. అయినా కూడా ఒక ఫ్యాన్‌తో అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదంటూ నెటిజన్లు.. దీనిపై నెగిటివ్ కామెంట్స్ చేస్తూనే ఉన్నారు.



ముంబాయ్‌లో ప్రమోషన్స్..


ప్రస్తుతం నాగార్జున.. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ‘కుబేర’ అనే మూవీలో నటిస్తున్నారు. ఇందులో ధనుష్ హీరోగా నటిస్తుండగా.. నాగార్జున మరో కీలక పాత్రలో కనిపించనున్నారు. తెలుగుతో పాటు తమిళంలో కూడా ఈ సినిమా విడుదల కానుంది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో భాగంగా ముంబాయ్‌లో నాగార్జున, ధనుష్.. ఫ్యాన్స్‌ను అలరించారు. ఆ ప్రమోషన్స్ కోసం ముంబాయ్ వెళ్తుండగానే ఈ సంఘటన జరిగింది. ఇక ముంబాయ్‌లో కూడా నాగార్జున, ధనుష్‌ను చూడడానికి ఫ్యాన్స్ భారీ ఎత్తున వచ్చారు. అక్కడ ధనుష్ బాడీగార్డ్ కూడా ఫ్యాన్స్‌తో దురుసుగా ప్రవర్తించాడని వార్తలు వైరల్ అవుతున్నాయి.



Also Read: అభిమానిని క్షమాపణలు కోరిన 'కింగ్‌' నాగార్జున - భవిష్యత్తులో ఇలా జరగకుండా చూసుకుంటానంటూ ట్వీట్‌..