టాలీవుడ్ యంగ్ హీరో నాగశౌర్య ఈసారి గట్టిగానే హిట్టు కొట్టాలనే లక్ష్యంతో వస్తున్నాడు. ‘రంగబలి’ మూవీతో ఎలాగైనా మళ్లీ ప్రేక్షకులకు దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. ఈ ఏడాది శౌర్య నటించిన ‘ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి’ సినిమా అంతగా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ‘రంగబలి’ మూవీపైనే ఆశలు పెట్టుకున్నాడు. అందుకే, ఫస్ట్ లుక్ నుంచి టీజర్ వరకు చాలా జాగ్రత్తలు తీసుకుంటూ వస్తున్నాడు. ఇప్పటికే టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజాగా మంగళవారం ‘రంగబలి’ ట్రైలర్ కూడా వచ్చేసింది. ట్రైలర్ చూస్తుంటే.. తప్పకుండా నాగశౌర్య కెరీర్ మళ్లీ గాడిలో పడుతుందనే అనిపిస్తోంది.
ఇక ట్రైలర్ విషయానికి వస్తే.. మీ ఊరంటే నీకు ఇష్టమా? అని మురళీ శర్మ... హీరో (నాగశౌర్య)ను అడగుతారు. ‘‘ప్రతి మనిషి పేరు మీద సొంతిల్లు ఉండకపోవచ్చు. సొంత పొలం ఉండకపోవచ్చు. కానీ, సొంత ఊరైతే ఉంటుందండి’’ అంటూ మూవీ కాన్సెప్ట్‌ను శౌర్య డైలాగ్స్‌తో రివీల్ చేశారు. ఆ తర్వాత కొన్ని ఫన్నీ సీన్లు నవ్విస్తాయి. జులాయిగా తిరిగే కొడుకును తిట్టే తల్లిదండ్రులు వంటి రొటీన్ సీన్స్ కనిపిస్తాయి. ‘‘తేనెటీగ వెళ్లి.. తేనె డబ్బాను దొబ్బేసినట్లు.. సొంత షాపులో దొంగతనాలేంటి?’’ అని తల్లి మందలిస్తుంది. ఇక కమెడియన్ సత్య ఎంట్రీ నుంచి ట్రైలర్ మరింత ఫన్నీగా ఉంటుంది. ‘‘ఇది చూస్తే ఓ సినిమా గుర్తొస్తుంది భయ్యా. అందులో హీరో తన స్పెర్మ్ అమ్ముకుని డబ్బులు సంపాదిస్తుంటాడు. అలా మనది కూడా ఇచ్చేద్దాం.. ఏదైనా పార్టీ ఉంటే చూడు బ్రో. ఒక వేళ ఒకే అంటే రోడ్డు మీద తేనె అమ్మినట్లు అమ్మేద్దాం’’ అంటూ సత్య మెడికల్ స్టూడెంట్‌ను అడగడం వంటి సీన్స్ నవిస్తాయి. ఆ తర్వాత హీరోయిన్ ఎంట్రీ సీన్స్, లవ్ వంటివి ట్రైలర్‌లో చూపించారు. ‘‘బయట ఊరిలో బానిసగా బతికినా పర్వాలేదు. కానీ, సొంత ఊరిలో మాత్రం సింహంలా ఉండాలి’’ అనే డైలాగ్ యూత్‌కు నచ్చుతుంది. ఆ తర్వాత విలన్ ఎంట్రీతో కథ యాక్షన్ సీన్స్‌లోని వెళ్తుంది. అయితే, కథ ఏమిటనేది రివీల్ కాకుండా జాగ్రత్తపడ్డారు. కానీ, ట్రైలర్ సీక్వెన్స్ చూస్తుంటే.. పాత సీసాలో కొత్త సారా తరహాలోనే ఉంది. అయితే, ఎంటర్‌టైన్మెంట్‌తో ఆకట్టుకుంటే.. తప్పకుండా ప్రేక్షకులకు నచ్చుతుంది. కుటుంబ ప్రేక్షకులకు నచ్చాలంటే మాత్రం.. ఈ ట్రైలర్‌లో చూపించిన ఒక బూతు పదానికి ‘బీప్’ వేయడం బెటర్.
‘రంగబలి’ ట్రైలర్:
వాస్తవానికి ఈ మూవీ 2022లోనే అనౌన్స్ చేశారు. తర్వాత ఏమైందో తెలీదుకానీ దాదాపు ఏడాది పాటు ఎలాంటి అప్డేట్‌లు లేవు. ఈ లోగా నాగశౌర్య మరో సినిమా పూర్తి చేసుకుని రిలీజ్ కూడా చేసేశాడు. కానీ, లక్ కలిసి రాలేదు. మరి ‘రంగబలి’తో అయినా నాగశౌర్య హిట్ అందుకుంటాడో లేదో చూడాలి. పవన్ బాసంశెట్టి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీలో షైన్ టామ్ చాకో విలన్‌గా నటిస్తున్నాడు. యుక్తీ దరేజా హీరోయిన్. సత్య, అనంత్ శ్రీరామ్, గోపరాజు రమణ, శుభలేఖ సుధాకర్, మురళీ శర్మ, సప్తిగిరి, బ్రహ్మాజీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ‘ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ సంస్థ ఈ సినిమాను నిర్మించింది. పవన్ ఈ సినిమాకు సంగీతం అందించారు.
Read Also: సల్మాన్‌ను కచ్చితంగా చంపేస్తాం - ఆ సింగర్ హత్య కేసు నిందితుడు వార్నింగ్
Join Us on Telegram: https://t.me/abpdesamofficial