Naga Chaitanya - Sobhita: నాగచైతన్య, శోభిత దూళిపాళ్ల గొప్ప మనసు - క్యాన్సర్‌తో పోరాడుతోన్న చిన్నారులతో చైతూ డ్యాన్స్.. ఫోటోలు వైరల్
Naga Chaitanya: నాగచైతన్య, శోభిత దంపతులు మంచి మనసు చాటుకున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతున్న చిన్నారులను కలిసి వారితో సరదాగా గడిపారు. దీనికి సంబంధించిన ఫోటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.

Naga Chaitanya And Sobhita Spent Time With Children Who Suffered From Cancer: యువ హీరో నాగచైతన్య (Naga Chaitanya), నటి శోభిత (Sobhita) దంపతులు గొప్ప మనసు చాటుకున్నారు. హైదరాబాద్‌లోని సెయింట్ జూడ్ ఇండియా చైల్డ్ కేర్‌ను శనివారం సందర్శించిన ఈ కపుల్.. అక్కడ క్యాన్సర్‌తో పోరాడుతోన్న చిన్నారులతో గడిపారు. సెంటర్‌లోని చిన్నారులతో సరదాగా మాట్లాడుతూ వారికి ధైర్యం చెప్పారు. చిన్నారులతో ఆడి పాడడమే కాకుండా.. చైతూ వారితో కలిసి డ్యాన్స్ చేస్తూ వారికి ఉత్సాహం కలిగించారు. కేర్ సెంటర్ సిబ్బందితోనూ మాట్లాడి పిల్లల ఆరోగ్యం గురించి అడిగి వివరాలు తెలుసుకున్నారు. చిన్నారులకు ప్రత్యేక బహుమతులు అందించి వారితో కలిసి ఫోటోలు దిగారు. ఇవి తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. కొత్త జంట మంచి మనసును నెటిజన్లు ప్రశంసిస్తున్నారు. క్యాన్సర్‌తో పోరాడుతోన్న పిల్లల్లో మనో ధైర్యం నింపారని కొనియాడుతున్నారు.
నాగచైతన్య, శోభిత గతేడాది డిసెంబర్ 4న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తర్వాత వీరిద్దరూ చైతూ లేటెస్ట్ మూవీ 'తండేల్' సక్సెస్ మీట్‌లో సందడి చేశారు. శోభిత తన లైఫ్‌లోకి వచ్చాక దక్కిన బ్లాక్ బస్టర్ కావడంతో చైతన్య ఈ మూవీని ఎంతో స్పెషల్‌గా భావిస్తున్నారు. ఈ మూవీతో ఆయన రూ.100 కోట్ల క్లబ్‌లోకి చేరిపోయారు. శోభిత వచ్చిన వేళా విశేషం వల్లే తన కుమారుడు మంచి సక్సెస్ అందుకున్నాడని అక్కినేని నాగార్జున సైతం ఇటీవల చెప్పారు. అంతకు ముందు తండేల్ ప్రమోషన్స్‌లో నాగచైతన్య మాట్లాడుతూ శోభితపై ప్రశంసలు కురిపించారు. ఆమె తనకు సపోర్ట్‌గా ఉంటుందని తెలిపారు.
బాక్సాఫీస్ వద్ద 'తండేల్' జోరు
నాగచైతన్య, సాయిపల్లవి (Sai Pallavi) నటించిన లేటెస్ట్ మూవీ 'తండేల్' (Thandel) బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. ఈ మూవీ రూ.120 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టింది. చందూ మొండేటి ఈ మూవీకి దర్శకత్వం వహించగా.. అల్లు అరవింద్ సమర్పణలో ప్రముఖ నిర్మాత బన్నీ వాస్ నిర్మించారు. శ్రీకాకుళం జిల్లా కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన 22 మంది మత్స్యకారుల జీవితాల్లో జరిగిన వాస్తవ ఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. తండేల్ రాజుగా నాగచైతన్య, సాయిపల్లవి నటనకు ఫ్యామిలీ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ సినిమాకే హైలైట్‌గా నిలిచింది.