నందమూరి నట వారసుడు, మ్యాన్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ త్వరలో వెండితెరకు పరిచయం కానున్నారు. అయితే, అది ఎవరి దర్శకత్వంలో అనేది ఇప్పుడు క్వశ్చన్ మార్క్. ఎందుకంటే... 'హను - మాన్' ఫేమ్ ప్రశాంత్ వర్మ దర్శకత్వం మొదలు కావాల్సిన ఆయన మొదటి సినిమా పూజతో ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు క్యాన్సిల్ అయ్యిందనేది ఇండస్ట్రీ గుసగుస. అబ్బాయికి ఒంట్లో బాలేకపోవడంతో వాయిదా వేశామని స్వయంగా బాలకృష్ణ చెప్పారు. అయితే... ఇప్పుడు మరొక దర్శకుడి పేరు తెర మీదకు వచ్చింది.
నాగ్ అశ్విన్ దర్శకత్వంలో మోక్షజ్ఞ మొదటి సినిమా?
Nag Ashwin to direct Nandamuri Mokshagna Teja: 'కల్కి 2898 ఏడీ'తో వెయ్యి కోట్ల క్లబ్బులో చేరిన దర్శకుడు నాగ్ అశ్విన్. ఆయనతో మోక్షజ్ఞ తేజ సినిమా ప్లాన్ చేస్తున్నారట. వైజయంతి మూవీస్ పతాకం మీద సి అశ్వినీదత్ ఈ సినిమాను ప్రొడ్యూస్ చేయనున్నారని సమాచారం. ఆయన నిర్మాతగా పరిచయమైనది ఎన్టీఆర్ సినిమా 'ఎదురులేని మనిషి'తో! కట్ చేస్తే... ఎన్టీఆర్ మనవడి మొదటి సినిమా ప్రొడ్యూస్ చేసే అవకాశం వైజయంతి మూవీస్ సంస్థకు వచ్చింది.
'ఎవడే సుబ్రమణ్యం'తో దర్శకుడిగా పరిచయమైన నాగ్ అశ్విన్... ఆ తర్వాత సావిత్రి బయోపిక్ 'మహానటి'తో గౌరవ మర్యాదలు సొంతం చేసుకున్నారు. ఇక, రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా తీసిన 'కల్కి 2898 ఏడీ'తో పాన్ ఇండియా సక్సెస్ అందుకున్నారు. వెయ్యి కోట్ల క్లబ్బులో చేరారు. 'కల్కి' సీక్వెల్ పనుల మీద ఆయన దృష్టి పెట్టారు. అయితే... ప్రభాస్ వేరే సినిమాలతో బిజీగా ఉండటంతో నాగ్ అశ్విన్ కొంత ఖాళీగా ఉన్నారు. ఈలోపు ఆయన వేరే సినిమా చేయాలని భావిస్తున్నారట.
రెండు మూడు సినిమాలు కూడా కన్ఫర్మ్ అయినట్టే!
Nandamuri Mokshagna Teja Upcoming Movies: ప్రశాంత్ వర్మ సినిమా క్యాన్సిల్ కావడానికి ముందు మోక్షజ్ఞ తేజ లైనులో మరో రెండు సినిమాలు వచ్చాయి. ఎన్టీఆర్ అభిమానులలో ఒకరైన నిర్మాత నాగవంశీ సూర్యదేవర ఒక మూవీ ప్రపోజల్ పెట్టారట. మోక్షజ్ఞ హీరోగా 'లక్కీ భాస్కర్' ఫేమ్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో సినిమా నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నారు. అది కాకుండా నందమూరి బాలకృష్ణ మరో సినిమా ప్లాన్ చేశారు.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
తనయుడు మోక్షజ్ఞ తేజతో తన సూపర్ డూపర్ క్లాసిక్ హిట్ 'ఆదిత్య 369'కు సీక్వెల్ 'ఆదిత్య 999 మ్యాక్స్' చేస్తున్నట్లు ఆహా టాక్ షో 'అన్‌స్టాపబుల్'లో అనౌన్స్ చేశారు బాలకృష్ణ. ఆ సినిమా వచ్చే ఏడాది (2025లో) రిలీజ్ అవుతుందని చెప్పారు. మరి, 'ఆదిత్య 999 మ్యాక్స్' విడుదల అవుతుందా? లేదంటే వెంకీ అట్లూరి సినిమా ముందు వస్తుందా? అనేది వేచి చూడాలి.
Also Read: కేతికా శర్మకు తెలుగులో మరో సినిమా... ఆవిడతో పాటు 'లవ్ టుడే' ఇవానా కూడా - హీరో ఎవరంటే?