Pushpa 2 enters into 1000 crore club: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun) రికార్డుల వేటకు, వసూళ్ల ఊచకోతకు బాక్సాఫీస్ దగ్గర ఎదురునేదే లేకుండా పోయింది. 'పుష్ప 2: ది రూల్' చిత్రానికి ప్రేక్షకులు జేజేలు కొట్టారు. థియేటర్ల దగ్గర బ్రహ్మరథం పడుతున్నారు. దాంతో రోజుకు ఒక రికార్డు ఆ సినిమా వశం అవుతోంది. తాజాగా మరో రికార్డు 'పుష్ప 2' ఖాతాలో చేరింది. అది ఏమిటంటే?
రూ. 1000 కోట్ల క్లబ్బులో పుష్ప రాజ్!
Pushpa 2 box office collection worldwide till now: అక్షరాలా వెయ్యి కోట్ల రూపాయలు... ఈ మంగళవారం, డిసెంబర్ 10వ తేదీతో బాక్సాఫీస్ బరిలో 1000 కోట్ల రూపాయలు వసూలు చేసిన భారతీయ సినిమాల జాబితాలో 'పుష్ప 2' కూడా చేరింది. కేవలం వారంలో ఈ ఘనత సాధించిన ఇండియన్ సినిమాగా రికార్డు కూడా క్రియేట్ చేసింది.
Also Read: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
'పుష్ప 2' కంటే ముందు 1000 కోట్లు వసూళ్లు సాధించిన ఇండియన్ సినిమాలను వేళ్ళ మీద లెక్క పెట్టొచ్చు. బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ అమీర్ ఖాన్ హీరోగా నటించిన 'దంగల్' అన్నిటి కంటే మొదటి స్థానంలో ఉంది. ఆ సినిమా 2000 కోట్ల రూపాయలకు పైగా కలెక్ట్ చేసింది. ఆ తర్వాత స్థానంలో దర్శక ధీరుడు రాజమౌళి తీసిన 'బాహుబలి ది కంక్లూజన్', 'ఆర్ఆర్ఆర్' సినిమాలు ఉన్నాయి. రెబల్ స్టార్ ప్రభాస్ సినిమాకు 1800 కోట్ల రూపాయలు వసూళ్లు రాగా... గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, ఎన్టీఆర్ సినిమాకు 1390 కోట్ల రూపాయలు వచ్చాయి. 1000 కోట్ల క్లబ్బులో కన్నడ రాకింగ్ స్టార్ యష్ 'కేజిఎఫ్ చాప్టర్ 2', ప్రభాస్ 'కల్కి 2898 ఏడీ', షారుక్ ఖాన్ 'జవాన్', 'పఠాన్' సినిమాలు ఉన్నాయి.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
ఐదు రోజుల్లోనే 922 కోట్ల రూపాయలు!
ఇండియన్ సినిమా హిస్టరీలో 300 కోట్ల రూపాయలు హిందీ వర్షన్ ద్వారా వసూలు చేసిన ఫాస్టెస్ట్ సినిమాగా పుష్ప రికార్డు క్రియేట్ చేసింది. నార్త్ ఇండియాలో ఈ సినిమాకు భారీ వసూళ్లు వస్తున్నాయి. అదే సమయంలో ఫాస్టెస్ట్ 900 కోట్ల క్లబ్బులో చేరిన సినిమాగా కూడా రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పుడు ఫాస్టెస్ట్ 100 కోట్ల క్లబ్బులో చేరిన మొదటి సినిమాగా మరొక రికార్డు నమోదు చేసింది. మండే టెస్ట్ కూడా పుష్ప పాస్ అయింది. వీకెండ్ తర్వాత కూడా ప్రేక్షకులు సినిమా చూడడానికి థియేటర్లకు వస్తున్నారు.