Ketika Sharma New Movie In Telugu: యంగ్ హీరోయిన్ కేతికా శర్మకు తెలుగులో కాస్త ఫాలోయింగ్ ఉంది. కానీ, లక్ మాత్రం కలసి రావడం లేదు. ఈ అందాల భామ చేసిన సినిమాల్లో విజయాలు తక్కువ. అయితే... ఆమె అందానికి, అలాగే నటనకు యూత్‌లో ఫాలోయింగ్ ఎక్కువ. దాంతో అమ్మాయికు అవకాశాలు వస్తున్నాయి. నితిన్ 'రాబిన్ హుడ్' సినిమాలో ఆవిడ స్పెషల్ సాంగ్ చేశారు. మరి, సినిమాలు? కథానాయికగా ఆవిడ ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంటే... తెలుగులో కొత్త సినిమాకు సంతకం చేశారు.
శ్రీ విష్ణు సినిమాలో కథానాయికగా కేతికా శర్మ
Ketika Sharma in Sree Vishnu 18th Movie: శ్రీ విష్ణు హీరోగా 'నిను వీడని నీడను నేనే' ఫేమ్ కార్తీక్ రాజు దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కుతోంది. హీరోగా శ్రీ విష్ణు 18వ సినిమా అది. అందులో కథానాయికగా కేతికా శర్మను ఎంపిక చేశారు. ఆవిడతో పాటు సినిమాలో మరో అందాల భామకు సైతం చోటు ఉంది. మరి, ఆ రోల్ ఎవరు చేస్తున్నారు? అంటే...
కేతికా శర్మతో పాటు 'లవ్ టుడే' భామ ఇవానా
తెలుగులోనూ సూపర్ డూపర్ సక్సెస్ సాధించిన తమిళ సినిమా 'లవ్ టుడే'. ప్రదీప్ రంగనాథ్ అందులో హీరో. మరి, హీరోయిన్ ఎవరో గుర్తు ఉందా? ఇవానా! ఆ అమ్మాయి సైతం శ్రీ విష్ణు సినిమాలో నటిస్తోంది. తెలుగులో ఆమెకు రెండో చిత్రమిది. కానీ, ఇదే ముందుగా విడుదల అయ్యే అవకాశం ఉంది. 'దిల్' రాజు ఫ్యామిలీ హీరో, నిర్మాత శిరీష్ కుమారుడు ఆశిష్ రెడ్డి 'సెల్ఫిష్'లో కూడా ఆమె హీరోయిన్. అయితే... ఆ సినిమా ఆలస్యం అవుతోంది.
Also Read: ఎవరీ వినయ్ మహేశ్వరి? మోహన్ బాబు వర్సెస్ మనోజ్ గొడవలో కీలకంగా మారిన బయట వ్యక్తి ఎవరు?
కేతికా శర్మ, ఇవానా... సినిమాలో ఇద్దరు హీరోయిన్లకు మంచి స్క్రీన్ స్పేస్ ఉందని యూనిట్ వర్గాలు అంటున్నాయి. లవ్ స్టోరీ బేస్డ్ సినిమా కావడంతో ప్రేమ సన్నివేశాలు బాగా వచ్చాయని అంటున్నారు. ఆల్రెడీ 65 - 70 పర్సెంట్ షూటింగ్ కంప్లీట్ అయ్యిందని, త్వరలో మిగతా సినిమా పూర్తి చేసి వచ్చే ఏడాది వేసవిలో ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నామని సమాచారం. మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, కల్యా ఫిలిమ్స్ సంస్థలు ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నాయి.
Also Read: నాగబాబుకు సినిమాటోగ్రఫీ శాఖ... ఏపీలో సినిమాను అన్నయ్య దగ్గర పెడుతున్న పవన్?
శ్రీ విష్ణుకు సినిమా కంపల్సరీ హిట్ అవ్వాలి!
'అల్లూరి' రిజల్ట్ పక్కన పెడితే... హీరో శ్రీ విష్ణుకు మంచి పేరు తెచ్చింది. ఆ తర్వాత 'సామజవరగమన', 'ఓం భీమ్ బుష్'తో భారీ విజయాలు అందుకున్నారు. ఆ రెండూ ప్రేక్షకులను నవ్వించడంతో పాటు నిర్మాతలకు లాభాలు తీసుకు వచ్చాయి. కానీ, 'స్వాగ్' ఆశించిన రీతిలో సక్సెస్ కాలేదు. కొన్ని విమర్శలు వచ్చాయి. దాంతో ఇప్పుడు ఈ సినిమా కంపల్సరీ హిట్ కావాల్సిన అవసరం ఏర్పడింది.