Nag Ashwin About Kalki 2898 AD: ప్ర‌భాస్, దీపికా ప‌దుకునే, అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల హాస‌న్ త‌దిత‌రులు న‌టిస్తున్న సినిమా 'కల్కీ 2898 ఏడీ'. ఈ సినిమా కోసం ప్రేక్ష‌కులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. అయితే, ఇటీవలే ఈ మూవీకి సంబంధించిన ఒక పోస్ట‌ర్ రిలీజ్ అయ్యింది. అయితే, అది హాలీవుడ్ సినిమా ‘Dune’లో పోస్టర్ తరహలో ఉంద‌ని కొంద‌రు ట్రోల్ చేస్తున్నారు. దీనిపై ద‌ర్శ‌కుడు నాగ్ అశ్విన్ క్లారిటీ ఇచ్చారు. హైద‌రాబాద్‌లో వీఎఫ్ఎక్స్ మీట్ లో ఆయ‌న ఒక స్టూడెంట్ అడిగిన ప్ర‌శ్న‌కి స‌మాధానం ఇచ్చాడు. 


ఇసుక ఉండ‌టం వ‌ల్లే.. 


హాలీవుడ్ సినిమా 'డ్యూన్'కి కాపీలా అనిపిస్తుంది ఈ సినిమా. దానికి దీనికి పోలిక ఉందా? అని ఒకరు ప్ర‌శ్నించగా.. నాగ్ అశ్విన్ కొట్టిపారేశారు. "ఇసుక ఉండ‌టం వ‌ల్ల మాత్ర‌మే మీకు అలా అనిపిస్తుంది" అని న‌వ్వుతూ స‌మాధానం చెప్పారు. "కేవ‌లం ఇసుక ఉండ‌టం వ‌ల్ల సినిమాలు ఒకే విధంగా ఉన్నాయ‌ని కూడా మీరు అనుకోకూడ‌దు" అని పేర్కొన్నారు. ఇక 'కల్కీ 2898 ఏడీ', 'డ్యూన్' చిత్రాల్లో సెట్టింగ్‌లు ఒకేలా ఉంటాయి. దీంతో దాన్ని కాపీ కొట్టారు అనుకుంటున్నారు అంద‌రూ. కాన్సెప్ట్, మేకింగ్‌, క్రాప్ట్ , విజువ‌లైజేష‌న్ ఇలా ప్ర‌తీదాన్ని హాలీవుడ్ సినిమాల‌తో పోలుస్తున్నారు. కానీ, క‌థ‌, క‌థ‌నం వేరేలా ఉండొచ్చు అని అంచ‌నా వేస్తున్నారు ఫ్యాన్స్. 


జూన్ 27న రిలీజ్..  


ప్ర‌భాస్ ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఎంత‌గానో ఎదురుచూస్తున్నారు. అయితే, ఈ సినిమాని మేలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేశారు మేక‌ర్స్. మే 3న సినిమా రావాల్సి ఉంది. అయితే, రెండు తెలుగు రాష్ట్రాల్లో మే 13న ఎన్నిక‌లు ఉన్న కార‌ణంగా దీన్ని పోస్ట్ పోన్ చేశారు మేక‌ర్స్. ఎన్నిక‌ల త‌ర్వాత జూన్ 27న రిలీజ్ చేయ‌నున్న‌ట్లు ప్ర‌క‌టించారు. 


ఇక ఈ సినిమా మ‌హాభార‌తంతో ప్రారంభ‌మై 2898 ఏడీలో ముగుయ‌నుంద‌ని నాగ్ అశ్విన్ గ‌తంలో చెప్పారు. దాదాపు 6000 సంవ‌త్స‌రాల కాలానికి విస్త‌రించింద‌ని అన్నారు. ఈ సందర్భంగా భిన్న ప్ర‌పంచాల‌ను సృష్టించేందుకు ప్ర‌య‌త్నించామ‌ని, అవి ఎలా ఉంటాయో ఊహించలేర‌ని బ్లేడ్ ర‌న్న‌ర్‌లా కాకుండా ఇండియ‌న్ లాగానే ఉంటాయ‌ని అన్నారు నాగ్ అశ్విన్. 


ఈ సినిమాని వైజ‌యంతి మూవీస్ భారీ బ‌డ్జెట్ తో నిర్మిస్తోంది. ప్ర‌భాస్, దీపికా ప‌దుకునే, క‌మ‌ల్ హాస‌న్, అమితాబ్ బ‌చ్చ‌న్ త‌దిత‌రులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. వీళ్లంతా భారీ రెమ్యున‌రేష‌న్లు తీసుకుంటున్న‌ట్లు వార్త‌లు వినిపిస్తున్నాయి. ప్ర‌భాస్ దాదాపు రూ.150 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్న‌ట్లు అంచ‌నా వేస్తున్నారు. ప్ర‌భాస్ ఒక ఏరియా ప్రాఫిట్స్ తీసుకుంటున్న‌ట్లు సినిమా వ‌ర్గాల్లో టాక్. ఇక అమితాబ్ బ‌చ్చ‌న్, క‌మ‌ల్ హాస‌న్, దీపికా ప‌దుకునే కూడా భారీగానే రెమ్యున‌రేష‌న్ వ‌సూలు చేస్తున్నార‌ట‌. వీళ్ల అంద‌రి రెమ్యున‌రేష‌న్ సినిమా బ‌డ్జెట్ లో 35 శాతం అని టాక్ వినిపిస్తోంది.


Also Read: నాని ఆ సినిమాలు చేయ‌కు అన్నారు, ఇప్పుడు మిస్ అవుతున్నా అంటున్నారు: అల్ల‌రి న‌రేశ్