Nag Ashwin about Kalki 2: బాక్సాఫీసు వద్ద 'కల్కి 2898 AD' సంచలనం సృష్టిస్తుంది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, డైరెక్టర్ నాగ్ అశ్విన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ చిత్రం జూన్ 27న ప్రేక్షకులు ముందుకు వచ్చింది. భారీ అంచనాల మధ్య విడుదలైన కల్కి ఊహించినట్టుగానే ప్రభంజనం సృష్టిస్తుంది. సునామీ వసూళ్లతో బాక్సాఫీసు వద్ద దూసుకుపోతుంది. ఈ మూవీ ఎనిమిది రోజుల్లో రూ. 700లక పైగా కోట్ల గ్రాస్ చేసి రూ. 1000 కోట్ల దిశగా దూసుకుపోతుంది. ఓవర్సిలోనూ కల్కి కలెక్షన్స్‌లో రికార్డు నెలకొల్పుతుంది. ఇలా వరల్డ్ వైడ్‌గా ప్రభంజనం సృష్టిస్తున్న కల్కి గురించి డైరెక్టర్ నాగ్ అశ్విన్ అదరిోయే అప్‌డేట్ ఇచ్చారు.
కాగా కల్కిని సినిమాటిక్ యూనివర్స్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎన్ని భాగాలు ఉంటాయనేది చెప్పలేమని ఇలా నాగ్ అశ్విన్ సినిమాటిక్ యూనివర్స్ అంటూ చెప్పకనే చెప్పాడు. ఇక ఈ మూవీ తొలి పార్ట్ భారీ విజయం సాధించింది. దీంతో సెకండ్ పార్ట్‌పై భారీ అంచనాలు నెలకొన్నాయి. మొదటి పార్ట్‌లో కమల్ పాత్రను పెద్ద చూపించనే లేదు. ఫస్ట్ పార్ట్‌లో భైరవగా తన స్వార్థం తను చూసుకునే ప్రభాస్‌ను మాత్రమే చూశాం. కానీ చివరిలో కర్ణుడిగా చూపించి ట్విస్ట్ ఇచ్చాడు డైరెక్టర్. ఈ క్రమంలో సెకండ్ పార్ట్ కోసం ఆడియన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో కల్కి పార్ట్ 2 గురించి నాగ్ క్రేజ్ అప్‌డేట్ ఇచ్చాడు.
కల్కి భారీ విజయం సాధించిన సందర్భంగా డైరెక్టర్ నాగ్ అశ్విన ఓ చానల్‌కు ఇంటర్య్వూ ఇచ్చారు. ఈ సందర్భంగా మొదటిసారి ఆయన కల్కి పార్ట్ 2పై స్పందించారు. కల్కి అసలు కథ మొదలయ్యేది పార్ట్ 2లోనే అంటూ అసలు విషయం చెప్పారు. "సీక్వెల్‌కి సంబంధించి ఇప్పటికే నెల రోజుల షూటింగ్ చేశామన్నారు. అందులో 20 శాతం మాత్రమే బాగా వచ్చిందన్నారు. మిగిలింది మళ్లీ ఫ్రెష్‌గా చేయాలనున్నారు. ఈ షెడ్యూల్ ముఖ్యమైన యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరించాల్సి ఉందన్నారు. ప్రభాస్, అమితాబ్, కమల్ మధ్య భారీ యాక్షన్ సన్నివేశాలుంటాయన్నారు. ఇక అశ్వత్థామ, కర్ణుడు, యాస్కిన్‌ల మధ్య శక్తివంతమైన ధనుస్సు కీలకం" అంటూ నాగ్ అశ్విన్ సీక్వెల్‌పై అప్‌డేట్ ఇచ్చారు.
ప్రస్తుతం ఆయన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. సీక్వెల్‌ప నాగ్ అశ్విన ఇచ్చిన అప్‌డేట్‌తో మూవీపై పార్ట్ 2పై మరిన్ని అంచనాలు పెరిగాయి. సీక్వెల్‌గా కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తున్నామంటూ ఫ్యాన్స్ స్పందిస్తున్నారు. కల్కి మూవీ రోజురోజుకు కొత్త రికార్డులు సెట్ చేస్తుంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే ఈ సినిమా ఇప్పటి వరకు రూ.363 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసింది. ఇక నార్త్ అమెరికా బాక్సాఫీసు వద్ద కల్కి 13.5 మిలియన్ డాలర్లు చేసి రికార్డు సెట్ చేసింది. ఇప్పటి వరకు ఏ ఇండియన్ మూవీ కూడా ఈ రేంజ్ కలెక్షన్స్ చేయలేదు. నార్త్ అమెరికాలో అత్యధిక గ్రాస్ వసూళ్లు చేసిన తొలి చిత్రం కల్కి నిలవడం విశేషం.
Also Read: నెటిజన్ నుంచి శృతి హాసన్‌కి అలాంటి ప్రశ్న - ఇలాంటి చెత్త ప్రశ్నలు అడగడం మానేయండి..