డైలాగ్ కింగ్ సాయి కుమార్ (Sai Kumar) వెర్సటైల్ యాక్టర్. ఎటువంటి పాత్రలో అయినా సరే పరకాయ ప్రవేశం చేయగలరు. ఇటీవల ఆయన నటించిన సినిమా అంటే బ్లాక్ బస్టర్ అనే సెంటిమెంట్ నెలకొంది. గత ఏడాది 'కమిటీ కుర్రోళ్లు', 'లక్కీ భాస్కర్', 'సరిపోదా శనివారం', 'మెర్సీ కిల్లింగ్' వంటి బ్లాక్ బస్టర్ సినిమాలు చేశారు. ఆయా చిత్రాలకు గద్దర్ పురస్కారాలు వచ్చాయి. ప్రస్తుతం సాయి కుమార్ చేతి నిండా సినిమాలు ఉన్నాయి. అందులో 'చౌకీదార్' ఒకటి.
హృదయాన్ని కదిలించేలా 'నాన్న' పాట!సాయి కుమార్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న సినిమా 'చౌకీదార్'. దీనిని తెలుగు, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఇందులో పృథ్వీ అంబర్ హీరో. ధన్యా రమ్య కుమార్ హీరోయిన్. ఈ సినిమా నుంచి 'నాన్న' పాటను విడుదల చేశారు.
'నాన్న అంటేనే మొదటి దైవం...తను పోసిన ప్రాణమిది...నాన్న అనగానే వాలే నీ ముందు...అలుపెరుగని ప్రాణమిది...మన కొరకై బ్రతికే ప్రాణం...మన బాధ్యత ఒకటే ధ్యానం...తన కంటి కనుపాపై కాపాడునులే నాన్న'అంటూ సాగే ఈ గీతాన్ని విజయ్ ప్రకాష్ ఆలపించారు. తండ్రి గొప్పతనం చాటి చెప్పేలా, గుండెలను పిండేసేలా సాగిన ఈ పాటకు సంతోష్ వెంకీ సాహిత్యం అందించారు. సచిన్ బస్రూర్ సంగీతం సమకూర్చారు. తండ్రి త్యాగాలు, బాధ్యతలు, అలాగే పిల్లలపై చూపించే ప్రేమను చాటి చెప్పేలా ఈ పాట సాగింది.
Also Read: మళ్ళీ నోరు జారిన నటకిరీటి... ఈసారి అలీని ఏకంగా బూతులతో... రాజేంద్ర ప్రసాద్ తాగి వచ్చారా?
'చౌకీదార్' సినిమాలో తండ్రీ కుమారులుగా సాయి కుమార్, పృథ్వీ అంబర్ యాక్ట్ చేశారు. ఈ చిత్రాన్ని వీఎస్ ఎంటర్టైన్మెంట్స్ పతాకం మీద డా. కల్లహల్లి చంద్ర శేఖర్ నిర్మిస్తున్నారు. చంద్రశేఖర్ బండియప్ప దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో సినిమా రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలిపారు.
Also Read: వదిలేయండ్రా బాబూ... ఈవిడ 'ఖలేజా'లో దిలావర్ సింగ్ వైఫ్ కాదు... ఇదిగో క్లారిటీ