విజయ్ దేవరకొండ, సమంత జంటగా నటించిన ‘ఖుషి’.. సెప్టెంబర్ 1న విడుదలయ్యింది. అప్పుడే ఫస్ట్ వీకెండ్ నుండి బయటికొచ్చింది. మొదటిరోజు నుండే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ మూవీ.. కలెక్షన్స్ విషయంలో కూడా దూసుకుపోతున్నట్టు తెలుస్తోంది. తాజాగా ఇప్పటివరకు ‘ఖుషి’ ఎంత కలెక్ట్ చేసిందనే లెక్కలు బయటికొచ్చాయి.


టాలీవుడ్‌లో పూర్తిస్థాయి లవ్ స్టోరీలు చాలా తక్కువ. అలా పూర్తిస్థాయి ప్రేమకథలు తెరకక్కిస్తూ గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు శివ నిర్వాణ. తాజాగా విజయ్ దేవరకొండ, సమంతతో కూడా అలాంటి ఒక కంప్లీట్ లవ్ స్టోరీని తెరకెక్కించాడు ఈ దర్శకుడు. అదే ‘ఖుషి’. ఈ మూవీకి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ అయినప్పటి నుండి సినిమాపై స్పెషల్ ఇంట్రెస్ట్ క్రియేట్ అయ్యింది. ఇక విడుదలయిన తర్వాత మంచి లవ్ స్టోరీ అని, విజయ్, సమంత నటన సినిమాకు ప్రాణం పోసింది అని పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. దీంతో కలెక్షన్స్ కూడా అదే రేంజ్‌లో కలెక్ట్ చేయడం మొదలుపెట్టింది ‘ఖుషి’. కచ్చితంగా విజయ్.. ఈసారి తన సినిమాతో రూ.100 కోట్లు కలెక్ట్ చేస్తాడని ఫ్యాన్స్ భావిస్తున్నారు.


షేర్ కలెక్షన్స్ ఎంతంటే..
‘ఖుషి’ విడుదలయిన మొదటిరోజే ప్రపంచవ్యాప్తంగా రూ.30 కోట్ల కలెక్షన్స్‌ను సాధించింది. ఈ విషయాన్ని మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది కూడా. సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చినా కూడా ప్రమోషన్స్ విషయంలో విజయ్, సమంత ఏ మాత్రం వెనక్కి తగ్గలేదు. మరికొంతమంది ప్రేక్షకులకు ‘ఖుషి’ని దగ్గర చేయాలనే ప్రయత్నిస్తూ ఉన్నారు. ఇక రెండోరోజుకు వచ్చేసరికి ‘ఖుషి’.. రూ.50 కోట్లు కలెక్ట్ చేసింది. మూడు రోజుల్లో రూ.70 కోట్ల గ్రాస్‌ మార్క్‌ను టచ్ చేసింది. దీన్ని బట్టి చూస్తే ‘ఖుషి’కి దాదాపుగా రూ.35 కోట్ల షేర్ కలెక్షన్స్ వచ్చాయి. మూడు రోజుల్లోనే రూ.70 కోట్లు సాధించింది అంటే.. తరువాతి వీకెండ్ వచ్చేలోపు కచ్చితంగా ‘ఖుషి’.. రూ.100 కోట్ల మార్క్‌ను టచ్ చేస్తుందని ఇండస్ట్రీ నిపుణులు అంచనా వేస్తున్నారు.


బ్రేక్ ఈవెన్ రావాలంటే..
‘ఖుషి’ రిలీజ్‌కు చాలాకాలం ముందు నుండే మూవీ టీమ్ అంతా ప్రమోషన్స్ విషయంలో ఎంతో కష్టపడ్డారు. ముఖ్యంగా విజయ్ దేవరకొండ, సమంత అయితే స్వయంగా తమ సినిమా ప్రమోషన్స్ గురించి స్పెషల్ కేర్ తీసుకున్నారు. దీంతో ‘ఖుషి’ రూ.53 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే బ్రేక్ ఈవెన్ కోసం రూ.55 కోట్ల షేర్ కలెక్షన్స్ రావాలి. ప్రస్తుతం అందులో రూ.35 కోట్ల షేర్ కలెక్షన్స్ మార్క్‌ను టచ్ చేసిన ‘ఖుషి’.. త్వరలోనే బ్రేక్ ఈవెన్ అందుకుంటుందని ఇండస్ట్రీ నిపుణులు చెప్తున్నారు. దీంతో పాటు రూ.100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ కూడా సాధించే అవకాశం ఉందని అనుకుంటున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న విజయ్‌కు ‘ఖుషి’ హిట్ కాస్త ఊరటను ఇచ్చింది.


Also Read: ఓవర్సీస్ మార్కెట్ పై ఫోకస్ పెట్టిన జాతిరత్నం.. ‘Miss. శెట్టి Mr. పోలిశెట్టి’ ప్రమోషన్స్ కోసం అమెరికా పయనమైన నవీన్ పోలిశెట్టి!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial