ప్రముఖ తమిళ నిర్మాత శిబు తమీన్స్ కుమారుడు హ్రిదు హరూన్ (Hridhu Haroon) కథానాయకుడిగా పరిచయం అవుతున్న సినిమా 'కోనసీమ థగ్స్' (KonaSeema Thugs Movie). బాబీ సింహ (Bobby Simha), ఆర్.కె. సురేష్, మునిష్కంత్, శరత్ అప్పనీ, అనస్వర రాజన్ ముఖ్య తారాగణం. ఈ చిత్రానికి ప్రముఖ కొరియోగ్రాఫర్ బృందా గోపాల్ దర్శకత్వం వహించారు. ఇప్పుడీ సినిమా మైత్రీ మూవీ మేకర్స్ చేతికి వెళ్ళింది.
'కోనసీమ థగ్స్'తో ఏపీలోనూ మైత్రీ అడుగు
సంక్రాంతికి విడుదలైన బ్లాక్ బస్టర్ ఫిల్మ్స్ 'వాల్తేరు వీరయ్య', 'వీర సింహా రెడ్డి'లతో మైత్రీ మూవీ మేకర్స్ డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థలోకి అడుగు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ రెండు సినిమాలను నైజాంలో విడుదల చేశారు. ఇప్పుడు 'కోనసీమ థగ్స్'తో ఏపీలోనూ అడుగు పెడుతున్నారు. అక్కడ కూడా డిస్ట్రిబ్యూషన్ స్టార్ట్ చేస్తున్నారు. 'కోనసీమ థగ్స్' తెలుగు వెర్షన్ ను అన్ని ఏరియాల్లో విడుదల చేస్తున్నారు.
ఫిబ్రవరి 24న 'కోనసీమ థగ్స్' విడుదల
KonaSeema Thugs Release Date : ఫిబ్రవరి నెలాఖరున... ఈ 24న 'కోనసీమ థగ్స్' చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు హెచ్.ఆర్. పిక్చర్స్ సంస్థ వెల్లడించింది. విజయ్ 'పులి', విక్రమ్ 'ఇంకొక్కడు', 'సామి స్క్వేర్'తో పాటు హిందీ సినిమా 'ముంబైకర్' నిర్మించిన శిబు తమీన్స్ కుమార్తె రియా షిబు ఈ చిత్రానికి నిర్మాత. జియో స్టూడియోస్ భాగస్వామ్యంతో హెచ్.ఆర్. పిక్చర్స్ పతాకంపై నిర్మించారు. తెలుగుతో పాటు హిందీ, తమిళ, మలయాళ భాషల్లో సినిమాను విడుదల చేయనున్నారు. పాన్ ఇండియా రిలీజ్ అన్నమాట.
వీర శూర మహంకాళి...
పాటకు సూపర్ రెస్పాన్స్!
'కోనసీమ థగ్స్' సినిమాలోని తొలి పాట 'వీర శూర మహంకాళి వస్తోందయ్యా...'ను ఇటీవల విడుదల చేశారు. కాళికా అమ్మవారి ఊరేగింపు నేపథ్యంలో వచ్చే గీతమిది. ఆస్కార్ బరిలో నిలిచిన 'నాటు... నాటు...' పాటను పాడిన కాలభైరవ ఈ పాట పాడారు. దీనికి సామ్ సిఎస్ బాణీ అందించారు.
Also Read : ఫిల్మ్ సిటీలో చిరుత దాడి - ఆసుపత్రిలో అక్షయ్ కుమార్ సినిమా మేకప్ ఆర్టిస్ట్
ఇటీవల 'కోనసీమ థగ్స్' తెలుగు ట్రైలర్ విడుదల చేశారు. రా అండ్ రస్టిక్ థీమ్‌తో ఆ ట్రైలర్ సాగింది. అందులో ఏ ఎవరి క్యారెక్టర్ ఏమిటి? అనేది ఇంట్రడ్యూస్ చేశారు. హత్య చేసి జైలుకు వచ్చిన అనాథగా హ్రిదు హరూన్ కనిపించారు. అప్పటికి జైల్లో ఉన్న వ్యక్తులుగా మునిష్కంత్, బాబీ సింహాను చూపించారు. వాళ్ళంతా కలిసి ఎస్కేప్ ప్లాన్ చేస్తారు. అయితే... ఫస్ట్ అటెంప్ట్ ఫెయిల్ అవుతుంది. సెకండ్ అటెంప్ట్ ఎలా చేశారు? ఏమైంది? అనేది సినిమా. పోలీస్ రోల్ చేసిన ఆర్.కె. సురేష్ వీళ్ళను ఎలా అడ్డుకున్నాడు? అనేది సినిమాలో చూడాలి. యాక్షన్ ఎపిసోడ్స్ & రస్టిక్ ఫీల్ హైలైట్ అయ్యాయి.
Also Read : 'వినరో భాగ్యము విష్ణు కథ' రివ్యూ : కిరణ్ అబ్బవరానికి హిట్ వచ్చిందా? లేదా?
ఈ చిత్రానికి సామ్ సిఎస్ సంగీతం అందిస్తుండగా... 'ఆర్ఆర్ఆర్' ప్రోమో ఎడిటర్‌గా పాపులర్ అయిన ప్రవీణ్ ఆంటోనీ ఎడిటింగ్ బాధ్యతలు చూస్తున్నారు. ప్రీయేష్ గురుస్వామి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఇంకా ఈ చిత్రానికి ప్రాజెక్ట్ డిజైనర్ : జోసెఫ్ నెళ్లికల్, యాక్షన్ : ఫీనిక్స్ ప్రభు, రాజశేఖర్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ : ముత్తు కురుప్పయ్య, కాస్ట్యూమ్స్ : మాలిని కార్తికేయన్.