Vijay Devarakonda's Family Star Censor Talk: 'ఫ్యామిలీ స్టార్' సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తి అయ్యాయి. సెన్సార్ బోర్డు ఈ చిత్రానికి 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. పెద్దలతో కలిసి పిల్లలు కూడా సినిమా చూడవచ్చు అన్నమాట! ఇదొక కుటుంబ కథా చిత్రం. అయితే... కొన్ని ఫైట్స్ కారణంగా యు/ఎ ఇచ్చారని టాక్. మరి, సినిమాలో డిలీటెడ్ సీన్లు, డైలాగుల సంగతి ఏంటి? అనేది చూస్తే...
ఆ నాలుగు డైలాగులూ మ్యూట్...
అలాగే ఏమైనా సీన్లు డిలీట్ చేశారా?
'ఫ్యామిలీ స్టార్' సినిమాలో డిలీటెడ్ సీన్లు ఏమీ లేవని తెలిసింది. అయితే... ఓ పాటలో లిక్కర్ బాటిల్స్ వచ్చినప్పుడు ఆయా లోగోలు కనిపించకుండా చూడాలని సెన్సార్ బోర్డు చెప్పింది. దాంతో బాటిల్స్ లోగోలను సీజీతో కవర్ చేశారు.
దర్శకుడు పరశురామ్ డైలాగుల్లో కొన్ని బూతు పదాలు రాయగా... సెన్సార్ బోర్డు కత్తెరకు పని చెప్పింది. 'లం.... డ', 'F...K', 'మ.... ద్', 'ము....డ' పదాలు డైలాగుల నుంచి తొలగించాలని సెన్సార్ బోర్డు ఆదేశించడంతో వాటిని మ్యూట్ చేశారు. సో... సినిమాలో పెద్దగా డిలీట్ చేసిన సీన్లు అసలు లేవని చెప్పాలి.
'ఫ్యామిలీ స్టార్' సెన్సార్ టాక్ ఎలా ఉందేంటి?
'ఫ్యామిలీ స్టార్'కు సెన్సార్ తర్వాత పాజిటివ్ టాక్ వచ్చింది. 'గీత గోవిందం' తర్వాత పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ నటించిన చిత్రమిది. ఆ సినిమా తరహాలో ఇదీ యూత్, ఫ్యామిలీ ఆడియన్స్‌ను ఆకట్టుకుంటుందని మంచి రిపోర్ట్స్ వచ్చాయి. ఆల్రెడీ విడుదలైన పాటలు, ప్రచార చిత్రాలు ప్రేక్షకుల్లోకి వెళ్లాయి. సో, సినిమా సైతం భారీ హిట్ సాధించే అవకాశాలు ఉన్నాయి.
Also Read: ఈ నెలలోనే విశ్వక్ సేన్ 'గామి' ఓటీటీ రిలీజ్... ZEE5లో ఎప్పటి నుంచి స్ట్రీమింగ్ అవుతుందంటే?
'ఫ్యామిలీ స్టార్' సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా మృణాల్ ఠాకూర్ యాక్ట్ చేశారు. 'సీతా రామం' తర్వాత తెలుగులో ఆమె నటించిన చిత్రమిది. 'ఏవండీ...' అంటూ ట్రైలర్‌లో ఆవిడ చెప్పిన డైలాగ్ వైరల్ అయ్యింది. విజయ్, మృణాల్ జోడీకి తోడు ప్రముఖ నిర్మాత 'దిల్' రాజు బ్యానర్ వేల్యూ యాడ్ కావడంతో సినిమా బజ్ బావుంది.
ఏప్రిల్ 5న 'ఫ్యామిలీ స్టార్' థియేటర్లలో విడుదల కానుంది. తెలుగుతో పాటు ఆ రోజే తమిళంలోనూ విడుదల చేస్తున్నారు. హిందీలో రెండు వారాల తర్వాత విడుదల చేయాలని ప్లాన్ చేశారు. జగపతి బాబు, రోహిణి హట్టంగడి, వాసుకి, అచ్యుత్ కుమార్ సహా పలువురు ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి గోపీసుందర్ మ్యూజిక్ అందించారు. 'గీత గోవిందం' తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ పెట్లతో కలిసి మరోసారి ఆయన పని చేశారు. పాటలకు మంచి పేరు వచ్చింది.