ఇప్పుడు మురళీ మోహన్ (Murali Mohan Age)కు ఎన్ని సంవత్సరాలో తెలుసా? 85 ఏళ్ళు. ఈ వయసులోనూ ఆయన చాలా యాక్టివ్‌గా ఉన్నారు. ఇటీవల 'అతడు' రీ రిలీజ్ ప్రెస్‌మీట్‌లో కనిపించారు. నటుడిగా కొత్త సినిమాకు క్లాప్ కొట్టారు. 'సుప్రీమ్ వారియర్స్'లో నటిస్తున్నారు. పూజతో ఆ సినిమా ప్రారంభమైంది.
'సుప్రీమ్ వారియర్స్'లో మురళీ మోహన్...కరోనా కాలంలో రాసిన కథ - తైవాన్ కనెక్షన్!మురళీ మోహన్ ప్రధాన పాత్రలో రూపొందుతున్న 'సుప్రీమ్ వారియర్స్'ను ఆది అక్షర ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై పెదపూడి బాబూ రావు నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి హరి చందన్ దర్శకుడు. హైదరాబాద్‌లో పూజతో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ కెమెరా స్విచ్ఛాన్ చేయగా... దవళ సత్యం, మురళీ మోహన్ గౌరవ దర్శకత్వం వహించారు. బెల్లంకొండ సురేష్, దర్శకుడు వీరశంకర్, శివరాజ్ పాటిల్, శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు.
దర్శకుడు హరి చందన్ చెప్పిన కథ తనకు ఎంతగానో నచ్చిందని, 'సుప్రీమ్ వారియర్స్'లో నటిస్తుండటం ఆనందంగా ఉందని మురళీ మోహన్ తెలిపారు. ఈ సినిమాలో హీరో - నిర్మాత పెదపూడి బాబూ రావు ఎన్నారై అని, సినిమాలపై ఆసక్తితో ఇండియా వచ్చారని ఆయన చెప్పారు. దర్శకుడు హరి చందన్ మాట్లాడుతూ... ''కరోనా కాలంలో అనుకున్న కథ ఇది. తైవాన్ మీద దాడి తర్వాత కథ రాయడం మొదలుపెట్టా. ఎనిమిది పాత్రలతో జరిగే కథ ఇది. మేం 800ల ఆర్మీ కుటుంబాలను ప్రత్యక్షంగా కలిసి రెండున్నరేళ్లు రీసెర్చ్ చేసి స్క్రిప్ట్ రాశాం'' అని చెప్పారు.
హీరో, నిర్మాత పెదపూడి బాబూరావు మాట్లాడుతూ... ''మా సినిమా ప్రారంభోత్సవానికి వచ్చిన పెద్దలకు థాంక్స్. ఇదొక సై-ఫై, యాక్షన్ థ్రిల్లర్. మురళీ మోహన్ గారు ఇప్పటి వరకు ఎన్నడూ కనిపించనటు వంటి కొత్త పాత్రలో కనిపిస్తారు. నేను ఒక లీడ్ రోల్ చేస్తున్నా. మిగతా పాత్రలకు కొందరు హీరోల్ని సంప్రదించాం. త్వరలో వివరాలు ప్రకటిస్తాం. 'అతడు'తో నాకు నటుడిగా జన్మ ఇచ్చింది మురళీ మోహన్ గారు. ఆయనతో నటిస్తుండటం సంతోషంగా ఉంది'' అని చెప్పారు.
Supreme Warriors Movie Cast And Crew: 'సుప్రీమ్ వారియర్స్' సినిమాలో మురళీ మోహన్, బాబూ రావు, మహిమా చౌదరి, కల్పన, ఆదిత్య ఓం, పృథ్వీరాజ్, 'దవళ' సత్యం, వీరేంద్ర చౌహాన్, రాజ్ పాల్ యాదవ్, మోహన్ శర్మ తదితరులు ప్రధాన తారాగణం. ఈ చిత్రానికి నిర్మాణ సంస్థ: ఆది అక్షర ఎంటర్‌టైన్‌మెంట్స్, నిర్మాత: పెదపూడి బాబూ రావు, దర్శకుడు: హరి చందన్.
Also Read: 'మయసభ' క్లైమాక్స్... ఎన్టీఆర్, చంద్రబాబులను ఒక్కటి చేసిన నారా లోకేష్ - ఎలాగంటే?