టీమిండియా స్టార్ క్రికెటర్ MS ధోని ఇటీవల సినీ రంగానికి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. రీసెంట్ గానే నిర్మాణరంగంలోకి అడుగుపెట్టిన ధోని ఇప్పుడు నిర్మాతగా బిజీ అవ్వాలని చూస్తున్నారు. క్రికెటర్ గా ఉన్నప్పుడే పలు రంగాల్లో అడుగుపెట్టిన ధోని ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో ఫుల్ టైం బిజీ అవ్వాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే తన నిర్మాణంలో ఓ తమిళ సినిమాను నిర్మించారు ధోని. ఆ సినిమా ఈనెల చివరిలో ఆడియన్స్ ముందుకు రానుంది. కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్, లవ్ టుడే ఫేమ్ ఇవానా జంటగా 'LGM'(Lets Get Married) అనే సినిమా తెరకెక్కింది. ఈ సినిమాని స్వయంగా ధోని నిర్మించారు. ఇటీవలే ఈ చిత్ర ట్రైలర్ ని రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సందర్భంగా చెన్నైలో ట్రైలర్ రిలీజ్ కార్యక్రమంలో ధోని పాల్గొన్నారు.


నిర్మాతగా ధోని తమిళ ఇండస్ట్రీలో సినిమా నిర్మించడానికి కారణం ఏంటో తెలియదు కానీ ఇప్పుడు మాత్రం తెలుగులో కూడా ఆయన ఓ సినిమాను నిర్మించాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ధోని నిర్మాతగా తన తదుపరిచిత్రాన్ని కూడా తమిళంలోనే చేస్తున్నారట. అయితే అదే సమయంలో ఓ తెలుగు సినిమాని కూడా నిర్మించేందుకు ధోని చర్చలు జరుపుతున్నట్లు వార్తల వినిపిస్తున్నాయి. విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం ధోని తన నిర్మాణంలో మీడియం రేంజ్ బడ్జెట్ సినిమాలు నిర్మించేందుకు పలువురు టాలీవుడ్ యంగ్ హీరోలతో చర్చలు జరుగుతున్నట్లుగా తెలుస్తోంది. ధోని నిర్మాణంలో సినిమా అంటే ఏ హీరో అయినా వెంటనే డేట్స్ ఇచ్చే అవకాశం ఉంది.


కాబట్టి త్వరలోనే టాలీవుడ్ యంగ్ హీరోతో ధోని తెలుగు సినిమాకు సంబంధించిన అఫీషియల్ అనౌన్స్మెంట్ ఏ సమయంలోనైనా రావచ్చని అంటున్నారు. తమిళ్ తెలుగు మాత్రమే కాకుండా హిందీలో కూడా ధోని నిర్మాణంలో సినిమా ఉండబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కాగా క్రికెటర్ గారి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత ధోని సినీ నిర్మాణ రంగంలో అడుగు పెట్టారు. ఈ మేరకు 'ధోని ఎంటర్టైన్మెంట్స్' అనే బ్యానర్ను స్థాపించి తన మొదటి చిత్రాన్ని తమిళంలోనే నిర్మించారు. అందుకు కారణం తమిళనాడులో ధోని కి అధిక సంఖ్యలో అభిమానులు ఉన్నారు. క్రికెటర్ గా ఉన్నప్పుడు ఆయన ప్రతీ ఐపీఎల్ సీజన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకి కెప్టెన్గా వ్యవహరించారు.


దాంతో తమిళనాడుతో ధోనికీ ప్రత్యేక అనుబంధం ఉంది. అందుకే తన మొదటి సినిమాని తమిళంలోనే నిర్మించారు. ఇక ధోని నిర్మించిన తమిళ మూవీ 'LGM'( Lets Get Married) జూలై 28న ముందుకు రాబోతోంది. తమిళం తో పాటు తెలుగులో కూడా ఈ సినిమా విడుదల కానుంది. లవ్ అండ్ ఫ్యామిలీ ఎమోషన్స్ కాన్సెప్ట్ తో రూపొందిన ఈ సినిమాకి రమేష్ తమిళ్ మని దర్శకత్వం వహిస్తున్నారు. సీనియర్ నటి నదియా, కమెడియన్ యోగి బాబు కీలకపాత్రలు పోషిస్తున్నారు. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ ని అందుకుంది. ఇక నిర్మాతగా ఈ చిత్రం ధోనీకి ఎలాంటి సక్సెస్ ని అందిస్తుందో చూడాలి.


Also Read : తమిళ దర్శకుడితో నాని సినిమా?


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial