టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ క్రేజ్ గురించి తెలిసిందే. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తన టాలెంట్ తో హీరోగా తనకంటూ సపరేట్ ఇమేజ్ ని క్రియేట్ చేసుకున్నాడు. ఇండస్ట్రీకి ఎంతో మంది కొత్త దర్శకులను పరిచయం చేశాడు. హిట్, ప్లాప్స్ తో సంబంధం లేకుండా టాలీవుడ్ లో సినిమాలు చేసే హీరోల్లో రవితేజ ముందు వరుసలో ఉంటారు. అలాంటి మాస్ మహారాజా రవితేజ ఈరోజు(జనవరి 26) తన పుట్టినరోజు జరుపుకుంటున్నారు.


తమ అభిమాన హీరో పుట్టినరోజుని ఫ్యాన్స్ ఎంతో స్పెషల్ గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ స్పెషల్ డే ని మరింత స్పెషల్ గా మారుస్తూ రవితేజ లేటెస్ట్ సినిమాలకు సంబంధించి అప్డేట్స్ ఇస్తూ ఆయనకి బర్త్ డే విషెస్ అందజేస్తున్నారు మేకర్స్. ఇందులో భాగంగానే రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్' నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్ చేశారు. రవితేజ కి బర్త్ డే విషెస్ అందజేస్తూ రిలీజ్ చేసిన ఈ పోస్టర్ అభిమానుల్ని ఆధ్యంతం ఆకట్టుకుంటోంది.






క్లాస్ లుక్ లో మాస్ స్వాగ్..


ఇక పోస్టర్ విషయానికొస్తే.. ఈ పోస్టర్లో రవితేజ యాక్షన్ మోడ్ లో కనిపిస్తున్నారు. ఇది వరకు రిలీజ్ చేసిన 'మిస్టర్ బచ్చన్' ఫస్ట్ లుక్ లో సూపర్ కూల్ గా కనిపించిన రవితేజ లేటెస్ట్ పోస్టర్ లో మాత్రం తనదైన మార్క్ మాస్ స్వాగ్ తో ఆకట్టుకుంటున్నాడు. ఈ పోస్టర్ చూస్తే సినిమాలో భారీ యాక్షన్ సీక్వెన్స్ లాగా కనిపిస్తోంది. ఇందులో రవితేజ బ్లూ షర్ట్, బ్యాగి ప్యాంట్ లో టక్ చేసుకొని క్లాస్ గా కనిపిస్తూనే తన మాస్ స్వాగ్ తో అదరగొట్టేసారు. ఆయన వెనకాల వింటేజ్ కార్లు, పాత బిల్డింగ్స్ కూడా కనిపిస్తున్నాయి.


ప్రస్తుతం ఈ పోస్టర్ సోషల్ మీడియా అంతటా వైరల్ గా మారుతుంది. కాగా ఈ సినిమా లేటెస్ట్ షెడ్యూల్ ని కర్తెకుడిలో ప్లాన్ చేశారు. సినిమాలోని ప్రధాన సన్నివేశాల చిత్రీకరణ కోసం మూవీ టీం తాజాగా కరైకుడికి వెళ్ళింది. అక్కడి పరిసర ప్రాంతాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ హరీష్ శంకర్, రవితేజ కలిసి ఫ్లైట్ లో కర్తెకుడి కి వెళ్తున్న ఫోటోలను మూవీ టీం ఇటీవలే సోషల్ మీడియా వేదికగా పంచుకుంది.


అజయ్ దేవగన్ 'రైడ్' మూవీకి రీమేక్ గా 'మిస్టర్ బచ్చన్'..


బాలీవుడ్ అగ్ర హీరో అజయ్ దేవగన్ లీడ్ రోల్ లో నటించిన 'రైడ్' సినిమాకి రీమేక్ గా మిస్టర్ బచ్చబ్ తెరకెక్కుతోంది. రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా ఈ 'రైడ్' సినిమాను తీశారు. భారతీయ పారిశ్రామికవేత్త సర్దార్ ఇందర్ సింగ్ పై దాదాపు మూడు రోజులపాటు జరిపిన ఇన్ కమ్ టాక్స్ రైడ్ ఆధారంగా ఈ మూవీ తెరకెక్కింది. ఇప్పుడు ఇదే ' మూవీని తన స్టైల్ లో రవితేజ ఇమేజ్ కి తగినట్లుగా కమర్షియల్ అంశాలను కలిపి హరీష్ శంకర్ రీమేక్ చేస్తున్నారు. ఈ సినిమాలో రవితేజ సరసన బాలీవుడ్ భామ భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తోంది. పనోరమా స్టూడియోస్, టీ సిరీస్ సమర్పణలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ప్రముఖ నిర్మాత టీజీ విశ్వ ప్రసాద్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. వివేక్ కూచిభొట్ల సహ నిర్మాత. మిక్కీ జే మేయర్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.