Vijaysai Reddy On SVP : సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా నటించిన సర్కారు వారి పాట సినిమా గురువారం విడుదల అయింది. మహేశ్ బాబు యాక్షన్, డైలాగ్ డెలవరీతో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాపై వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి స్పందించారు. సినిమాపై ప్రశంసలు కురించారు. సమకాలీన అంశాలతో సాగిన సందేశాత్మక చిత్రం సర్కారు వారి పాట బాగుందని విజయసాయి రెడ్డి ట్వీట్ చేశారు. పేదలు, పెద్దలకు అప్పు ఇవ్వడంలో బ్యాంకులు చూపే తేడాను బాగా ఆవిష్కరించారని ప్రశంస‌లు కురిపించారు. 










సర్కారు వారి పాట ఓటీటీ రైట్స్ ఎవరికంటే?


సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) కథానాయకుడిగా నటించిన తాజా సినిమా 'సర్కారు వారి పాట' ఓటీటీ రైట్స్‌ను దిగ్గజ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా నేడు విడుదలైన సంగతి తెలిసిందే. డిజిటల్ స్ట్రీమింగ్ పార్ట్‌న‌ర్‌ ప్రైమ్ వీడియో అని థియేటర్లలో ప్రదర్శించారు. ఓటీటీలో 'సర్కారు వారి పాట' ఎప్పుడు విడుదల అవుతుందనేది ఇప్పటికిప్పుడు చెప్పలేం. థియేటర్లలో విడుదలైన రెండు నెలలకు 'ఆర్ఆర్ఆర్' ఓటీటీలో విడుదల అవుతోంది. మరోవైపు, 'రాధే శ్యామ్' థియేటర్లలో విడుదలైన 20 రోజులకు వచ్చింది. థియేట్రికల్ రన్ మీద ఓటీటీ రిలీజ్ ఆధారపడి ఉంటుంది. శాటిలైట్ రైట్స్ విషయానికి వస్తే... 'సర్కారు వారి పాట' స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుంది. అదీ ఓటీటీలో విడుదలైన తర్వాతే! ఈ సినిమా శాటిలైట్ రైట్స్‌ను స్టార్ మా దక్కించుకుంది. ఆ ఛానల్ లోగో కూడా 'సర్కారు వారి పాట' టైటిల్ కార్డ్స్‌లో పడింది. సినిమాలో కొత్త మహేష్ బాబు కనిపించారని విమర్శలు, ప్రేక్షకులు చెబుతున్నారు. థియేటర్ల దగ్గర సినిమాకు వస్తున్న స్పందనపై నిర్మాతలు సంతోషం వ్యక్తం చేశారు.