మెగాస్టార్ చిరంజీవి లేటెస్ట్ సోషియా ఫాంటసీ సినిమా 'విశ్వంభర'లో బాలీవుడ్ భామ మౌనీ రాయ్ స్పెషల్ సాంగ్ చేసిన సంగతి తెలిసిందే. తెలుగులో ఆమెకు తొలి సాంగ్ ఇది. పైగా, చిరు మూవీ! ఆ ఎగ్జైట్మెంట్ ఎక్కువ ఉందనుకుంట... విజువల్స్, లుక్స్, స్టెప్స్ రివీల్ అయ్యేలా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
'విశ్వంభర' సెట్స్ నుంచి పోస్ట్...వెంటనే డిలీట్ చేసిన మౌనీ రాయ్!Mouni Roy deletes Vishwambhara special song post: 'విశ్వంభర' సినిమాలోని ప్రత్యేక గీతంలో చిరంజీవితో కలిసి మౌనీ రాయ్ స్టెప్పులు వేసిన సంగతి తెలిసిందే. సాంగ్ షూటింగ్ ఫినిష్ అయ్యింది. దాంతో చిరు, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యతో దిగిన ఫోటోలను ఆవిడ సోషల్ మీడియాలో షేర్ చేసింది. అవి వైరల్ అయ్యాయి. 'విశ్వంభర' టీం అలర్ట్ అయ్యిందో లేదంటే మరొకటో... వెంటనే ఆ పోస్ట్ డిలీట్ చేసింది. దాంతో ఆ ఫోటోలు లీక్ అయ్యాయని ఫ్యాన్స్, ఆడియన్స్ భావిస్తున్నారు. మౌనీ రాయ్, చిరు ఉన్న ఈ ఫోటో ఇప్పుడు నెట్టింట్లో వైరల్ అవుతోంది.
Also Read: వార్ 2 వర్సెస్ కూలీ... రజనీ మూవీని డామినేట్ చేసిన ఎన్టీఆర్ సినిమా
ఈ సినిమాకు ఎంఎం కీరవాణి మ్యూజిక్ డైరెక్టర్ అయితే స్పెషల్ సాంగ్ భీమ్స్ చేశారు. దాంతో రూమర్లు వచ్చాయి. 'హరి హర వీరమల్లు' మూవీ ఆర్ఆర్ పనుల్లో కీరవాణి బిజీగా ఉన్న టైంలోనే ఇలా భీమ్స్ చేత విశ్వంభర టీం ఈ స్పెషల్ సాంగ్‌ను కంపోజ్ చేయించుకుంది. ఈ విషయం మీద వశిష్ట స్పందించి క్లారిటీ ఇవ్వడంతో రూమర్లు ఆగిపోయాయి. అప్పటి వరకు కీరవాణి ఇచ్చిన ఆ స్పెషల్ సాంగ్ ట్యూన్ నచ్చకపోవడం వల్ల ట్రెండింగ్‌లో ఉన్న భీమ్స్‌తో కంపోజ్ చేయించుకున్నారనే రూమర్లు వచ్చాయి. కానీ వశిష్ట జరిగిన విషయాన్ని చెప్పడంతో ఆ రూమర్లు ఆగిపోయాయి.
Also Read: విజయ్ దేవరకొండ 'కింగ్‌డమ్' రైట్స్ ఎన్ని కోట్లకు అమ్మారు? థియేటర్ల నుంచి ఎన్ని కోట్లు రాబట్టాలంటే?
విశ్వంభర మూవీ రిలీజ్ డేట్ విషయంలో ఇప్పటికీ సందిగ్థత నెలకొని ఉన్న సంగతి తెలిసిందే. టీజర్ తరువాత వీఎఫ్ఎక్స్ మీద భారీ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఇక వశిష్ట ఆ ట్రోలింగ్, విమర్శల్ని చాలా సీరియస్‌గా తీసుకుని మళ్లీ వీఎఫ్ఎక్స్ వర్క్ చేయిస్తున్నారు. వీఎఫ్ఎక్స్‌కు సంబంధించిన అవుట్ పుట్ వచ్చిన తరువాత, సంతృప్తి చెందిన తరువాతే రిలీజ్ డేట్ ప్రకటిస్తామని వశిష్ట చెబుతున్నారు. 'విశ్వంభర' సినిమా నుంచి అప్డేట్లు రావడం లేదని మెగా ఫ్యాన్స్ కొందరు చాలా అసంతృప్తిగా ఉన్నారన్న సంగతి తెలిసిందే. 'విశ్వంభర' వీఎఫ్ఎక్స్ పనులు ఇంకా పూర్తి కాలేదని, అవి వచ్చాకే రిలీజ్ డేట్ మీద క్లారిటీ ఇస్తామని డైరెక్టర్ వశిష్ట చెబుతున్న సంగతి తెలిసిందే. భూ లోకం టు సత్య లోకం అంటూ సినిమాకు సంబంధించిన కథ, బ్యాక్ డ్రాప్‌ను కూడా రివీల్ చేసేస్తున్నారు. ‘విశ్వంభర’ చిత్రానికి సంబంధించి గత కొన్ని రోజులుగా వస్తున్న కొన్ని వార్తలు వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే.