Mohanlal hospitalized in Kochi: ప్రముఖ మలయాళ కథానాయకుడు... భాషలకు అతీతంగా భారతీయ ప్రేక్షకుల్లో గుర్తింపు తెచ్చుకున్న నటుడు మోహన్ లాల్. ఆయన ఆసుపత్రి పాలయ్యారు అనే వార్త అభిమానులను ఆందోళనకు గురి చేసింది. అయితే... పెద్దగా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. ఆస్పత్రి వైద్యులు మోహన్ లాల్ ఆరోగ్య పరిస్థితి గురించి ఒక హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. అందులో ఏముంది అంటే....


ఐదు రోజులు విశ్రాంతి అవసరం!
ప్రస్తుతం మోహన్ లాల్ వయసు 64 సంవత్సరాలు. అందువల్ల, ఈ స్టార్ హీరో ఆసుపత్రి పాలయ్యాడు అనే వార్త విని తమ అభిమాన కథానాయకుడికి ఏమైందోనని ప్రేక్షకులు ఆందోళన చెందారు. అసలు విషయం ఏమిటంటే... తీవ్ర జ్వరం, కండరాలలో నొప్పి, శ్వాస తీసుకోవడానికి చిన్నపాటి ఇబ్బందులు తలెత్తడంతో ఆసుపత్రికి వెళ్లారు మోహన్ లాల్. ఆయన పరిస్థితిని పరిశీలించిన వైద్యులు ఐదు రోజుల పాటు విశ్రాంతి అవసరం అని సూచించారు. అది సంగతి. ఈ విషయం తెలిసిన అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని భగవంతుడికి ప్రార్థనలు చేస్తున్నారు.


Also Readస్త్రీ 2 రివ్యూ: శ్రద్ధా కపూర్ మళ్లీ వచ్చిందిరోయ్... బాలీవుడ్ హారర్ కామెడీ బ్లాక్ బస్టరేనా? మూవీ ఎలా ఉందంటే?






గుజరాత్ నుంచి కొచ్చికి తిరిగి వచ్చిన మోహన్ లాల్!
ప్రస్తుతం మోహన్ లాల్ చేతిలో పలు చిత్రాలు ఉన్నాయి. ఆయన కథానాయకుడిగా మలయాళ యంగ్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించిన సూపర్ డూపర్ హిట్ సినిమా 'లూసిఫర్' సీక్వెల్ 'ఎల్ 2: ఎంపురన్' ఒకటి. ఆ సినిమా చిత్రీకరణ పూర్తి అయింది. ఇప్పుడు మోహన్ లాల్ తన దృష్టి అంతా దర్శకుడిగా తీయబోయే సినిమా మీద పెట్టారు. వందల చిత్రాలలో నటించిన అనుభవంతో ఓ చిత్రానికి దర్శకత్వం వహించడానికి ఆయన రెడీ అయ్యారు.


Also Readకుర్చీ మడత పెట్టిన ప్రభాస్ హీరోయిన్ - తెలుగు పాటలకు ఇమాన్వీ సూపర్ స్టెప్స్



మోహన్ లాల్ దర్శకుడిగా పరిచయం అవుతున్న సినిమా పేరు 'బరోజ్'. గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తర్వాత ఈ చిత్రాన్ని మార్చి 28న విడుదల చేయాలని అనుకున్నారు. అయితే... పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో ఈ ఏడాది మార్చి నుంచి అక్టోబర్ 2కి వాయిదా వేశారు. ఈ పనుల నిమిత్తం గుజరాత్ వెళ్లారు మోహన్ లాల్. అక్కడి నుంచి తిరిగి వచ్చాక ఆరోగ్య పరిస్థితి కాస్త ఇబ్బందికరంగా మారిందని సమాచారం అందుతుంది. తెలుగులో 'జనతా గ్యారేజ్' సినిమాలో మోహన్ లాల్ నటించారు. ఇప్పుడు విష్ణు మంచు కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'కన్నప్ప' సినిమాలో ఓ కీలక పాత్రలో అతిథిలా సందడి చేయనున్నారు.


Also Read: గుప్పెడంత మనసు రిషి హీరోగా తెలుగు - కన్నడ సినిమా... టైటిల్ ఏంటో తెలుసా? ఆ కాన్సెప్ట్ పోస్టర్ చూశారా?