MM Keeravani: సీనియర్ హీరో నాగార్జున కూడా ఈసారి ‘నా సామిరంగ’తో సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇదొక పర్ఫెక్ట్ ఫ్యామిలీ మూవీ అని ప్రేక్షకుల దగ్గర నుంచి పాజిటివ్ రివ్యూలను సంపాదించుకుంటున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతాన్ని అందించగా.. చంద్రబోస్ పాటలు రాశారు. ‘నా సామిరంగ’ సినిమా త్వరగా అయిపోవడానికి కీరవాణి కూడా ఒక కారణమని, తనే సినిమాకు స్టార్ అని నాగార్జున ఇప్పటికే ప్రశంసించారు. ఇక మూవీ రిలీజ్‌కు ముందు నాగార్జున, కీరవాణి, చంద్రబోస్ కలిసి ఒక స్పెషల్ ఇంటర్వ్యూ చేశారు. అందులో తన మందు కహానీల గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు షేర్ చేసుకున్నారు కీరవాణి.
బ్రాందీ టేస్ట్ ఎలా ఉందంటే..
‘‘నేను చక్రవర్తిగారి దగ్గర జాయిన్ అయినప్పుడు నాకంటే మనో, ప్రసన్న కుమార్ సీనియర్లు. నన్ను ర్యాగింగ్ చేయడం మొదలుపెట్టారు. నువ్వు ఇప్పుడే వచ్చావు కాబట్టి పార్టీ ఇవ్వాలని అన్నారు. నేను అప్పటికీ మందు తాగలేదు. మందు పార్టీ కావాలంటే నా పేమెంట్‌తో పార్కింగ్‌లో, చీకటిలో వారికి పార్టీ ఏర్పాటు చేశాను. బ్రాందీ తెప్పించాను. నువ్వు కూడా తాగాలి అప్పుడే పార్టీ అన్నారు. నేను స్పాన్సర్‌ను కదా అంటే లేదు తాగాలి అని బెదిరించారు. ఫస్ట్ సిప్ టేస్ట్ ఎలా ఉందంటే.. చనిపోయిన ఎలుకను గ్లాస్ నీళ్లలో వేసి ఒకరోజంతా నానబెడితే ఎలా ఉంటుందో.. అది బ్రాందీ టేస్ట్. ఎందుకు తాగుతున్నారు ఇది టేస్ట్ బాలేదు అన్నాను’’ అంటూ బ్రాందీ టేస్ట్ గురించి కీరవాణి వివరించగానే నాగార్జున, చంద్రబోస్ పడిపడి నవ్వుకున్నారు.
గుడికి వెళ్లి ఆ నిర్ణయం తీసుకున్నాను..
‘‘అక్కడ కారంపూస పెట్టారు. మందు తాగేవాళ్లు రెండు సిప్స్‌కు కొంచెం వేసుకుంటారు. నేను ఒక సిప్ తాగి ప్లేట్ అంతా ఖాళీ చేశాను. మందు తాగిందేమీ లేదు కానీ ప్లేట్ ఖాళీ అయిపోయింది. ఆ తర్వాత జగదీష్ ప్రసాద్, నేను, వేటూరి గారు ఒక బ్యాచ్. అప్పుడు రమ్ ఎక్కువగా అలవాటు అయ్యింది. 10, 15 సార్లు తాగాను. తర్వాత ఒక గుడికి వెళ్లి మానేశాను. ఎందుకో నాకు మానేయాలి అనిపించింది. నేను మానేసిన తర్వాత రోజు నాకు మ్యూజిక్ డైరెక్టర్‌గా ఫస్ట్ బ్రేక్ వచ్చింది. అది నేను ఆశీర్వాదంలాగా ఫీల్ అయ్యాను. ఆ తర్వాత ఏడాదికి నాకు పెళ్లయ్యింది. నా భార్యకు మందు తాగేవాళ్లంటే అస్సలు ఇష్టం ఉండదు. అప్పటికే నేను మందు మానేశాను. కాబట్టి అలా కలిసింది. అప్పటినుంచి ఇప్పటివరకు లేదు’’ అంటూ మందు మానేయడం వల్ల తనకు కలిగిన లాభాల గురించి చెప్పారు కీరవాణి.
1990 నుంచి దూరం..
చివరిసారిగా తన స్నేహితుడి పెళ్లిలో తాగానని, 1990 నుంచి మందుకు దూరంగా ఉంటున్నానని తెలిపారు కీరవాణి. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ‘బాహుబలి’ తర్వాత మ్యూజిక్ డైరెక్షన్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకోవాలని అనుకున్నారు ఈ సీనియర్ మ్యూజిషియన్. కానీ ‘ఆర్ఆర్ఆర్’ వరకు వెయిట్ చేశారు. చివరికి ఆ ‘ఆర్ఆర్ఆర్’ వల్లే తెలుగు సినిమాకు ఆస్కార్‌ను తీసుకురాగలిగారు. అంతే కాకుండా రిటైర్‌మెంట్ ఆలోచనను కూడా పక్కన పెట్టారు. నాగార్జున, కీరవాణి కాంబినేషన్‌లో పలు మ్యూజికల్ హిట్స్ వచ్చాయి. తాజాగా విడుదలయిన ‘నా సామిరంగ’కు కూడా కీరవాణి బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్లస్ అయ్యిందని ప్రేక్షకులు ప్రశంసిస్తున్నారు.
Also Read: రాజేంద్ర ప్రసాద్ వల్ల ఈవీవీతో తిట్లు తిన్నా- వాళ్లు ఏది చెప్పినా చెయ్యాలి: సీనియర్ నటి లతశ్రీ