Mirai Movie Glimpse Out: ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ‘హనుమాన్‘ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు యువ హీరో తేజ సజ్జ. సంక్రాంతి బరిలో నిలిచిన ఈ సినిమా పెద్ద సినిమాలను సైతం వెనక్కి నెట్టి అద్భుత విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమాతో దేశ వ్యాప్తంగా ఓ రేంజిలో క్రేజ్ సంపాదించుకున్నారు. ఈ నేపథ్యంలోనే అతడి నెక్ట్ట్స్ మూవీ ఏంటి? అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూశారు. వారికి తేజ సజ్జ అదిరిపోయే న్యూస్ చెప్పారు. తన లేటెస్ట్ మూవీకి సంబంధించి మేకర్స్ టైటిల్ గ్లింప్స్ విడుదల చేశారు. ఈ గ్లింప్స్ సినీ అభిమానులను మెస్మరైజ్ చేస్తోంది.


మెస్మరైజ్ చేస్తున్న ‘మిరాయ్’ గ్లింప్స్


‘హనుమాన్‘ తర్వాత తేజ సజ్జ ‘మిరాయ్‘ అనే పాన్ ఇండియన్ మూవీ చేస్తున్నారు. రవితేజతో కలిసి ‘ఈగల్‘ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు కార్తీక్ ఘట్టమనేని ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రంలో తేజ సజ్జ సూపర్ యోధుడిగా కనిపించనున్నాడు. ఇప్పటికే ప్రీ లుక్ పోస్టర్స్ తో సినీ అభిమానులలో ఇంట్రెస్టింగ్ కలిగించిన మేకర్స్.. తాజాగా టైటిల్ రివీల్ చేస్తూ ఇంట్రెస్టింగ్ గ్లింప్స్ ను వదిలారు. ఈ సినిమాకు ‘మిరాయ్‘ అనే పేరు పెట్టారు. సామ్రాట్ అశోక కళింగ యుద్ధ పరిణామాల అనంతరం వచ్చిన 9 గ్రంథాలు, వాటిని తరాలుగా కాపాడుతూ వస్తున్న 9 మంది యోధుల గురించి పరిచయం చేస్తూ విడుదలైన ఈ టైటిల్ గ్లింప్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ గ్లింప్స్ లో యాక్షన్ విజువల్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. కళ్లు చెదిరే విన్యాసాలతో తేజ సజ్జ వారెవ్వా అనిపించారు. సూపర్ యోధుడి పాత్రతో ఒదిగిపోయి కనిపించాడు. ఈ చిత్రంలో యాక్షన్ సన్నివేశాలు, తేజ సజ్జను చూపించిన విధానం మరో లెవల్ లో ఉంది. ఈ సినిమాతో తేజ సజ్జ అద్భుత నటుడిగా గుర్తింపు పొందడం ఖాయం అనే టాక్ వినిపిస్తోంది. ‘హనుమాన్‘ను మించి ఈ సినిమా సక్సెస్ అందుకుంటుంది అంటున్నారు సినీ అభిమానులు.



వచ్చే ఏడాది ఏప్రిల్ 13న ‘మిరాయ్’ విడుదల!


ఇక ‘మిరాయ్‘ సినిమాకు సైతం ‘హనుమాన్‘ చిత్రానికి సంగీతం అందించిన గౌర హరి మ్యూజిక్ ఇస్తున్నారు. టైటిల్ గ్లింప్స్ లో తన మార్క్ మ్యూజిక్ తో అద్భుతం అనిపించారు. తన బ్యాగ్రౌండ్ స్కోర్ తో టీజర్ గ్లింప్స్ లో మరింత అద్భుతంగా ఆకట్టుకుంది. ఇక ఈ సినిమాను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తోంది. టీజీ విశ్వప్రసాద్‌ ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.  తాజాగా గ్లింప్స్ ను చూస్తుంటే నిర్మాణ విలువలు అద్భుతం అనిపిస్తున్నాయి. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 13న ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం కనిపిస్తోంది. త్రీడీలోనూ ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తున్నారు మేకర్స్. ఈ సినిమా ఏకంగా 7 భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.  


Read Also : సల్మాన్‌ పై కాల్పులు జరిపేందుకు అంత చెల్లించారట - ఫుల్ అమౌంట్ తీసుకోకుండానే దొరికిపోయారు !