Mehreen Pirzadaa Egg Freezing Journey: ఈ రోజుల్లో చాలా మంది సినీ సెలబ్రిటీలు పిల్లలు కనే విషయంలో కొత్త కొత్త ప్రక్రియలను ఎంచుకోవడానికి ముందుకొస్తున్నారు. కొందరు సరోగసీని సెలక్ట్ చేసుకుంటే... కొందరు మాత్రం పెళ్లయిన వెంటనే పిల్లల్ని కనడం ఇష్టం ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్‌ను ఎంచుకుంటున్నారు. ఇప్పటికే పలు సినీ సెలబ్రిటీలు తాము ఎగ్ ఫ్రీజింగ్ ఆప్షన్‌ను ఎంచుకున్నామని ఓపెన్‌గానే స్టేట్‌మెంట్స్ ఇచ్చారు. ఇటీవల మృణాల్ ఠాకూర్ తన ఎగ్స్ ఫ్రీజ్ చేసుకుంటున్నట్టు చెప్పారు. తాజాగా ఆ లిస్ట్‌లోకి యంగ్ బ్యూటీ మెహ్రీన్ యాడ్ అయ్యింది. తాజాగా తన ఎగ్ ఫ్రీజింగ్‌కు సంబంధించిన జర్నీ మొత్తాన్ని సోషల్ మీడియాలో వివరించింది ఈ భామ.


అందరికీ సలహా..


‘నా ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ’ అంటూ అసలు తన ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ ఎలా గడిచిందో ఒక వీడియో ద్వారా బయట పెట్టి... దాని గురించి సుదీర్ఘంగా రాసుకొచ్చింది. ‘రెండేళ్లు దీని గురించి బాగా ఆలోచించి నిర్ణయించుకున్న తర్వాత ఫైనల్‌గా ఎగ్ ఫ్రీజింగ్ చేసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకోవాలా వద్దా అని ఆలోచిస్తూ ఉన్నాను. కానీ నాలాగే చాలామంది మహిళలు పెళ్లి ఎప్పుడు చేసుకోవాలి, పిల్లల్ని ఎప్పుడు కనాలి లాంటి విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. అందుకే భవిష్యత్తు కోసం ఇలాంటి ప్రక్రియ చేయడం మంచిదని, ఇది అందరితో షేర్ చేసుకోవాలని నిర్ణయించుకున్నాను. భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మహిళలంతా ఈ ప్రక్రియను పాటించాలని నేను అనుకుంటున్నాను’ అని చెప్పుకొచ్చింది మెహ్రీన్.


నాకు ఫోబియా ఉంది..


‘ఇది ఓపెన్‌గా మాట్లాడే టాపిక్ కాదని అందరూ అంటుంటారు. టెక్నాలజీ సాయంతో మన కోసం మనం మంచి నిర్ణయాలు తీసుకుంటున్నాం కాబట్టి దీని గురించి ఎందుకు మాట్లాడకుండా ఉండాలి? తల్లి అవ్వడం నా కల. కొన్నేళ్లు ఆలస్యమయిన కారణంగా నా కలను పక్కన పెట్టాలని అనుకోవడం లేదు. దీని వల్ల బాధ కలిగిందా అంటే.. కొన్నిసార్లు కలిగింది అనే చెప్పాలి. ఛాలెంజింగ్‌గా ఉందా? చాలా ఛాలెంజింగ్‌గా ఉంది. నాలాగా హాస్పిటల్, ఇంజెక్షన్, రక్తం అంటే ఫోబియా ఉన్నవారికి ఇది మరింత ఎక్కువ ఛాలెంజింగ్‌గా అనిపిస్తుంది. నేను హాస్పిటల్‌కు వెళ్లిన ప్రతీసారి కళ్లు తిరిగి పడిపోతుంటాను. హార్మోన్స్‌కు ఇచ్చే ఇంజెక్షన్స్ వల్ల మనకు కలిగే మానసిక సంఘర్షణ అంతా ఇంతా కాదు. నువ్వేం చేయాలని నిర్ణయించుకున్న నీకోసం చెయ్యి’ అని ఈ జర్నీలో తన కష్టాన్ని వివరించింది మెహ్రీన్.






వీడియోలో స్పష్టంగా..


మెహ్రీన్ పోస్ట్ చేసిన ఎగ్ ఫ్రీజింగ్ జర్నీ వీడియోలో అసలు ఎగ్ ఫ్రీజింగ్ అనేది ఎలా జరుగుతుంది అని కూడా స్పష్టంగా వివరించింది. ముందుగా తనకు డాక్టర్.. ప్రక్రియను అంతా వివరించి.. ఒక ఇంజెక్షన్ చేశారని, ఆ తర్వాత నుండే తానే వరుసగా ఇంజెక్షన్స్ చేసుకున్నానని చెప్పింది. ఇదంతా తనకు నొప్పి కలిగించిందని, ఛాలెంజింగ్‌గా అనిపించిందని తెలిపింది. కొన్నిరోజులకే ఎగ్ ఫ్రీజింగ్ వల్ల తనకు రిజల్ట్స్ కనిపించాయని సంతోషం వ్యక్తం చేసింది మెహ్రీన్.



Also Read: నందితా శ్వేతా సైడ్ క్యారెక్టర్లకు షిఫ్ట్ అయినట్టేనా? స్టార్ అవ్వాల్సిన హీరోయిన్‌కు ఎందుకీ దుస్థితి?