Chiranjeevi Grand Welcome To Victory Venkatesh For Mana Shankaravaraprasad Garu Movie Set: మెగాస్టార్ చిరంజీవి, స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి కాంబోలో రాబోతోన్న ఫుల్ లెంగ్త్ మాస్ కామెడీ ఎంటర్టైనర్ 'మన శంకరవరప్రసాద్ గారు'. ఇప్పటికే మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతుండగా... విక్టరీ వెంకటేష్ క్యామియో రోల్ చేయనున్న సంగతి తెలిసిందే. తాజాగా ఆయన షూటింగ్‌లో పాల్గొన్నారు. మూవీ టీం ఆయనకు గ్రాండ్ వెల్ కం చెబుతూ ఓ వీడియో షేర్ చేసింది.
గెస్ట్ రోల్ కాదు
ఈ మూవీలో వెంకటేష్‌ది కీ రోల్ అని... అతిథి పాత్ర కాదని ఇప్పటికే మూవీ టీం వెల్లడించింది. 'వెల్ కం బ్రదర్' అంటూ మెగాస్టార్ గ్రాండ్ వెల్ కం చెప్పగా... 'మై బాస్' అంటూ వెంకీ ఫుల్ ఎనర్జీతో కనిపించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్ జరుగుతుండగా... సెట్స్‌లో వెంకీ జాయిన్ అయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతోంది. అనిల్, వెంకీ కాంబోలో F2, F3తో పాటు 'సంక్రాంతికి వస్తున్నాం' బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్నాయి. ఈ మూవీ కూడా బిగ్గెస్ట్ సక్సెస్ అందుకుంటుందని ఫ్యాన్స్ భావిస్తున్నారు. టాలీవుడ్ ఇండస్ట్రీలో అతి పెద్ద ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని మేకర్స్ అంటున్నారు.
ఇద్దరు బిగ్ స్టార్స్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించనుండడంతో అంచనాలు పదింతలయ్యాయి. వెంకీ రోల్ ఏమై ఉంటుందా? అంటూ అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ చేసిన చిరు వింటేజ్ లుక్. 'మీసాల పిల్ల' సాంగ్స్ ట్రెండ్ అవుతున్నాయి.
Also Read: రామ్ చరణ్ ఉపాసన దంపతుల గుడ్ న్యూస్ - మెగా ఫ్యామిలీ ఇంట మరోసారి సంబరాలు
ఈ మూవీలో చిరు రోల్ ఏంటి? అనే దానిపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే రిలీజ్ చేసిన గ్లింప్స్‌లో వింటేజ్ చిరును గుర్తు చేశారు. ఫుల్ సెక్యూరిటీ మధ్య బాస్ ఎంట్రీ గూస్ బంప్స్ తెప్పించింది. 'మీసాల పిల్ల' పాటలోనూ ఆయన వెనుక సెక్యూరిటీ ఉండడం... ఆయన 'RAW' ఆఫీసర్‌గా కనిపించబోతున్నారన్న వార్తలకు బలం చేకూరుస్తోంది. ఇక వెంకీ ఎలాంటి రోల్ చేయబోతున్నారు? అనేది కూడా సస్పెన్స్.
మూవీలో లేడీ సూపర్ స్టార్ నయనతార హీరోయిన్‌గా శశిరేఖ పాత్రలో నటిస్తున్నారు. ఇప్పటికే ఆమె లుక్ ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తోంది. ముఖ్యంగా 'మీసాల పిల్ల' పాటలో చిరు, నయన్ స్టెప్పులు ట్రెండ్ అవుతున్నాయి. వీరితో పాటే కేథరిన్, మురళీధర్ గౌడ్, వీటీవీ గణేష్ కీలక పాత్రలు పోషిస్తు్న్నారు. షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్‌పై సాహు గారపాటి, సుష్మిక కొణిదెల నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి మూవీ రిలీజ్ కానుంది.