Chiranjeevi Clarified About Rumors On His Mother Health: మెగాస్టార్ చిరంజీవి (Megastar Chiranjeevi) తల్లి అంజనమ్మ ఆరోగ్య పరిస్థితి బాగాలేదని ఆమె అస్వస్థతకు గురయ్యారంటూ ఉదయం నుంచి సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. అయితే, సాధారణ ఆరోగ్య పరీక్షల్లో భాగంగా మాత్రమే ఆమెను గత వారం ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు చిరంజీవి టీమ్ ఇప్పటికే స్పష్టత ఇచ్చింది. తాజాగా, దీనిపై మెగాస్టార్ చిరంజీవి సైతం స్పందించారు. తన మాతృమూర్తి అంజనమ్మ (Anjanamma) సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నారని స్పష్టం చేశారు. ఆమె అస్వస్థతకు గురయ్యారంటూ వస్తోన్న వార్తల్లో నిజం లేదని ట్విట్టర్ 'X' వేదికగా తెలిపారు. 'మా అమ్మ ఆరోగ్యం సరిగా లేదని, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోన్న కొన్ని వార్తలు నా దృష్టికి వచ్చాయి ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలనుకుంటున్నా. ఆమెకు 2 రోజులుగా ఒంట్లో కాస్త నలతగా మాత్రమే ఉంది. ప్రస్తుతం ఆమె బాగానే ఉన్నారు. ఆమె ఆరోగ్యానికి సంబంధించి, దయచేసి ఊహాజనిత వార్తలను ప్రచురించవద్దని మీడియాకు విజ్ఞప్తి చేస్తున్నాను. మీరంతా అర్థం చేసుకుంటారని భావిస్తున్నా.' అంటూ ట్విట్టర్‌లో పేర్కొన్నారు.

Also Read: ఆ ఊరిలో మర్డర్ కేసుల మిస్టరీ వీడుతుందా? - లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసే ఐదుగురు గృహిణుల స్టోరీ, ఆ 2 ఓటీటీల్లో క్రైమ్ థ్రిల్లర్ సిరీస్‌లు