Aishwarya Rajesh's Suzhal 2 Season 2 OTT Release Date On Amazon Prime Video: క్రైమ్ థ్రిల్లర్ మూవీస్, సిరీస్ ఏవైనా ప్రేక్షకులు అమితంగా ఇంట్రెస్ట్ చూపుతారు. ఈ క్రమంలో ఇటీవల ఓటీటీలు సైతం అలాంటి కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేస్తూ ఎంటర్‌టైన్ చేస్తున్నాయి. మూడేళ్ల క్రితం వచ్చిన 'సుళుల్: ది వర్టెక్స్' (Suzhal: The Vertex) వెబ్ సిరీస్ ప్రేక్షకులకు మంచి థ్రిల్లర్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించింది. ఈ సిరీస్‌లో ఆర్.పార్తీబన్ (R.Parthiban), ఐశ్వర్య రాజేష్ (Aishwarya Rajesh), శ్రియా రెడ్డి, కథిర్, హరీష్ ఉత్తమన్, నివేదితా సతీష్, ప్రేమ్ కుమార్ తదితరులు నటించారు. ఈ సిరీస్ 2022, జూన్ 17న 'అమెజాన్ ప్రైమ్ వీడియో' ఓటీటీ వేదికగా రిలీజై మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలో సీక్వెల్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తుండగా.. ఈ నెల 28 నుంచి స్ట్రీమింగ్ కానుంది. ఈ సిరీస్ తెలుగు, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని 'అమెజాన్ ప్రైమ్' ఓటీటీ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది.







అసలు కథేంటంటే..?


సాంబలూరు అనే ఊరిలోని సిమెంట్ ఫ్యాక్టరీలో ఓ రోజు కార్మికులకు, యాజమాన్యానికి గొడవ జరుగుతుంది. ఆ కార్మికులకు నాయకుడు షణ్ముగం (ఆర్.పార్తీబన్) లీడర్‌గా ఉంటారు. ఫ్యాక్టరీ ఎండీ త్రిలోక్ (హరీష్ ఉత్తమన్) దగ్గర డబ్బులు తీసుకుని కార్మికులను అణచివేయాలని సీఐ రెజీనా (శ్రియా రెడ్డి) ప్రయత్నిస్తుంది. దీంతో కార్మికులు సమ్మె చేస్తారు. అదే రోజు రాత్రి ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం జరగ్గా.. త్రిలోక్, సీఐ రెజీనా షణ్ముగం మీదే అనుమానం వ్యక్తం చేస్తారు. షణ్ముగాన్ని అరెస్టు చేసేందుకు వెళ్లిన రెజీనాకు అతని చిన్న కుమార్తె నీలా (గోపికా రమేష్) కనిపించడం లేదని తెలిసి వెనక్కి వస్తుంది. ఈ క్రమంలో ఊరి చెరువులో నీలాతో పాటు రెజీనా కుమారుడు అతిశయం (ఫెడ్రిక్ జాన్) మృతదేహాలు లభ్యమవుతాయి. ఆంకాళమ్మ జాతర మయాన్ కొళ్ళాయ్ జరుగుతున్న టైంలో ప్రేమికుల హత్య, ఫ్యాక్టరీలో ఫైర్ యాక్సిడెంట్, 15 ఏళ్ల క్రితం జాతరలో మరో అమ్మాయి కూడా మిస్ కావడం... వీటన్నింటికీ ఏదైనా సంబంధం ఉందా? లేదా? చక్రి అలియాస్ చక్రవర్తి (కథిర్), నీలా అక్క నందిని (ఐశ్వర్యా రాజేష్)కి తెలిసిన నిజం ఏమిటి? అనేది 'సుళుల్' వెబ్ సిరీస్ మెయిన్ కాన్సెప్ట్. ఇప్పుడు సీజన్ 2లో ఏం చూపిస్తారో చూడాలి.


Also Read: సౌరవ్ గంగూలీ బయోపిక్‌లో ఆ స్టార్ హీరో - స్వయంగా రివీల్ చేసిన 'దాదా'.. ఫ్యాన్స్‌లో హైప్ పెరిగిందిగా..


లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా


మరోవైపు, లంచ్ బాక్సుల్లో డ్రగ్స్ సరఫరా చేసే ఐదుగురు గృహిణుల చుట్టూ తిరిగే స్టోరీగా 'డబ్బా కార్టెల్' (Dabba Cartel) క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రూపొందింది. ఈ సిరీస్ కూడా ఈ నెల 28 నుంచి ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. హితేశ్ భాటియా దర్శకత్వం వహించిన ఈ సిరీస్ ట్రైలర్‌ను తాజాగా విడుదల చేశారు. షబానా అజ్మీ, గజరాజ్, జ్యోతిక, నిమేషా సజయన్, షాలినీ పాండే, అంజలి ప్రసాద్, సాయి తమంకర్ కీలక పాత్రలు పోషించారు. మొత్తానికి ఒకే రోజు 2 క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్‌లు ఓటీటీ లవర్స్‌కు వినోదాన్ని అందించనున్నాయి.


Also Read: మరో ఓటీటీలోకి ఇన్వెస్టిగేటివ్ క్రైమ్ థ్రిల్లర్ - మహిళల తలలు నరికేసే సైకో వాటితో ఏం చేస్తాడంటే..?