Meenakshi Seshadri About Vinod Khanna: ఒకే సినిమాలో కలిసి నటించిన తర్వాత ఆ హీరో, హీరోయిన్ మధ్య మంచి ఫ్రెండ్‌షిప్ ఏర్పడుతుంది. వారి గురించి ప్రేక్షకులు ఏమనుకున్నా కూడా వారు మాత్రం మంచి ఫ్రెండ్స్‌లాగానే ఉంటారు. అలా ఒక స్టార్ హీరోతో తనకు మంచి సాన్నిహిత్యం ఉండేదని తాజాగా బయటపెట్టారు బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ మీనాక్షి శేషాద్రి. అలనాటి స్టార్ హీరో వినోద్ ఖన్నాతో పలు సినిమాల్లో కలిసి నటించారు మీనాక్షి. వీరిద్దరూ కలిసి నటించిన సినిమాల్లో హీరోహీరోయిన్ల కెమిస్ట్రీకి ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఆన్ స్క్రీన్ మాత్రమే కాదు.. ఆఫ్ స్క్రీన్ కూడా వారు చాలా క్లోజ్‌గా ఉండేవారని మీనాక్షి శేషాద్రి బయటపెట్టారు.
మంచి బాండింగ్..
వినోద్ ఖాన్నా, మీనాక్షి శేషాద్రి కలిసి ‘సత్యమేవ్ జయతే’, ‘జుర్మ్’ వంటి చిత్రాల్లో నటించారు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న మీనాక్షి.. వినోద్ ఖాన్నాతో ఉన్న అనుబంధాన్ని గుర్తుచేసుకున్నారు. ‘‘వినోద్ ఖన్నాకు, నాకు మంచి సాన్నిహిత్యం ఉంది. వినోద్‌తో నేను షూటింగ్ చేస్తున్నప్పుడు సెట్స్‌కు వచ్చి చూడడం మా నాన్నకు చాలా నచ్చేది. లంచ్ సమయంలో నేను, వినోద్ కలిసి డర్టీ జోక్స్ వేసుకునేవాళ్లం’’ అని గుర్తుచేసుకున్నారు మీనాక్షి శేషాద్రి. వీరిద్దరూ కలిసి నటించిన దాదాపు ప్రతీ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. దాని వల్ల ఆన్ స్క్రీన్ వారికి మంచి మార్కులు పడడంతో ఆఫ్ స్క్రీన్ కూడా వీరి బాండింగ్ పెరిగింది.
ఆశ్రమంలో జీవితం..
మీనాక్షి శేషాద్రి, వినోద్ ఖన్నా కలిసి ‘సత్యమేవ్ జయతే’, ‘జుర్మ్’తో పాటు ‘పోలీస్’, ‘ముజ్రిమ్’, ‘క్షత్రియ’, ‘హమ్షకల్’ వంటి హిట్లను అందించారు. వినోద్ గురించి మరిన్ని విషయాలను పంచుకున్న మీనాక్షి.. ‘‘వినోద్ ఖన్నా చాలా చిల్‌గా ఉండేవారు. అప్పుడు తన కెరీర్‌లో టాప్ స్థానంలో ఉన్నారు. ఆయన ముందుగా ఆశ్రమానికి వెళ్లి వచ్చాక షూటింగ్ చేసేవారు’’ అని తెలిపారు. 1970ల్లో ఓషో అనే ఇండియన్ ఫిలాసఫీ గురువును ఆదర్శంగా తీసుకున్నారు వినోద్ ఖన్నా. ఆయనకు సేవ చేయడం కోసం తన భార్యను, ఇద్దరు పిల్లలను వదిలేసి, దాంపత్య జీవితానికి దూరంగా ఉంటూ ఎక్కువగా ఆశ్రమాల్లోనే గడిపేవారు.
నాన్నతో క్లోజ్..
‘జుర్మ్’ సినిమాలో ‘జబ్ కోయి బాత్ బిగడ్ జాయే’ అనే పాటకు వినోద్ ఖన్నాతో కలిసి స్టెప్పులేశారు మీనాక్షి శేషాద్రి. ఆ పాట అప్పట్లో సెన్సేషనల్ హిట్‌గా నిలిచింది. ‘‘నేను వినోద్ గొప్ప ఫ్రెండ్స్ అని చెప్పలేను. కానీ ఆయన చాలా మంచివారు. నిజం చెప్పాలంటే ఆయన నాలోని టాలెంట్‌ను బయటికి తీశారు. నేను, నాన్న, వినోద్ కలిసి డర్టీ జోక్స్ చెప్పుకునేవాళ్లం. చూసినవాళ్లంతా అసలు మేము ఎందుకు నవ్వుకుంటున్నామని ఆశ్చర్యపోయేవాళ్లు. నేను మా నాన్నతో చాలా క్లోజ్‌గా ఉండేదాన్ని. మేము జోక్స్ వేసుకునేవాళ్లం, నవ్వుకునేవాళ్లం’’ అని ఒక పాత ఇంటర్వ్యూలో కూడా చెప్పుకొచ్చారు మీనాక్షి శేషాద్రి. బాలీవుడ్‌లో స్టార్‌గా వెలిగిన వినోద్ ఖన్నా.. 2017లో క్యాన్సర్‌తో మరణించారు.
Also Read: విడాకుల వార్తలపై స్పందించిన అభిషేక్ బచ్చన్.. చివరికి అలా చెప్పుకోవల్సి వస్తోంది