హీరోయిన్ మీనా (Actress Meena) గొప్ప నిర్ణయం తీసుకున్నారు. అవయవాల (ఆర్గాన్స్) ను దానం చేయాలనే నిర్ణయం తీసుకున్నారు. ఇతరులకు ఆదర్శంగా నిలిచేలా... మరణించిన తర్వాత మరి కొంత మందికి ప్రాణం పోసేలా... ఈ రోజు వరల్డ్ ఆర్గాన్ డొనేషన్ డే (World Organ Donation Day) సందర్భంగా తన నిర్ణయాన్ని ఆమె వెల్లడించారు.


మీనా నిర్ణయం వెనుక ఆమె భర్త విద్యాసాగర్ (Meena Husband Vidyasagar) ఆకస్మిక మరణం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్ 28న ఆయన అనంత లోకాలకు వెళ్లిపోయిన విషయం తెలిసిందే. 


ఆర్గాన్స్ డొనేట్ చేస్తున్నట్లు ప్రకటించిన మీనా ''ప్రాణాలను కాపాడటం కంటే గొప్ప పని ఏదీ లేదు. ప్రాణాలు కాపాడటానికి అవయవ దానం మంచి మార్గం. దీర్ఘకాలిక అనారోగ్యాలతో పోరాటం చేస్తున్న అనేక మంది జీవితానికి రెండో అవకాశం ఇస్తుందీ అవయవ దానం. నా సాగర్ (మీనా భర్త విద్యాసాగర్) ఎక్కువ మంది డోనర్స్ ఉండుంటే నా జీవితం మరోలా ఉండేది'' అని పేర్కొన్నారు.


Also Read : 'బింబిసార' చూసిన నందమూరి బాలకృష్ణ - బాబాయ్ అండ్ ఫ్యామిలీ కోసం అబ్బాయ్ స్పెషల్ షో
 
ప్రతి ఒక్కరూ ఆర్గాన్ డొనేషన్ ఇంపార్టెన్స్ అర్థం చేసుకుంటారని ఆశిస్తున్నానని మీనా తెలిపారు. అవయవ దాత, గ్రహీత, వైద్యుల మధ్య మాత్రమే కాదు... ఆ ప్రభావం కుటుంబ సభ్యులు, స్నేహితులపై కూడా ఉంటుంది. ఇవాళ ఆర్గాన్స్ డొనేట్ చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నానని మీనా తెలిపారు.


భర్త మరణం తర్వాత కొన్నాళ్ళు ఇంటికి పరిమితమైన మీనా... మళ్ళీ ఇప్పుడు యాక్టివ్ అవుతున్నారు. ఇటీవల రంభ, సంఘవి, సంగీత తమ తమ కుటుంబ సభ్యులతో మీనా ఇంటికి వెళ్లారు. ఆ ఫోటోలను ఆవిడ షేర్ చేశారు. అలాగే, సినిమా షూటింగ్స్ కూడా స్టార్ట్ చేశారు. రాజేంద్ర ప్రసాద్ తో కలిసి ఉన్న ఒక ఫోటోను ఆ మధ్య పోస్ట్ చేశారు. ''సుమారు 32 ఏళ్ళ తర్వాత నా మొదటి హీరోతో కలిసి నటిస్తున్నా'' అని ఆమె పేర్కొన్నారు. 'బిగ్ బాస్' ఫేమ్ సొహైల్ హీరోగా నటిస్తున్న సినిమా 'ఆర్గానిక్ మామ - హైబ్రిడ్ అల్లుడు'. అందులో రాజేంద్రప్రసాద్, మీనా కీలక పాత్రలు పోషింస్తున్నారు. 



Also Read : కార్తికేయ 2 రివ్యూ : ద్వారకా నగరం - శ్రీకృష్ణుడు దాచిన రహస్యం - నిఖిల్ సినిమా ఎలా ఉందంటే?