Sundeep Kishan's Mazaka Movie Twitter Review In Telugu: టాలీవుడ్ యంగ్ హీరో సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ కామెడీ ఎంటర్‌టైనర్ మూవీ 'మజాకా'. 'థమాకా' ఫేం నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహించిన ఈ మూవీలో అన్షు, రీతూవర్మ హీరోయిన్లుగా నటించారు. ఈ చిత్రాన్ని ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్, హాస్య మూవీస్ బ్యానర్లపై రాజేష్ దండా నిర్మించారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్‌లో సినిమాలో ఫుల్ లెంగ్త్ కామెడీగా ఉంటుందని ఆడియన్స్ ఓ అంచనాకు వచ్చేశారు. ఈ మూవీ శివరాత్రి సందర్భంగా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుండగా.. ఇప్పటికే పలు చోట్ల ప్రీమియర్ షోలు చూసిన నెటిజన్లు సినిమాలో కామెడీ సూపర్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. తండ్రీ కొడుకులుగా సందీప్ కిషన్, రావురమేష్ అద్భుతంగా నటించారని.. వారి మధ్య కామెడీ పంచులు, టైమింగ్ అదిరిపోయాయని చెబుతున్నారు.
సందీప్ కిషన్ రీతూవర్మ వెంటపడగా.. అతన్ని ఫాలో అవుతూ తండ్రి రావు రమేష్ సైతం మరో అమ్మాయి అన్షు వెంటపడడం.. ఈ సందర్భంగా సాగే కామెడీ సీన్స్.. కాలేజీ బ్యాక్ డ్రాప్‌లో వచ్చే డైలాగ్స్ బాగా ఎంటర్‌టైన్ చేస్తాయని పేర్కొంటున్నారు. సందీప్ - రీతూవర్మ, రావు రమేష్ - అన్షుల మధ్య లవ్ ప్రపోజల్స్ హిలేరియస్ అని అంటున్నారు. మురళీశర్మ, కమెడియన్ శ్రీనివాసరెడ్డి మధ్య కామెడీ సీన్స్, హైపర్ ఆది కామెడీ అదిరిపోయిందని కామెంట్ చేస్తున్నారు. తండ్రీ కొడుకుల మధ్య బ్యాచిలర్ యాంథమ్ సాంగ్ అదిరిందని పేర్కొంటున్నారు. ఎమోషన్‌కు కామెడీని మిక్స్ చేసి ఓ మంచి కామెడీ ఎంటర్‌టైనర్‌ను అందించారని చెబుతున్నారు.
సందీప్ హిట్ కొట్టారా..?
స్టాఫ్ చాలా డీసెంట్‌గా ఉందని.. దాన్ని మించి సెకండాఫ్‌లోనూ కామెడీ టైమింగ్ అదిరిందని నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మూవీ బ్లాక్ బస్టర్ అని పేర్కొంటున్నారు. చాలా రోజుల తర్వాత సందీప్ కిషన్ హిట్టు కొట్టారని.. 'మజాకా' మూవీ టీంకు అభినందనలు చెబుతున్నారు.