Maha Shivaratri Special Devotional Movies: మహా శివరాత్రి (Mahashivaratri) అంటేనే శివునికి ప్రీతికరమైన రోజు. ముందు రోజు నుంచే శివాలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తుంటారు. ఇక శివరాత్రి రోజున ఉదయం నుంచే ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతాయి. ఆ రోజున ఎటు చూసినా శివనామస్మరణే. ముఖ్యంగా శివరాత్రి అంటే మనకు గుర్తొచ్చేది జాగరణ, ఉపవాసం. ఉదయాన్నే శివయ్యను దర్శించుకుని అభిషేకించి.. ఉపవాస దీక్ష అనంతరం సాయంత్రం జాగరణతో శివయ్య సేవలో తరించాలని భక్తులు భావిస్తారు. ఆలయాల్లో జాగారం చేసే అవకాశం లేని వాళ్లు శివయ్య నేపథ్యంలో వచ్చిన భక్తి సినిమాలు చూస్తూ జాగరణ పూర్తి చేసెయ్యొచ్చు. అయితే, అప్పటి సీనియర్ ఎన్టీఆర్, ఏఎన్నార్ సహా పలువురు టాప్ హీరోలు శివుడి పాత్రలో నటించి మెప్పించారు. అలా ప్రేక్షకుల మదిలో నిలిచి ఆ పాత భక్తిరస చిత్రాల నుంచి లేటెస్ట్ చిత్రాల వరకూ ఓసారి చూస్తే..


ఆ పాత భక్తి చిత్రాలు


దక్షయజ్ఞం - సీనియర్ ఎన్టీఆర్ శివుడి పాత్రలో నటించి మెప్పించిన సినిమా దక్షయజ్ఞం. 1962లో విడుదలైన ఈ మూవీ ఎన్టీఆర్ కెరీర్‌లో ఎవర్ గ్రీన్‌గా నిలిచింది. ఇప్పటికీ ఈ మూవీ ప్రతీ శివరాత్రికి ఏదో టీవీలో ప్రీమియర్ అవుతూనే ఉంటుంది. కడారు నాగభూషణం దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఎస్వీ రంగారావు, దేవిక తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఎన్టీఆర్ శివుడి పాత్ర పోషించిన ఏకైక మూవీ ఇదే. ఈ సినిమాను ఈ శివరాత్రికి చూసి భక్తి పారవశ్యంలో మునగండి.


భక్త కన్నప్ప - శివుని పాత్రలో నటించి మెప్పించిన అలనాటి అగ్ర హీరోల్లో కృష్ణంరాజు ఒకరు. ఆయన శివుడి పాత్రలో నటించిన మూవీ 'వినాయక విజయం'. అలాగే, ఆయన శివుడి భక్తుడిగా నటించిన శివయ్య చిత్రం భక్త కన్నప్ప. కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం 'బెడార కన్నప్ప'కి తెలుగు రీమేక్‌గా ఈ మూవీ వచ్చింది. ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించగా.. ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమాలతో పాటు భూ కైలాస్, నాగుల చవితి, మా ఊర్లో మహాశివుడు వంటి సినిమాలు శివరాత్రికి తప్పకుండా చూడాల్సిన సినిమాలు.


Also Read: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?


శివరాత్రి స్పెషల్ మూవీస్



  • మెగాస్టార్ చిరంజీవి శివయ్యగా శ్రీ ముంజునాథ - యూట్యూబ్. అలాగే, ఆయన నటించిన 'అంజి' సినిమా సైతం యూట్యూబ్‌లో అందుబాటులో ఉంది.

  • ఎన్టీఆర్ భూకైలాస్ - యూట్యూబ్

  • నాగార్జున ఢమరుకం - అమెజాన్ ప్రైమ్, సన్ నెక్స్ట్

  • బాలకృష్ణ 'అఖండ' - యూట్యూబ్, హాట్ స్టార్

  • భక్త కన్నప్ప - యూట్యూబ్, అమెజాన్ ప్రైమ్ వీడియో

  • శివరాత్రి మహత్య్యం - జియో సినిమా, యూట్యూబ్

  • మహాశివరాత్రి - యూట్యూబ్, జీ5

  • భక్త శంకర, మహాభక్త సిరియాళ - హాట్ స్టార్. వీటితో పాటు భక్త మార్కండేయ, ఉమాచండీ గౌరీ శంకరుల కథ, శ్రీకాళహస్తీ మహత్యం, జగద్గురు ఆదిశంకర, కార్తికేయ సినిమాల్ని కూడా శివరాత్రి జాగరణ చెయ్యొచ్చు.


Also Read: ఫ్యాన్స్‌కు 'సంక్రాంతికి వస్తున్నాం' మూవీ టీం బిగ్ సర్ ప్రైజ్ - జోష్ పెంచేలా మరిన్ని కామెడీ సీన్స్!, ఓటీటీలోకి ఎప్పుడంటే?