Madraskaaran OTT Telugu: తెలుగులో నిహారిక 'మద్రాస్‌కారన్' - డైరెక్ట్‌గా ఆ ఓటీటీలోకి స్ట్రీమింగ్, ఎప్పటి నుంచో తెలుసా?

Madraskaaran OTT Release Date Telugu: మెగా డాటర్ నిహారిక రీసెంట్ తమిళ మూవీ 'మద్రాస్ కారన్'. ఈ సినిమా తెలుగు వెర్షన్ డైరెక్ట్‌గా 'ఆహా' ఓటీటీలో ఫిబ్రవరి 26 నుంచి స్ట్రీమింగ్ కానుంది.

Continues below advertisement

Niharika's Madraskaaran Telugu Version OTT Release On Aha Video: కొంతకాలం విరామం అనంతరం మెగా డాటర్ నిహారిక (Niharika) తమిళ మూవీ 'మద్రాస్‌కారన్'తో (Madraskaaran) రీఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. RDXతో హిట్ కొట్టిన మలయాళ స్టార్ షేన్ నిగమ్ (Shane Nigam) హీరో కాగా.. వాలి మోహన్‌దాస్ ఈ మూవీకి దర్శకత్వం వహించారు. ఈ తమిళ యాక్షన్ మూవీ ఈ ఏడాది జనవరి 10న రిలీజై కొద్ది రోజుల్లోనే ఓటీటీలోకి సైతం వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫాం 'ఆహా'లో (Aha) ప్రస్తుతం తమిళ వెర్షన్ స్ట్రీమింగ్ అవుతుండగా.. ఇప్పుడు తెలుగులోనూ నేరుగా రిలీజ్ అయ్యేందుకు రెడీ అవుతోంది. ఫిబ్రవరి 26 నుంచి తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కానున్నట్లు 'ఆహా' సోషల్ మీడియా వేదికగా ఓ పోస్టర్ రిలీజ్ చేసింది. 'అపరిచితుల మధ్య ఓ చిన్న వాదన జీవితాన్ని మార్చే సంఘర్షణకు దారి తీస్తుంది.' అంటూ పేర్కొంది. ఈ మూవీలో కలైయరసన్, ఐశ్వర్యదత్తా కీలక పాత్రలు పోషించారు.

Continues below advertisement

కథేంటంటే..?

ఇంజినీర్ అయిన సత్య అలియాస్ సత్యమూర్తి (షేన్ నిగమ్) ఓ రైతుగా మారతాడు. తండ్రి, భార్య మీరా (నిహారిక)తో కలిసి గ్రామంలో నివసిస్తుంటాడు. అయితే, ఎవరూ ఊహించని విధంగా అతనిపై దుండగులు దాడి చేస్తారు. తన శత్రువు సింగమ్ ఇదంతా ప్లాన్ చేశాడని సత్య అనుకుంటాడు. అసలు ఎవరు ఈ సింగమ్..? గతంలో వీరిద్దరికీ మధ్య జరిగిన గొడవ ఏంటి.?, శత్రువుల నుంచి తన కుటుంబాన్ని సత్య ఎలా కాపాడుకున్నాడు.? అనేది తెలియాలంటే మూవీ చూడాల్సిందే. మద్రాస్‌లో జరిగిన యదార్థ ఘటనల ఆధారంగా ఈ మూవీని రూపొందించినట్లు తెలుస్తోంది.

Also Read: ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ప్రాజెక్ట్ కథ ఇదేనా? - పీరియాడిక్ యాక్షన్ డ్రామాలో ఎన్టీఆర్ రోల్‌పై ఆ రూమర్స్‌లో నిజమెంత?

Continues below advertisement