'మట్కా' ప్రమోషనల్ మెటీరియల్ ప్రామిసింగ్‌గా అనిపించింది. వరుణ్ తేజ్ పక్కా హిట్ కొట్టేలా ఉన్నాడనే నమ్మకాన్ని కలిగించింది. రిలీజ్ డే వచ్చేసరికి సిట్యువేషన్ వేరేలా ఉంది. థియేటర్ల దగ్గర అసలు సందడి కనిపించడం లేదు. 


అల్లు అర్జున్ మల్టీప్లెక్స్‌లో షోస్ క్యాన్సిల్!
హైదరాబాద్ అమీర్ పేట ఏరియాలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)కు ఎఎఎ మల్టీప్లెక్స్ ఉంది. అందులో 'మట్కా' షోస్ ప్లాన్ చేశారు. డైలీ ఐదు ఆటలు వేసేలా టైమింగ్స్ షెడ్యూల్ చేశారు. కట్ చేస్తే ఉదయానికి పరిస్థితి తార్ మార్ తక్కర్ మార్ అన్నట్టు తయారయ్యింది. షోస్ అన్నీ క్యాన్సిల్ చేశారు. అందుకు రీజన్ అసలు టికెట్లు తెగకపోవడమే అని ట్రేడ్ టాక్.






మిగతా థియేటర్లలో కూడా సేమ్ సిట్యువేషన్!
ఒక్క ఎఎఎ మల్టీప్లెక్స్ (AAA Cinemas)లో మాత్రమే కాదు... మిగతా థియేటర్లలో కూడా 'మట్కా'కు అంత గొప్ప బుకింగ్స్ లేవు. బుక్ మై షో యాప్ ఓపెన్ చేస్తే ప్రతి థియేటర్, ప్రతి స్క్రీన్ గ్రీన్ కలర్ లో కనబడుతోంది. దాని అర్థం ఆయా షోస్ టికెట్లు 50 పర్సెంట్ కూడా సేల్ కాలేదు అని.  






బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప సినిమా గట్టెక్కడం కష్టం
'మట్కా'కు బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప ఆడియన్స్ థియేటర్లకు క్యూ కట్టడం, ఈ సినిమా గట్టెక్కడం చాలా కష్టం అని చెప్పాలి. ప్రజెంట్ ఉన్న సిట్యువేషన్ చూస్తే 'మట్కా' బజ్ అసలు లేదని అనుకోవాలి.


Also Read: 'మట్కా' ట్విట్టర్ రివ్యూ - వరుణ్ తేజ్ సినిమా సంగతేంటి? సోషల్ మీడియాలో టాక్ ఎలా ఉందేంటి?



'మట్కా' మూవీకి ముందు వరుణ్ తేజ్ చేసిన 'గాండీవధారి అర్జున', 'ఆపరేషన్ వేలంటైన్' మూవీస్ బాక్స్ ఆఫీస్ దగ్గర దారుణంగా బోల్తా కొట్టడం కూడా 'మట్కా' మీద ఎఫెక్ట్ చూపించింది. హీరో నుంచి బ్యాక్ టు బ్యాక్ ఫ్లాప్స్ వచ్చినప్పుడు ఈ టైపు సిట్యువేషన్ ఉంటుంది. ఆడియన్స్ థియేటర్లకు రావడానికి ఆలోచిస్తారు.


Also Readవరుణ్ తేజ్ సూపర్ హిట్ సినిమాలు... ఏయే ఓటీటీల్లో ఉన్నాయో తెలుసా?


'మట్కా' కోసం వరుణ్ తేజ్ ఎంతో కష్టపడ్డాడు. లుక్ మీద కేర్ తీసుకున్నాడు. వాసు క్యారెక్టర్ కోసం టీనేజ్ నుంచి ఓల్డ్ ఏజ్ వరకు నాలుగు డిఫరెంట్ లుక్స్ లో మెగా హీరో కనిపించనున్నాడు. అతడి కష్టానికి తగ్గ రిజల్ట్ రావాలని ఆడియన్స్, ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్‌ చేస్తున్నారు. ఈవెనింగ్ అయితే తప్ప మూవీ రిజల్ట్ మీద క్లారిటీ రాదు. ఈ మూవీ హిట్ కావాలని కోరుకోవడం తప్ప ఇప్పుడు ఫ్యాన్స్ చేయగలిగింది ఏమీ లేదు.


Also Readకంగువ ట్విట్టర్ రివ్యూ: సూర్యుడి రుద్ర తాండవం - మరి సినిమా హిట్టా? ఫట్టా? టాక్ ఎలా ఉందంటే?