పాన్ ఇండియా హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది ప్రభాస్ నుంచి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'సలార్'. 'కేజిఎఫ్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేస్తున్న ఈ మూవీ పై ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ సోషల్ మీడియాలో సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. యూట్యూబ్ లో సుమారు 100 మిలియన్లకి పైగా వ్యూస్ ని సొంతం చేసుకున్న ఈ టీజర్ తో సినిమాపై క్యూరియాసిటీ నెక్స్ట్ లెవెల్ కి చేరుకుంది. ఇలాంటి తరుణంలో 'సలార్' ఇప్పుడు మరో సంచలన రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఏ ఇండియన్ సినిమాకు సాధ్యం కానీ రికార్డ్ ప్రభాస్ 'సలార్' సినిమాకి సొంతమైంది.


ఈ సినిమాని నార్త్ అమెరికాలో యూఎస్ఏ కు చెందిన ప్రత్యంగిరా సినిమా డిస్ట్రిబ్యూట్ చేస్తోంది. ఈ మేరకు నార్త్ అమెరికాలో ఈ మూవీ ఏకంగా 1980 లొకేషన్స్ లో రిలీజ్ కాబోతోందట. ఈ విషయాన్ని సదరు డిస్ట్రిబ్యూట్ సంస్థ వెల్లడించినట్లు తెలుస్తోంది. ఓ తెలుగు సినిమా నార్త్ అమెరికాలో అన్ని లొకేషన్స్ లో రిలీజ్ అవ్వడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు మరే ఇండియన్ సినిమా ఇన్ని లొకేషన్స్ లో రిలీజ్ కాలేదు. ఇక సెప్టెంబర్ 27న 'సలార్' ప్రీమియర్ షోలు ఈ లొకేషన్స్ లో ఉంటాయని కూడా సదరు డిస్ట్రిబ్యూషన్ సంస్థ వెల్లడించింది. ఈ న్యూస్ కాస్త బయటికి రావడంతో డార్లింగ్ ఫ్యాన్స్  ఆనందానికి  అవధుల్లేవు. అంతేకాదు రిలీజ్ తర్వాత కచ్చితంగా 'సలార్' వరల్డ్ వైడ్ గా బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడం గ్యారెంటీ అంటూ చెబుతున్నారు అభిమానులు.


కాగా 'సలార్' మూవీ సెప్టెంబర్ 28న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా లెవెల్ లో రిలీజ్ కాబోతోంది. మరోవైపు ఈ సినిమా డిజిటల్ హక్కుల కోసం గట్టి పోటీ కూడా నెలకొంది. రీసెంట్ గానే 'సలార్' ఓటిటి డీల్ క్లోజ్ అయినట్లు తెలుస్తోంది. 'సలార్' ఓటీటీ రైట్స్ ను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు సమాచారం. దక్షిణాదితో పాటు హిందీ భాషలకు సంబంధించిన స్ట్రీమింగ్ రైట్స్ ను సుమారు రూ.200 కోట్లకు అమెజాన్ సంస్థ దక్కించుకుందని చెబుతున్నారు. కేవలం ఓటీటీ రైట్స్ ద్వారానే ఈ సినిమా కోసం నిర్మాతలు పెట్టిన పెట్టుబడిలో సుమారు 80 నుంచి 90% వరకు రికవరీ అయినట్లే అనే టాక్ నడుస్తుంది. ఇక థియేట్రికల్, సాటిలైట్, ఆడియో రైట్స్ ద్వారా నిర్మాతలకు వచ్చేదంతా లాభాలేనని, ప్రభాస్ క్రేజ్ కి ఇది నిదర్శనం అంటూ సినీ వర్గాలు చెబుతున్నాయి.


ఇక సలార్ విషయానికి వస్తే.. 'కేజిఎఫ్' సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదూర్ ఈ సినిమాను సుమారు రూ.200 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. శృతిహాసన్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా.. సీనియర్ నటుడు జగపతిబాబు, మలయాళ అగ్ర హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్స్ గా కనిపించనున్నారు. శ్రియా రెడ్డి, రావు రమేష్, ఈశ్వరి రావు, టీనూ ఆనంద్ ఇతర కీలక పాత్రలు పోషిస్తున్నారు. రవి బాస్రూర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకి భువన గౌడ సినిమాటోగ్రఫర్ గా వ్యవహరిస్తు