Naga Chaitanya: టాలీవుడ్ లో సినిమా బ్యాగ్రౌండ్ నుంచి నటుడిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరోల్లో నాగచైతన్య ఒకరు. ‘జోష్’ లాంటి విభిన్నమైన కథతో ఇండస్ట్రీలో ఎంట్రీ ఇచ్చి యూత్ లో ఫాలోయింగ్ పెంచుకున్నాడు. తరువాత వరుసగా పలు హిట్ సినిమాలల్లో నటించాడు నాగ చైతన్య. గత కొద్ది కాలంగా నాగ చైతన్యకు సినిమాలు పెద్దగా కలిసి రావడంలేదు. గతేడాది నుంచి ఆయన నటించిన సినిమాలు అంతగా ఆడటం లేదు. 2022 లో ప్రారంభంలో వచ్చిన ‘బంగార్రాజు’ సినిమా కాస్త ఫర్వాలేదనిపించినా తర్వాత ఆయన నటించిన ‘థ్యాంక్యూ’, ‘లాల్ సింగ్ చద్దా’, ‘కస్టడీ’ సినిమాలు ఫ్లాప్ లుగా నిలిచాయి. దీంతో మళ్లీ కెరీర్ ను గాడిలో పెట్టే పనిలో పడ్డాడు చై. అందుకే ఈసారి 2024 ను ఫర్పెక్ట్ ప్లాన్ చేస్తున్నాడు. తనకు మంచి సూపర్ హిట్ సినిమాలు అందించిన ఇద్దరు దర్శకులతో ఒకేసారి సినిమాలు చేస్తున్నాడు. 


ఒకేసారి ఇద్దరి డైరెక్టర్లతో..


నాగ చైతన్య రీసెంట్ గా నటించిన సినిమాలు ఆశించినంత విజయాన్ని అందుకోలేకపోయాయి. అందుకే ఈసారి పక్కా ప్లానింగ్ తో వచ్చి హిట్లు అందుకోవాలని చూస్తున్నాడు చైతన్య. అందుకే తనకు మంచి హిట్ లు అందించిన శివ నిర్వాణ, చందూ మొండేటి లతో ఒకేసారి సినిమాలు చేస్తున్నాడు. ఇప్పటికే జాలర్ల నేపథ్యంలో చందూ మొండేటితో ఒక పాన్ ఇండియా లెవల్ సినిమా చేస్తున్నాడు నాగ చైతన్య. వీరిద్దరి కాంబినేషన్ లో గతంలో ‘ప్రేమమ్’ సినిమా వచ్చింది. ఈ మూవీ మంచి హిట్ ను అందుకుంది. దీంతో వీరిద్దరి కాంబోలో వస్తోన్న ఈ మూవీపై అంచనాలు పెరిగాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన పనులు మొదలైపోయాయి కూడా. ఇక ఈ సినిమాతోపాటు తనకు ‘మజిలీ’ లాంటి క్లాసిక్ హిట్ ను అందించిన శివ నిర్వాణతో కూడా ఓ సినిమా చేయడానికి ప్లాన్ చేశాడని సమాచారం. నాగ చైతన్య, సమంత కలసి నటించిన ‘మజిలీ’ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో తెలిసిందే. అందుకే ఇప్పుడు ఈ కాంబో పై కూడా మరోసారి ఉత్కంఠ నెలకొంది. త్వరలో ఈ సినిమా కూడా స్టార్ట్ అవుతుందని టాక్.


వచ్చే ఏడాదిలోనే రెండు సినిమాలు..


నాగ చైతన్య మళ్లీ సాలిడ్ కమ్ బ్యాక్ ఇవ్వడానికి ప్రణాళిక సిద్దం చేసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే ఒకేసారి తనకు సూపర్ హిట్ లు ఇచ్చిన ఇద్దరి డైరెక్టర్లతో సినిమాలకు సిద్దమయ్యాడని టాక్. అయితే చందూ మొండేటి సినిమాకు సంబంధించి ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ గ్యాప్ లోనే శివ నిర్వాణ సినిమాను లైన్ లో పెట్టాలని చూస్తున్నాడట నాగ చైతన్య. రెండు సినిమా షూటింగ్ లకూ క్లాష్ రాకుండా డేట్లను ఫర్ఫెక్ట్ గా ఫిక్స్ చేస్తున్నారట మేకర్స్. ఇక ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా సినిమాలు గానే తెరకెక్కుతున్నాయట. ఒకటి యాక్షన్ డ్రామా అయితే రెండోది ప్రేమ కథతో తెరకెక్కుతున్నాయట. వీలైనంత త్వరగా షెడ్యూల్ పూర్తి చేసి వచ్చే ఏడాదిలోనే సినిమాలు పూర్తి చేసి కమ్ బ్యాక్ ఇవ్వాలని చూస్తున్నాడట నాగ చైతన్య. 


Also Read: వీధి కుక్కలకు నటుడు బ్రహ్మాజీ పరిష్కారం - నేనైతే ఇలాగే చేస్తాను!


Join Us on Telegram: https://t.me/abpdesamofficial